Top Ten News @ IPL Final: ఐపీఎల్‌ టాప్‌ 10 కథనాలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 May 2023 13:32 IST

1. సీఎస్‌కేకు ఐదో టైటిల్‌.. ఈ సీజన్‌లో రికార్డులు ఇవే!

దాదాపు రెండు నెలలపాటు అలరించిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) ముగిసింది. ఇంతకుముందెన్నడూ జరగని విధంగా తొలిసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ రిజర్వ్‌డేకి వాయిదాపడింది. గుజరాత్‌ టైటాన్స్‌ సొంతమైదానంలోనే ఆ జట్టును ఓడించి చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK vs GT) కప్‌ను సొంతం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సీఎస్‌కే బ్యాటర్ డేవన్ కాన్వే.. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్ ది టోర్ని’ అవార్డును సొంతం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పరిస్థితి ఎలా ఉన్నా.. అతడి వద్ద ఓ ప్లాన్‌ పక్కా!

ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) టైటిల్‌ను గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతోపాటు ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) నాయకత్వంపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను (CSK vs GT) మట్టికరింపిచి మరీ ఐదో కప్‌ను సీఎస్‌కే సొంతం చేసుకుంది. దీంతో సోషల్‌ మీడియాలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా మాజీ ఆటగాళ్లు, క్రికెట్‌ అభిమానులు పోస్టులు పెట్టారు. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో స్టోరీస్‌ పోస్టు పెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘కెప్టెన్‌ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న ధోనీ.. 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరఫున ఆడిన ధోనీ.. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కూ ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ 243 మ్యాచ్‌లు, దినేశ్‌ కార్తిక్ 242 మ్యాచ్‌లతో కొనసాగుతున్నారు. ఐదు టైటిళ్లను గెలిచిన సారథిగా రోహిత్‌ను ధోనీ సమం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రిటైర్‌మెంట్‌పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL) చరిత్రలో ఐదు టైటిల్స్‌ గెలిచిన రెండో జట్టుగా చెన్నై సూపర్  కింగ్స్ (CSK) అవతరించింది. ముంబయిని సమం చేస్తూ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌లో (IPl 2023) గుజరాత్‌ టైటాన్స్‌ను చివరి (CSK vs GT) బంతికి ఓడించి మరీ సీఎస్‌కే విజేతగా నిలిచింది. చివరి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా కొట్టిన రవీంద్ర జడేజాను ఎత్తుకుని మరీ ధోనీ (MS Dhoni) సంబరాలు చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు

అంబటి రాయుడు అదరగొట్టాడు. మెరుపు ఆటతో ముగింపుని చిరస్మరణీయం చేసుకున్నాడు. గుజరాత్‌తో ఐపీఎల్‌ ఫైనల్‌ రూపంలో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన అతడు కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి ఉన్నంతసేపు మెరుపు షాట్లతో చెన్నైని విజయానికి చేరువ చేసి ఔటయ్యాడు. 25 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి స్థితిలో క్రీజులోకి వచ్చిన అతడు.. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో మోహిత్‌ బౌలింగ్‌లో వరుసగా 6,4,6తో లక్ష్యాన్ని తేలిక చేశాడు. అతడు ఔటయ్యేసరికి చెన్నై 15 బంతుల్లో 23 పరుగులు చేయాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మహీ భాయ్‌.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు

 గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్‌ 2023 సీజన్‌ (IPL 2023) టైటిల్‌ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs GT) అవతరించింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో సీఎస్‌కే ఐదోసారి కప్‌ను సొంతం చేసుకుంది. కీలక సమయంలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సిక్స్‌, ఫోర్‌ కొట్టి చెన్నైను గెలిపించాడు. ఎప్పుడూ తన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండే ధోనీ తొలిసారి సంబరపడ్డాడు. ఈ క్రమంలో విన్నింగ్‌ షాట్‌ కొట్టిన రవీంద్ర జడేజానూ ఎత్తుకోవడం నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా జడ్డూ కూడా తన ట్విటర్ వేదికగా ధోనీని ఉద్దేశించి ప్రత్యేక పోస్టు పెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉత్కంఠతో కళ్లుమూసుకుని.. ఆనందపరవశుడై జడేజాను ఎత్తుకున్న ధోనీ

ఐపీఎల్-16వ సీజన్‌ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ను ఓడించి ఐదోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. చివరి రెండు బంతులను జడేజా సిక్స్‌, ఫోర్‌గా మలచడంతో చెన్నై శిబిరం సంబరాల్లో మునిగితేలింది. మరోవైపు ఎంత పెద్ద విజయమైనా, ఘోర పరాజయమైనా కూల్‌గా ఉండే ధోనీ  ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించడు. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ కాస్త ఉద్వేగానికి లోనైట్లు అనిపించిది. చివరి రెండు బంతుల సమయంలో కళ్లు మూసుకుని ఉండడం కెమెరాల్లో కనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు.. జడేజా చెన్నైని గెలిపించాడిలా..

ఐపీఎల్‌-16వ సీజన్‌ ఫైనల్‌ పోరు అసలుసిసలు టీ20 మజాను అందించింది. ఓవర్‌ ఓవర్‌కు మలుపులు తిరుగుతున్న వేళ.. క్రికెట్‌ అభిమానులు పసందైన వినోదాన్ని ఆస్వాదించారు. స్టేడియంతో పాటు టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను టైటిల్‌ పోరు మునివేళ్లపై నిలుచోబెట్టింది. చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్ జట్ల మధ్య ఉత్కంఠగా సాగిన పోరులో చివరకు చెన్నైదే పైచేయి అయింది. జడేజా అద్భుత బ్యాటింగ్‌తో ధోనీ సేన ఐదోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహి మార్కు.. వారిని ఆడించి.. చెన్నైని ఛాంపియన్‌గా నిలిపి..

2018 ఐపీఎల్‌లో ఎక్కువగా వయసు మళ్లిన ఆటగాళ్లతో నిండిన చెన్నై జట్టును చూసి ‘డాడీస్‌ ఆర్మీ’ అంటూ ఎద్దేవా చేశారు జనాలు. చివరికి చూస్తే విజేత ఆ జట్టే. 2020లో దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో చెన్నై పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశను కింది నుంచి రెండో స్థానంతో ముగించింది. తర్వాతి ఏడాది ఆ జట్టుపై ఏమాత్రం అంచనాల్లేవు. చివరికి చూస్తే ఛాంపియన్‌ చెన్నై. ఇదంతా ధోని నాయకత్వ మహిమ అనడంలో సందేహం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెన్నై పట్టుకుపోయింది.. ఆఖరి బంతికి అద్భుత విజయం

ఐపీఎల్‌ ఫైనళ్లలో మొదట బ్యాటింగ్‌ జట్లవే మెజారిటీ విజయాలు. అయినా సోమవారం టాస్‌ గెలిచిన ధోని బౌలింగ్‌ ఎంచుకున్నాడు! మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటంతో.. ఛేదనకే మొగ్గు చూపాడు చెన్నై సారథి. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ ఏకంగా 214 పరుగులు కొట్టేసరికి.. ధోనీసేనకిక కష్టమే అనుకున్నారంతా! అక్కడి నుంచి మ్యాచ్‌ యథాప్రకారం కొనసాగి ఉంటే మజానే ఉండేది కాదేమో! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని