Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 02 Feb 2023 13:00 IST

1. KTR: మనం ఎందుకు అలా ఆలోచించడం లేదు?: కేటీఆర్‌

భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్‌హెచ్‌ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్‌లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలున్నారని.. అయితే మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్‌ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టట్లేదన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. IND vs NZ: సవాళ్లను స్వీకరించడం బాగుంటుంది.. అందుకే తొలుత బ్యాటింగ్‌: హార్దిక్‌ పాండ్య

తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. శుభ్‌మన్ గిల్ (126*), హార్దిక్ పాండ్య (4/16) రాణించడంతో కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 168 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 చరిత్రలోనే అత్యంత భారీ విజయం ఇదే కావడం విశేషం. సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు, హార్దిక్ పాండ్య ‘ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌’గా ఎంపికైన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం గిల్‌, పాండ్య మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Adani FPO: అందుకే ఎఫ్‌పీఓను ఉపసంహరించుకున్నాం: గౌతమ్ అదానీ

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (Adani Enterprises FPO)ను ఉపసంహరించుకోవడంపై అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) స్వయంగా వివరణ ఇచ్చారు. స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని వివరించారు. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్‌’పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్‌లో గందరగోళం

పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్‌ (Adani Group)పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Vande Metro: ఊళ్ల నుంచి నగరాలకు ‘వందే మెట్రో’.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ (Railway Ministry)కు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసిన వేళ.. రైల్వే మంత్రి నుంచి కీలక ప్రకటన వెలువడింది. పెద్ద నగరాలకు సమీప ప్రాంతాల నుంచి వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) మినీ వెర్షన్ ‘వందే మెట్రో (Vande Metro)’ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. iCET: అవన్నీ జరిగేవి కావులే.. భారత్‌-అమెరికా ఒప్పందంపై చైనా వాఖ్యలు

భారత్(India)‌-అమెరికా(USA) మధ్య అంత్యంత కీలకమైన ఐసీఈటీ (ఇనీషియేటీవ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ)పై చైనా(china) అక్కసు వెళ్లగక్కింది. ఈ కొత్త ఒప్పందంపై చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ అక్కసు వెళ్లగక్కుతూ కథనం వెలువరించింది. కలిసి ఉన్న వ్యక్తుల మధ్య విభిన్న ఆలోచనలు.. ఎందుకు..? అని ప్రశ్నించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్‌

తన స్నేహితురాలు, గాయని చిన్మయి (Chinmayi) గురించి తాజాగా ట్వీట్ చేశారు నటి సమంత (Samantha). చిన్మయిని క్వీన్‌ అంటూ అభివర్ణించారు. ఎంతోకాలం తర్వాత సమంత - చిన్మయి మధ్య తాజాగా జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Miss Universe : మిస్‌ యూనివర్స్‌ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!

ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌(Miss Universe) వేడుకలు వైభవంగా జరిగాయి. అమెరికా(US) భామ ఆర్‌ బానీ గాబ్రియేల్‌ (RBonney Gabriel) విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అగ్రరాజ్యంలో జరిగిన ఈ అందాల పోటీల్లో రష్యా భామ అన్నా లిన్నికోవా(Anna Linnikova) తీవ్ర నిరాదరణ, అవమానాలు ఎదుర్కొన్నారట. మీడియాతో మాట్లాడుతూ.. ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Income Tax: పన్ను చెల్లింపుదారులకు చిదంబరం సూచన!

బడ్జెట్‌ 2023 (Budget 2023)లో ఆదాయ పన్ను (Income Tax) విధానంలో పలు మార్పుల నేపథ్యంలో వివిధ వర్గాల్లో దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త, పాత పన్ను విధానాల పేరిట ప్రభుత్వం హడావుడి సృష్టించిందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం అన్నారు. తద్వారా ప్రజల వ్యక్తిగత పొదుపు ప్రాధాన్యాన్ని విస్మరించిందని ఆరోపించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Spain: పశువుల వలసలకు ప్రతీకగా.. స్పెయిన్‌లో బాకియా పండుగ

పశువుల వలసలకు ప్రతీకగా జరుపుకునే బాకియా పండుగ స్పెయిన్‌లో వైభవంగా జరిగింది. ఏటా శీతాకాలంలో జరుపుకునే ఈ పండుగకు పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ స్పెయిన్ వీధుల్లో సందడి చేశారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని