Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 12 May 2023 13:11 IST

1. AP High Court: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. జీవో నంబర్‌ 1 కొట్టేసిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్‌ సెంచరీ మిస్‌.. కోల్‌కతా స్పిన్నర్‌పై విమర్శలు

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) తన విధ్వంసంతో సరికొత్త రికార్డు సృష్టించాడు. గత రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లో 50 మార్కును అందుకుని 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. కానీ, ఈ సీజన్‌లో సెంచరీ చేసే అవకాశం అతడికి రెండోసారి త్రుటిలో మిస్‌ అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Twitter CEO: ట్విటర్‌ సీఈఓగా లిండా యాకరినో? ఇంతకీ ఎవరీమె?

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు కొత్త సీఈఓ (Twitter CEO) రావడం ఖాయమైంది. ఈ బాధ్యతల్ని ఓ మహిళ తీసుకోనున్నట్లు ప్రస్తుత సీఈఓ ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. అయితే, ఆమె ఎవరనేది మాత్రం బహిర్గతం చేయలేదు. మరో ఆరు వారాల్లో ఆమె బాధ్యతలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే, అమెరికా కార్పొరేట్‌ వర్గాలకు సుపరిచితమైన లిండా యాకరినో (Linda Yaccarino) కొత్త సీఈఓ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. CBSE Results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి (Class 12 results) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్ఈ (CBSE) బోర్డు వీటిని ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.inలో తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. వీటితో పాటు డిజిలాకర్‌, పరీక్షా సంగమ్‌ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్‌ నంబర్లు, స్కూల్‌ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Pakistan: గుండెపోటును ప్రేరేపించే ఆహారం, ఇంజెక్షన్లు ఇచ్చారు: ఇమ్రాన్‌ న్యాయవాదుల తీవ్ర ఆరోపణలు

మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ) (Pakistan Tehrik-e-Insaf) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) అరెస్టుతో పొరుగుదేశం పాకిస్థాన్‌(Pakistan)లో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మరోవైపు ఆయన అరెస్టు అక్రమమని పాక్‌ సుప్రీంకోర్టు తేల్చింది. ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Krithi Shetty: ఆ దర్శకుడితో మాట్లాడుతూ ఏడ్చేశా: కృతిశెట్టి

నటులెవరికైనా తాము పోషించిన పాత్రల్లో కొన్ని మనసుకు బాగా దగ్గరవుతాయి. ఒక్కోసారి అవి భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. ‘బంగార్రాజు’ (Bangarraju) సినిమాలోని నాగలక్ష్మి పాత్ర తనకు ఇలాంటి అనుభూతినే పంచిందన్నారు హీరోయిన్‌ కృతిశెట్టి (Krithi Shetty). చిత్రీకరణ పూర్తైన తర్వాత ఆ సినిమాని చూసి, వెంటనే దర్శకుడు కల్యాణ్‌ కృష్ణకు ఫోన్‌ చేశానని, ఆయనతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఏడ్చానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Chandrababu: చంద్రబాబు ‘రైతుపోరుబాట’ పాదయాత్ర ప్రారంభం

ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు ‘రైతు పోరుబాట’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఇరగవరం నుంచి తణుకు వైజంక్షన్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. సుమారు 12 కిలోమీటర్లు చంద్రబాబు నడవనున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో మార్గంమధ్యలో మాట్లాడుతూ ఆయన ముందుకు సాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Trevor Jacob: యూట్యూబ్‌ వీడియో కోసం విమానాన్నే కూల్చేసిన ఘనుడు..!

యూట్యూబ్‌ వీడియో వ్యూయర్‌షిప్‌ కోసం ఏకంగా విమానాన్నే కూల్చేశాడో ఘనుడు. అనంతరం దీనిపై అధికారులు విచారణ చేపట్టగా.. ‘అబ్బే నాకేం తెలీదు.. ఇంజిన్‌ విఫలమైంద’ని బుకాయించాడు. కానీ, అధికారులు పక్కా ఆధారాలతో ప్రశ్నించే సరికి తానే విమానం కూల్చేసినట్లు అంగీకరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Allu arjun: అల్లు అర్జున్‌ ఎలా ఉన్నా హీరోనే..: హేమ మాలిని

ప్రతి సినిమాలోనూ వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్‌. సినీ ప్రియులే కాదు అగ్ర నటీనటులు కూడా బన్నీపై ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఎన్నో. తాజాగా అల్లు అర్జున్‌ (Allu arjun) గురించి అలనాటి ‘బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌’ హేమమాలిని (Hema malini) మాట్లాడారు. ఆయన నటించిన పాత్రల గురించి ప్రస్తావిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Small bank : అమెరికాలోనే అతి చిన్న బ్యాంక్‌.. ఇద్దరే ఉద్యోగులు!

అగ్రరాజ్యం అమెరికాలో (America) సుమారు వందేళ్ల క్రితం ‘కెంట్‌ల్యాండ్ ఫెడరల్‌ సేవింగ్స్‌ అండ్‌ లోన్‌’ బ్యాంకును (Bank) స్థాపించారు. ప్రస్తుతం ఆ బ్యాంకు మొత్తం ఆస్తుల (Assets) విలువ కేవలం 30 లక్షల డాలర్లు. అందులో ఇద్దరు ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. లావాదేవీల (Transactions)కోసం ఈ బ్యాంక్‌కు ఏటీఏం (ATM) వంటి సౌకర్యాలు లేవు. ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసుకుందామంటే కనీసం వెబ్‌సైట్‌ (Website) కూడా లేదు. అందుకే వీరు లావాదేవీలు నిర్వహించడానికి ఎలాంటి రుసుములు తీసుకోరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని