Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 09 Mar 2023 13:18 IST

1. USA:పాక్‌ కవ్వింపు చర్యలను.. మోదీ చూస్తూ ఊరుకోరు: యూఎస్ నివేదిక

సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ(Modi) నాయకత్వంలో గతంలో కంటే దీటుగా సైనిక శక్తితో ప్రతిస్పందించగలదని అమెరికన్ ఇంటిలిజెన్స్‌ కమ్యూనిటీ(American intelligence community) అభిప్రాయపడింది. భారత్‌-పాకిస్థాన్‌(India and Pakistan), భారత్-చైనా(India and China) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఘర్షణలకు అవకాశం ఉందని అంచనా వేసింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. IND vs AUS: భారత్‌-ఆసీస్‌ టెస్టు మ్యాచ్‌.. స్టేడియంలో మోదీ, ఆల్బనీస్‌ సందడి

బోర్డర్‌ - గావస్కర్‌ (Border-Gavaskar series) సిరీస్‌లో భాగంగా భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ మరింత ప్రత్యేకత సంతరించుకుంది. 75 ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ (Anthony Albanese) నేడు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

OTT Movies: ప్రస్తుతం థియేటర్‌లో స్టార్‌ హీరోల సినిమాలేవీ సందడి చేయడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు, సినిమాలు స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త కంటెంట్‌ ఏంటో చూసేయండి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. Charles Bronson : అతడో కరుడుగట్టిన ఖైదీ.. అయినా మూడు పెళ్లిళ్లు!

బ్రిటన్‌లో కరుడుగట్టిన ఖైదీగా ముద్రపడిన ఛార్లెస్‌ బ్రాన్సన్‌ ఇప్పటికి దాదాపు 50 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని పెరోల్ ఇవ్వాలని ప్రస్తుతం న్యాయమూర్తులను అభ్యర్థిస్తున్నాడు. అసలు ఎవరీ ఛార్లెస్‌ బ్రాన్సన్‌? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Amit shah: భద్రతా వైఫల్యం.. అమిత్ షా కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు..!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit shah) త్రిపుర పర్యటనలో భద్రతా వైఫల్యం (Security lapse) చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌లోకి ఓ కారు వేగంగా దూసుకురావడం తీవ్ర అలజడి సృష్టించింది. అమిత్‌ షా అగర్తల ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. అధికారుల కథనం ప్రకారం.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. TDP: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థిని దించే యోచనలో తెదేపా!

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) పోటీ చేసేందుకు తెదేపా(TDP) సిద్ధమవుతోంది. అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తోంది. ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Viral Video: ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్న యువకుడు

వరుడు ఒక్కడే. కానీ వధువులు మాత్రం ఇద్దరు. ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై ఇద్దరిని వివాహం చేసుకున్నాడు భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు. మూడేళ్లగా సత్తిబాబు స్వప్న, సునీతతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్నకు ఒక పాప జన్మించగా.. సునీతకు ఓ బాబు పుట్టాడు. తాను ఇద్దరినీ ప్రేమిస్తున్నానని... ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాని సత్తిబాబు నిర్ణయించుకోవడంతో సంచలనమైంది. వీడియో కోసం క్లిక్‌ చేయండి

8. IPL 2023: ఐపీఎల్‌ సందడి మొదలైంది.. ఇక ‘షోర్‌ ఆన్‌.. గేమ్‌ ఆన్‌’!

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ‘షోర్‌ ఆన్‌.. గేమ్‌ ఆన్‌’ పేరిట ఓ వీడియోను విడుదల చేశారు. స్టార్‌ క్రికెటర్లు కలిసి నటించిన ఈ సాంగ్‌ను మీరూ చూసేయండి. వీడియో కోసం క్లిక్‌ చేయండి

9. స్టార్‌హీరో ఇంట్లోకి చొరబడి.. ఎనిమిది గంటలు మేకప్‌రూమ్‌లోనే దాక్కొని..

జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన హీరోని కలవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తమ కలను నెరవేర్చుకోవడం కోసం అడ్డుదారులు తొక్కి కొంతమంది చిక్కుల్లోపడతారు. తాజాగా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఇంట చోటు చేసుకుంది. షారుఖ్‌ను చూడాలనే ఆశతో ఇద్దరు యువకులు అత్యుత్సాహం కనబరిచి.. చివరికి పోలీస్‌ స్టేషన్‌ బాటపట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. డేటా ఉద్యోగాలకు...ఎస్‌క్యూఎల్‌!

డేటా అనేది సమాచార నిధి మాత్రమే కాదు, ఉద్యోగావకాశాలకు వారధి కూడా! డేటాను సమర్థంగా నిర్వహించగలిగే నిపుణులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. ఈ రంగంలో కొలువులు ఆశించేవారికి ఎస్‌క్యూఎల్‌ లాంగ్వేజ్‌ నేర్చుకోవడం చాలా ఉపయోగకరం. ఈ సర్టిఫికేషన్‌తో నేరుగా కొలువులు పొందే వీలుండటమే ఇందుకు కారణం. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే... పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు