Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 01 Jun 2023 13:00 IST

1. Rahul Gandhi: ఇలాంటివి సాధ్యమని నేను ఊహించలేదు: రాహుల్‌ గాంధీ

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో లోక్‌సభ సభ్యత్వం రద్దును తాను ఊహించలేదని కాంగ్రెస్‌ (Congress ) నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. IPL 2023: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్’ ఎవరికి కలిసొచ్చిందంటే?

ఐపీఎల్ (IPL) చరిత్రలో తొలిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తీసుకొచ్చారు. ప్రతి జట్టూ ఇంపాక్ట్‌ రూల్‌ను వినియోగించుకుంది. కొన్ని మ్యాచుల్లో అద్భుత ఫలితాలు రాగా.. మరికొన్నింట్లో మాత్రం విఫలమైంది. ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను వినియోగించిన తొలి జట్టుగా ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ నిలిచింది. మరి ఈ సీజన్‌లో ఇలా ఆయా జట్లపై ‘ఇంపాక్ట్‌’ చూపిన ప్లేయర్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Elon Musk: ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్‌ మస్క్‌

ప్రపంచ ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (Bernard Arnault) సంపద బుధవారం 2.6 శాతం కుగింది. దీంతో ‘బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ’ (Bloomberg Billionaires Index)లో మస్క్‌ పైకి ఎగబాకారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. CM Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: జగన్‌

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. దీన్ని తాను గట్టిగా నమ్ముతున్నట్లు ఏపీ సీఎం జగన్‌(CM Jagan) అన్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ‘వైఎస్‌ఆర్‌ రైతుభరోసా’ (YSR Rythu Bharosa) నిధులను సీఎం బటన్‌ నొక్కి విడుదల చేశారు.  ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 52.31 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.3,923.21 కోట్లను జమ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Siddharth: నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని.. ‘ఇండియన్‌2’ పై సూపర్‌ న్యూస్‌ చెప్పిన సిద్దార్థ్‌

ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఇండియన్‌-2’ (Indian 2). శంకర్‌ దర్శకత్వంలో మల్టీటాలెంటెడ్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం అప్‌డేట్స్‌ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’కు ప్రేక్షకులు ఏస్థాయి విజయం అందించారో తెలిసిందే. త్వరలో రానున్న దాని సీక్వెల్‌ కూడా అంచనాలకు మించి ఉంటుందని హీరో సిద్దార్థ్‌ (Siddharth) అన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. నా తుది జట్టులో జడ్డూ ఉండడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌ జూన్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల కీలక ప్లేయర్లు లండన్‌లోని ఓవల్‌ చేరుకుని సాధన మొదలుపెట్టారు. బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో అదరగొట్టిన భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. వారిని తీసుకోవడానికిగల కారణాలను వెల్లడించాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Uttarakhand: కొండచరియల బీభత్సం.. చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పర్యటిస్తోన్నవారికి¨ మరోసారి కొండచరియలు తీవ్ర అంతరాయం కలిగించాయి. భారీగా కొండచరియలు విరిగిపడటంతో 300 మంది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వాటి వల్ల రాష్ట్రంలోని పితోరాగఢ్‌ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్‌ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రయాణికుల రాకపోకల కోసం రెండు రోజుల తర్వాత ఈ రోడ్డును తెరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Kim Jong Un: కిమ్‌ బరువు 140 కిలోలు.. తీవ్ర నిద్రలేమితో అవస్థలు..!

ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎన్‌ఐఎస్‌) అంచనాకొచ్చింది. దీనికి తోడు అతడు విపరీతంగా బరువు పెరిగినట్లు గుర్తించింది. అతడికి ఉన్న ఆల్కహాల్‌, నికోటిన్‌ వ్యసనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. IBPS RRB నోటిఫికేషన్‌.. 8,000 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ షురూ

‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS)’ ఏటా ‘రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (RRB)ల్లో నియామకాలకు పరీక్ష నిర్వహిస్తుంటుంది. తాజాగా 2023కు సంబంధించిన నోటిఫికేషన్‌ను (IBPS RRB 2023 Notification) విడుదల చేసింది. మొత్తం 8,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిలో క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టులు ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Gas Cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

దిల్లీ: దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల ధరను (Commercial LPG cylinder price) చమురు సంస్థలు సవరించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను ₹83.50 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ₹1,773కు దిగొచ్చింది. కొత్త ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత మూడు నెలల వ్యవధిలో వాణిజ్య సిలిండర్ ధర (Commercial LPG cylinder price) మూడు సార్లు తగ్గింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు