Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 30 Mar 2023 21:30 IST

1. కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్‌

తెలంగాణకు ఏమీ ఇవ్వని భాజపా, మోదీ మనకెందుకు అని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వనప్పుడు కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఎందుకు భరించాలి? సహించాలి? అని ప్రశ్నించారు. తన పార్టీ నుంచే తెలంగాణ పేరును తొలగిస్తే.. కేసీఆర్‌ను ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి  వైకాపా నేతలకు సవాల్‌ విసిరారు. ఉదయగిరికి వస్తే తరిమికొడతామన్న వాళ్లు రావాలంటూ పట్టణంలోని బస్టాండ్‌ సెంటరులో కుర్చీ వేసుకుని కూర్చుకున్నారు. అక్కడికి ఎమ్మెల్యే అనుచరులు కూడా భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్‌కాల్‌?: హరీశ్‌రావు ఫైర్‌

ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలను సైతం 12శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్యగా పేర్కొన్నారు.  వచ్చే నెల నుంచి ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుండటంపై ఆయన ట్విటర్‌లో మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘రాహుల్‌జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్‌ ట్వీట్‌కు భాజపా కౌంటర్‌!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అనర్హత వ్యవహారం దేశీయంగానే గాక.. అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం అగ్రరాజ్యం అమెరికా (USA) రాహుల్ వ్యవహారంపై స్పందించగా..  తాజాగా జర్మనీ (Germany) సైతం రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దవ్వడం అంశాన్ని గమనిస్తున్నామని చెప్పింది. జర్మనీ స్పందనపై ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ( Digvijaya Singh) ట్వీట్‌ వివాదాస్పదమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఐపీఎల్‌లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్‌’ రూల్..?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్ ప్రారంభం కానుంది. గతేడాది ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఐపీఎల్‌ నిర్వాహకులు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేశారు.  ప్రస్తుత సీజన్‌ను అభిమానులకు మరింత రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్‌ మోదీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై  తాను దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఆయనకు తగిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్టు  భాజపా ఎంపీ సుశీల్ మోదీ(Sushil Modi) అన్నారు. 2019లో కర్ణాటకలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించగా..  తాను దాఖలు చేసిన పిటిషన్‌పై పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే న్యాయస్థానం వచ్చే నెల రాహుల్‌ను విచారణకు పిలిచిందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్‌ న్యూస్‌

హెచ్‌1బీ వీసా (H1B Visa)తో అమెరికా (USA) పని చేస్తున్న విదేశీ  సాంకేతిక నిపుణులకు, ఉద్యోగులకు అనుకూలంగా అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ’ సంస్థ దాఖలు చేసిన దావాను యూఎస్‌ జిల్లా న్యాయమూర్తి తన్యా చుక్తాన్‌ కొట్టివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒకే ఒక్కరు.. ఏడాదిలో స్విగ్గీలో రూ.6లక్షల ఇడ్లీలు ఆర్డర్‌

ప్రాంతాన్ని బట్టి మన దేశంలో బ్రేక్‌ఫాస్ట్‌ వంటకాలు మారుతుంటాయి. అయితే, ఎన్ని రుచులున్నా దక్షిణాదిలో ‘ఇడ్లీ (Idli)’ చాలా పాపులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌. రుచితో పాటు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఇడ్లీని అమితంగా ఇష్టపడుతారు. అందుకేనేమో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఈ వంటకాన్నే అత్యధికంగా ఆర్డర్‌ చేశారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.6లక్షల విలువ చేసే ఇడ్లీలను కొనుగోలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్‌!

దేశంలో కరోనా(corona virus) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి కలకలం రేగుతోంది. ఈ వైరస్‌బారిన పడిన వారి సంఖ్య ఇటీవలి కాలంలో రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే అమాంతం 40శాతం మేర కేసులు పెరిగి దేశవ్యాప్తంగా 3,016 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు

తన తండ్రి దూరమైన తర్వాత ఆత్మహత్య ఆలోచనలతో సతమతమైనట్లు నటి, కాంగ్రెస్ (Congress) మాజీ ఎంపీ దివ్య స్పందన (Divya Spandana) వెల్లడించారు. ఆ సమయంలో అగ్రనేత రాహుల్ గాంధీ((Rahul Gandhi) తనకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. ఇటీవల ఓ కన్నడ టాక్‌షోలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు