Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 05 Feb 2023 13:10 IST

1. Musharraf: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కన్నుమూత!

పాకిస్థాన్‌ (Pakistan) మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ (Parvez Musharraf)(79) కన్నుమూసినట్లు ఆ దేశ వార్తాసంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని అమెరికన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ముషారఫ్‌ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన ‘జియో న్యూస్‌’ వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. APSLPRB: కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. కానిస్టేబుల్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని.. ఈ పరిస్థితుల్లో అదనపు భద్రత కల్పించాల్సింది పోయి ఉన్న గన్‌మెన్లను తొలగిస్తారా? అని వైకాపా (YSRCP) తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో ఈ పనిచేశారో తెలియదని.. కానీ ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఇలా జరగదన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. ‘కార్గిల్‌’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ (79) గత కొంతకాలంగా అమైలాయిడోసిస్‌ అనే రుగ్మతతో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. అధ్యక్షుడిగా ఎనిమిదేళ్ల పాటు పాకిస్థాన్‌ను ‘నియంత’ వలే పాలించిన ముషారఫ్‌ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. భారత్‌, పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధానికి కుట్రలు పన్నడం దగ్గర్నుంచి.. మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య వరకు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవి కాంక్షతో ఏకంగా రాజ్యంగాన్నే రద్దు చేసి.. అత్యవసర స్థితిని విధించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Aaditya Thackeray: రాజీనామా చేసి నాపై పోటీ చెయ్‌.. సీఎంకు ఆదిత్య సవాల్‌!

శివసేన (ఉద్ధవ్‌ బాల్‌ ఠాక్రే) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray).. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)పై నిప్పులు చెరిగారు. ఆయన్ని రాజ్యాంగ విరుద్ధ సీఎంగా అభివర్ణించారు. వర్లీ నియోజకం వర్గం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపును తితిదే అధికారులు ప్రారంభించారు. శ్రీవారి ఆలయంలో ఉన్న హుండీలను అక్కడి నుంచి ఆలయానికి సమీపంలోని నూతన పరకామణి భవనంలోకి ఇవాళ ఉదయం తరలించారు. ప్రత్యేకమైన ట్రాలీలు, క్రేన్ల ద్వారా లారీల్లో హుండీలను తీసుకెళ్లారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్‌

తన తనయుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) సతీమణి, కోడలు స్నేహారెడ్డి (Sneha Reddy) గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్నేహకు  పని చేయాల్సిన అవసరం లేనప్పటికీ ఆమె చేస్తోందని తెలిపారు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan) సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. IND vs AUS: ఇయాన్‌ హీలీ ‘పిచ్‌’ వ్యాఖ్యలకు జాన్‌ రైట్ కౌంటర్‌..

నాలుగు టెస్టుల సిరీస్‌ దగ్గరపడటంతో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) ఆటగాళ్లతోపాటు మాజీల వ్యాఖ్యల వేడి రాజుకొంటోంది. ఇప్పటికే ఆసీస్‌ నుంచి స్టీవ్‌ స్మిత్, లబుషేన్, ఇయాన్ హీలీ, గ్రెగ్ ఛాపెల్‌ వంటి వారు తమ వ్యూహాలకు పదునుపెట్టారు. పిచ్‌లు, జట్టు బలాలు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్‌ (Team India) నుంచి కూడా రవిచంద్రన్ అశ్విన్, సునీల్ గావస్కర్, ఇర్ఫాన్‌ పఠాన్, మహమ్మద్ కైఫ్ కూడా ఘాటుగానే స్పందించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Sundeep Kishan: రిలేషన్‌షిప్‌ నాకు సెట్‌ కాదు.. బ్రేకప్‌ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్‌ కిషన్‌

ప్రేమ అనే కాన్సెప్ట్ తనకు సెట్‌ కాదని నటుడు సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) అన్నారు. ప్రస్తుతానికి తాను ఎవరితోనూ ప్రేమలో లేనని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రిలేషన్‌లోకి వెళ్తానన్నారు. ‘మైఖేల్‌’ (Michael) ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను బ్రేకప్‌ బాధను చూశానని అన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Windfall tax: విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ రూ.1900 నుంచి రూ.5050కి పెంపు!

దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విధించే అదాటు పన్ను (windfall tax)ను ప్రభుత్వం పెంచింది. డీజిల్‌, విమాన ఇంధనం (ATF) ఎగుమతిపై విధించే సుంకాన్ని సైతం పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను చమురుపై అదాటు పన్ను (windfall tax)ను రూ.1,900 నుంచి రూ.5,050కు పెంచింది. ఎగుమతి చేసే లీటర్‌ డీజిల్‌పై పన్నును రూ.5 నుంచి రూ.7.5కు సవరించింది. లీటర్‌ విమాన ఇంధనంపై రూ.3.5 నుంచి రూ.6కు పెంచింది. ఫిబ్రవరి 4 నుంచే కొత్త పన్నులు అమల్లోకి వచ్చాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని