Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Mar 2023 13:04 IST

1. వివేకా హత్య కేసు ఇంకా ఎంత కాలం విచారిస్తారు?: సీబీఐని ప్రశ్నించిన సుప్రీం

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును ఇంకా ఎంత కాలం విచారిస్తారని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ‘విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండ’ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భాజపా నేతలతో వేదికపై బిల్కిస్‌బానో దోషి.. కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

భాజపా అంటే.. బలాత్కార్‌ జస్టిఫికేషన్‌ పార్టీ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బిల్కిస్‌ బానో కేసు దోషులతో భాజపా నేతలు సన్నిహితంగా ఉండటం ఆ పార్టీ విధానాలను తెలియజేస్తుందని కేటీఆర్‌ ట్విటర్‌లో విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తుది నివేదికకు 3 నెలల సమయం కావాలి: పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ

పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. మూడు నెలల పాటు విచారణను వాయిదా వేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ముంపు తలెత్తుతున్నందున దానికి పరిష్కార మార్గాలు చూపాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం మరోసారి విచారణకురానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టీఎస్‌ఆర్టీసీ ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం

ఉచిత వైఫై ఏసీ స్లీపర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్‌ బస్సులకు హైటెక్‌ హంగులు జోడించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందించింది. ఈ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సర్జరీ తర్వాత ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లతో జస్ప్రీత్‌ బుమ్రా సందడి

టీమ్‌ఇండియా అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) గత కొంతకాలం నుంచి వెన్ను గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ గాయం నుంచి పూర్తిగా బయటపడాలంటే శస్త్రచికిత్స నిర్వహించాలని వైద్యులు సూచించారు. దీంతో బుమ్రాకు ఇటీవల న్యూజిలాండ్‌లో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వ్యక్తిగత ప్రమాద బీమా.. ఈ విషయాలు తెలుసా?

కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రయాణాలకు చాలా మంది సొంత వాహనాలను ఉపయోగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోయింది. అలాగే రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అనుకోని దుర్ఘటనల నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు కుటుంబానికీ భరోసానివ్వడం చాలా ముఖ్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అనర్హతపై సుప్రీంకు లక్షద్వీప్‌ మాజీ ఎంపీ ఫైజల్‌.. రేపు విచారణ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు నిలబడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసులో జైలు శిక్ష పడి అనర్హత (Disqualification)కు గురైన లక్షద్వీప్‌ మాజీ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ (Mohammed Faizal) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ముందస్తు విచారణ చేపట్టాలని కోరగా.. సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) అందుకు అంగీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రాహుల్‌ ‘అనర్హత’పై దద్దరిల్లిన పార్లమెంట్‌.. నిమిషానికే ఉభయసభలు వాయిదా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దుకు నిరసనగా పార్లమెంట్‌ (Parliament)లో ప్రతిపక్షాలు సోమవారం ఆందోళనలకు దిగాయి. రాహుల్‌పై అనర్హత వేటు (Disqualification), అదానీ వ్యవహారంపై విపక్ష సభ్యులు గట్టిగట్టిగా నినాదాలు చేశాయి. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు..

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకీ మోత మోగింది. ఓ గురుద్వారాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో జరిగిందీ ఘటన. దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇమ్రాన్‌ను సాగనంపాలి.. లేకపోతే మేం పోవాలి: పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఉద్దేశించి ఆ దేశ మంత్రి రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ అధికార పార్టీకి శత్రువుగా మారారన్నారు. ఆయనైనా లేక తామైనా రాజకీయ రంగానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘ఇమ్రాన్‌ ఖాన్‌ను అయినా రాజకీయాలకు దూరం చేయాలి. లేదా మేమైనా దూరం కావాలి’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు