Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
బెలూన్ వ్యవహారం అమెరికా(US), చైనా(China) సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. గత ఏడాది జరిగిన జీ20 సదస్సులో భాగంగా తమ ద్వైపాక్షిక బంధాన్ని మెరుగుపర్చుకునేందుకు ఇరు దేశాలు చేసిన ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంప (Earthquake) బాధితులను కాపాడే అవకాశాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఒక్క తుర్కియే(Turkey)లోనే భూకంపం కారణంగా 2,000 భవనాలు కూలినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే.. అనధికారికంగా ఆ దేశ 10 ప్రావిన్స్‌ల్లో కలిపి ధ్వంసమైన భవనాల సంఖ్య 6,000 పైనే ఉంటుందని అంచనా. వీటిల్లో ఆసుపత్రులు, పబ్లిక్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో ఈ ఘటన జరిగింది. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి వెళ్లి మరణించారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరాడక మొత్తం ఏడుగురూ చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశీలించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. KS Bharat: రాకెట్ స్పీడ్‌తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది: కేఎస్ భరత్
మరో తెలుగు కుర్రాడు టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. గతంలో మహమ్మద్ అజారుద్దీన్, వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్‌కే ప్రసాద్.. సిరాజ్ వీరంతా తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వైజాగ్‌కు చెందిన తెలుగు కుర్రాడికి అవకాశం దక్కింది. అతడే కోన శ్రీకర్ భరత్.. కేఎస్ భరత్‌గా (KS Bharat) ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోకి (IND vs AUS) అడుగు పెట్టాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!
ప్రకృతి సృష్టించిన ఘోర విపత్తుకు తుర్కియే (Turkey), సిరియా (Syria) కకావికలమయ్యాయి. ఎటు చూసినా శిథిలాల గుట్టలు.. శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. నిమిష నిమిషానికి బయటపడుతున్న వందలాది మృతదేహాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ భూకంప మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ అంతులేని విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ భూప్రళయం కారణంగా ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15వేలు దాటింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. Layoffs: డిస్నీలో 7000 మంది ఉద్యోగుల తొలగింపు
ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ సైతం ఉద్యోగుల తొలగింపులను (Layoffs in Disney) ప్రకటించింది. దాదాపు 7,000 మందికి ఉద్వాసన పలకనున్నట్లు బుధవారం వెల్లడించింది. సీఈఓ బాబ్ ఐగర్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయం ఇదే. 2021 కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం డిస్నీ (Disney)లో ప్రపంచవ్యాప్తంగా 1,90,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది పూర్తిస్థాయి ఉద్యోగులు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టి అగ్రహీరోలందరి సరసన నటించింది శ్రీదేవి (Sridevi). తన నటనతో అన్ని భాషల్లోని సినీప్రియులను అలరించి ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకొంది. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. భారతీయ చిత్రసీమను ఏలిన ఈ అగ్రకథానాయిక జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర (Sridevi's biography) పుస్తక రూపంలో రానుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. Kotamreddy: ఈ రకంగా సజ్జల.. నా రుణం తీర్చుకున్నారేమో..!: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన స్నేహితుడు రామశివారెడ్డి వ్యాఖ్యలపై వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy) స్పందించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్టునే రామశివారెడ్డి చదివారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా(YSRCP) తరఫునే పోటీ చేస్తానంటూ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేయాలని కోరారు. తన వెంట ఉన్న కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వీడియో కోసం క్లిక్ చేయండి
9. Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) చెత్త సినిమా అంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) తీవ్ర విమర్శలు చేశారు. ఆ చిత్ర దర్శకుడికి భాస్కర్ అవార్డు కూడా రాదని విమర్శించారు. ఇటీవల కేరళలో నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లేటర్స్ ఇన్ కేరళ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. Adani Group: సుప్రీంకు చేరిన ‘అదానీ’ వ్యవహారం.. రేపు విచారణ
అదానీ గ్రూప్ (Adani Group) సంస్థలపై హిండెన్‌బర్గ్ (Hindenburg Research) నివేదిక దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PBKS vs KKR: పంజాబ్ X కోల్‌కతా.. కొత్త సారథుల మధ్య తొలి పోరు
-
Movies News
Rolex: ఒకే స్టేజ్‌పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్
-
General News
Andhra News: ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు : బొత్స
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్