Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...
1. నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్
దేశ పరిస్థితులను చూసిన తర్వాత తెరాసను భారాసగా మార్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీని దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో నాందేడ్‌లోని సచ్‌ఖండ్ బోడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహారాష్ట్రలోని పలువురు నాయకులకు భారాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. డీజీపీ అంజనీకుమార్‌ను తక్షణమే ఏపీకి పంపాలి: భాజపా ఎమ్మెల్యే రఘునందన్
ఐపీఎస్‌ల పోస్టింగుల్లో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా ప్రభుత్వం నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆసియా కప్ 2023.. రమీజ్ అప్పటి వ్యాఖ్యలు.. ఇప్పుడు నజామ్ మాటల్లో..!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) భేటీ జరిగింది. ఏసీసీ ఛైర్మన్, బీసీసీఐ కార్యదర్శి జైషా (Jay Shah)తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజామ్ సేథీ (Nazam Sethi) భేటీ అయ్యారు. అయినా ఆసియా కప్ - 2023 (Asia Cup 2023) నిర్వహణ ఎక్కడనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పలు నివేదికల ప్రకారం.. మినీ టోర్నీ పాక్‌లో కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. విండ్‌ఫాల్ ట్యాక్స్ రూ.1900 నుంచి రూ.5050కి పెంపు!
దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విధించే అదాటు పన్ను (windfall tax)ను ప్రభుత్వం పెంచింది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతిపై విధించే సుంకాన్ని సైతం పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను చమురుపై అదాటు పన్ను (windfall tax)ను రూ.1,900 నుంచి రూ.5,050కు పెంచింది. ఎగుమతి చేసే లీటర్ డీజిల్‌పై పన్నును రూ.5 నుంచి రూ.7.5కు సవరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా!
దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తూ ప్రజలను ఆకర్షించి ఆ తర్వాత వారి మానసిక వేదనకు కారణమవుతున్న రుణ(Loan apps), బెట్టింగ్ యాప్(Betting apps)లపై కొరడా ఝళిపించేందుకు కేంద్రం రంగం సిద్ధమైంది. ఈ యాప్‌ల ద్వారా చిన్న మొత్తంలో రుణాలు పొందిన సామాన్యుల్ని ఘోరంగా దోపిడీకి, వేధింపులకు గురిచేసి అనేకమంది ఆత్మహత్యలకు దారితీస్తోన్న ఈ దా‘రుణ’ యాప్‌ల వ్యవహారంపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మినిట్‌మ్యాన్-3 అణుక్షిపణులపై చైనా నిఘా.. బెలూన్ పేల్చివేత!
చైనా-అమెరికా మధ్య ఓ బెలూన్ కొత్త చిచ్చుపెట్టింది. ఇటీవల అమెరికా ఉత్తర భాగంలో అణుక్షిపణులను భద్రపర్చిన మోంటానాపై ఓ హైఆల్టిట్యూడ్ నిఘా బెలూన్ కలకలం సృష్టించింది. దీనిని అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూల్చివేశారు. ఇందుకోసం అమెరికా అత్యాధునిక విమానం ఎఫ్-22 ఫైటర్‌ను రంగంలోకి దించింది. ఈ ఫైటర్ జెట్ ఎయిర్ ఇంటర్‌సెప్ట్ క్షిపణి 9ఎక్స్ సైడ్‌విండర్‌ను ప్రయోగించి బెలూన్‌ను పేల్చివేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అలా చేస్తే నా కెరీర్‌లో రిస్క్‌లో పడుతుందని ఆయన పది సార్లు చెప్పాడు: హనుమ విహరి
ఇటీవల మధ్యప్రదేశ్‌తో రంజీ క్వార్టర్స్‌లో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి (Hanuma Vihari) గొప్ప పోరాటం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తొలి రోజు అవేశ్ విసిరిన బౌన్సర్ తగిలి మణికట్టులో చీలిక వచ్చి 16 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. జట్టుకు వీలైనన్ని పరుగులు అందించాలనే ఉద్దేశంతో చేతికి కట్టు ఉన్నా రెండో రోజు పదకొండో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. కుడిచేతి వాటం బ్యాటరైన అతను ఎడమచేతి వాటానికి మారి.. ఒక్క చేత్తోనే (కుడి) బ్యాటింగ్ కొనసాగించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ‘777 చార్లీ’ సినిమా కథలా సాగింది వీరి లద్దాఖ్ ప్రయాణం
‘777 చార్లీ’.. ఇటీవలి కాలంలో వచ్చిన ఈ సినిమా కథ మొత్తం ఓ శునకం నేపథ్యంలో సాగుతుంది. అందులో కుక్కకు మంచు అంటే చాలా ఇష్టం. దాంతో బైక్‌పై కథానాయకుడు, కుక్క కలిసి ప్రయాణం చేస్తూ మంచు కురిసే ప్రాంతానికి చేరుకుంటారు. సరిగ్గా అలాంటి ప్రయాణమే(trip) చేస్తూ ఇటీవల సామాజిక మాధ్యమాల దృష్టిని ఆకర్షించాడు చౌ సురేంగ్ రాజ్ కన్వార్. తన పెంపుడు శునకం(dog)తో ఇటీవల దిల్లీ నుంచి లద్ధాఖ్ వరకు ప్రయాణించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘డీఏ’ పెంపు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే కరవు భత్యాన్ని(Dearness Allowance) నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది. దీంతో మూల వేతనంలో డీఏ(DA) ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది. ఈ విషయమై ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్ర ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
పాకిస్థాన్(Pakistan) మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (79)(Pervez Musharraf) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్ అనే రుగ్మతతో బాధపడుతోన్న ఆయన.. దుబాయిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అధ్యక్షుడిగా ఎనిమిదేళ్ల పాటు పాకిస్థాన్(Pakistan)ను ‘నియంత’ వలే పాలించిన ముషారఫ్(Pervez Musharraf) అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Antibiotics: కొవిడ్ కేసుల పెరుగుదల వేళ.. యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు
-
Movies News
Amitabh Bachchan: గాయం నుంచి కోలుకున్న అమితాబ్.. సోషల్ మీడియాలో పోస్ట్
-
India News
Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!
-
Sports News
WPL: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?