Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. నవీన్ హత్య కేసులో.. పోలీసుల సీన్ రీకన్‌స్ట్రక్షన్
నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలో భాగంగా.. వరుసగా రెండో రోజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 9 వరకు నిందితుడిని కస్టడీకి కోర్టు అనుమతించగా.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం హరిహరకృష్ణను ఈరోజు తెల్లవారుజామున ఘటనాస్థలికి పోలీసులు తీసుకెళ్లారు. హత్య చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. నవీన్‌ని హత్య చేయడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అంబానీ డ్రైవర్ జీతం.. తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
సెలబ్రిటీ.. ఈ పదానికున్న ఆకర్షణే వేరు. సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌తో పాటు వారి దగ్గర పనిచేసేవారు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటారు. తాజాగా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) వ్యక్తిగత డ్రైవర్ వార్తల్లో నిలిచారు. అతడి జీతం గురించిన వివరాలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోపై వార్తా కథానాలు వెలువడ్డాయి. 2017లో ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలని దానిని బట్టి తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ట్రావిస్ హెడ్‌పై శ్రేయస్ జోకులు.. స్టంప్ మైక్‌లో రికార్డు
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border - Gavaskar Trophy)లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మూడో మ్యాచ్(IND vs AUS)లో బొక్కబోర్లా పడింది. ఇందౌర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఈ సిరీస్‌లో భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించడమే కాకుండా, డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final)లోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్(Travis Head)ని శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఏదో అనడం స్టంప్ మైక్‌లో రికార్డయ్యింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ‘వీర సింహారెడ్డి’.. ఆ సీన్ పెట్టుంటే సినిమా ఆడేది కాదు: పరుచూరి
నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. ప్రస్తుతం ఇది ఓటీటీ వేదికగా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే ‘వీర సింహారెడ్డి’పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna). ఈ సినిమా చూస్తుంటే ఎన్టీఆర్ నటించిన ‘చండశాసనుడు’ (Chanda Sasanudu) గుర్తుకు వచ్చిందని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 6 కార్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రేవంత్‌రెడ్డికి చెందిన 4 కార్లతో పాటు 2 న్యూస్ ఛానళ్ల కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఒక కారులో ప్రయాణిస్తున్న పలువురు మీడియా రిపోర్టర్లు గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అక్కకు కృతజ్ఞతలు చెప్పిన మంచు మనోజ్
నటుడు మంచు మనోజ్ (Manoj), తన సోదరి, నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఎప్పుడూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారనే విషయం తెలిసిందే. తనని ఎప్పుడూ సంతోషంగా చూసుకునే అక్కకు మనోజ్ (Manoj) కృతజ్ఞతలు చెప్పారు. ‘‘లవ్ యూ అక్కా. నువ్వు చేసిన ప్రతిదానికీ కృతజ్ఞతలు. ఏ జన్మ పుణ్యమో నాది.. నువ్వు అక్కలా దొరికావు’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కొవిడ్ మూలాల గురించి మీకు తెలిసింది చెప్పండి..!
కరోనా (Coronavirus).. ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అడపాదడపా కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. అయితే ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి, ఇన్ని దేశాలకు పాకిందనే దానిపై కచ్చితమైన సమాచారం మాత్రం ఇంతవరకు లభించలేదు. ఈ వైరస్ చైనా ల్యాబ్ నుంచే లీక్ అయిందని తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమవ్వగా.. దానిపై అమెరికా ఇటీవల మరో నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ప్రమాదంలో పగడపు దీవులు.. మేలుకోకపోతే అంతమే!
సముద్ర తీరాల్లో అందమైన పడగపు దిబ్బలంటాయి(Coral Reefs). రంగు రంగుల్లో ఉన్న వాటిని చూడగానే రాళ్లుగా భావిస్తాము. నిజానికి అవి రాళ్లు కావు. పాలిప్స్ అనే జీవులు. జూజాంతలీ(Zooxanthellae)గా పిలిచే అల్గే(algae) పాలిప్స్ సమూహాలకు అతుక్కొని వాటికి కావాల్సిన కిరణజన్య సంయోగ క్రియ(photosynthesis), పోషకాలను అందిస్తాయి. దాంతో పడగపు దిబ్బలు రంగు సంతరించుకుంటాయి. పాలిప్స్, అల్గేలు సహజీవనం సాగిస్తుంటాయి. పగడపు దిబ్బలు సమూహంతో పగడపు దీవి ఏర్పడాలంటే ఆ ప్రక్రియ ఒక రోజులో జరిగేది కాదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. వధువుకు ‘మేకప్’ షాక్.. పెళ్లి వద్దన్న వరుడు..!
తన పెళ్లిలో మరింత అందంగా కన్పించాలని మేకప్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిందో నవ వధువు (Bride). అక్కడ చేసిన ఓ ప్రయోగం బెడిసికొట్టి ఉన్న ముఖం కాస్తా వికారంగా మారింది. దీంతో నాకు ఈ అమ్మాయి వద్దు మొర్రో అంటూ వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. కర్ణాటక (Karnataka)లో హసన్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతలు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇంటి ప్లాన్లను అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారని అధికారులు వాటి కూల్చివేతను చేపట్టారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగరపాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో కూలగొట్టారు. కూల్చివేతలను అడ్డుకొంటూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిరసనల మధ్యే సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్ ఖాన్
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు