Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 13 Mar 2023 13:09 IST

1. oscars 2023: ఆస్కార్‌.. ‘ఎవ్రీథింగ్‌’ వారికే.. ఏకంగా ఏడు అవార్డులు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ (everything everywhere all at once) చిత్రం ఏకంగా ఏడు అవార్డులను అందుకుని విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ చిత్రానికే వరించాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. CM KCR: ‘నాటు నాటు..’తో తెలుగులోని మట్టి వాసనలు వెలుగులోకి తెచ్చారు

ఆర్ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు..’కు ఆస్కార్‌ దక్కడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందన్నారు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణమని సీఎం కొనియాడారు. నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతి, తెలుగు ప్రజల అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Signature Bank: అమెరికాలో మరో బ్యాంకు మూసివేత

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (Silicon Valley Bank) ఉదంతం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తుండగానే.. అమెరికాలో మరో బ్యాంక్‌ మూతపడింది. క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ (Signature Bank)ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఇలా కీలక బ్యాంకులు మూతపడడంతో బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. oscars 2023: ‘డు యూ నో నాటు’.. ఆస్కార్‌ వేదికపై పాటను పరిచయం చేసిన దీపిక

భారతీయ సినీ రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తూ తెలుగు పాట ‘నాటు నాటు’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ (oscars 2023) పురస్కారాన్ని అందుకుంది. దీంతో లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ‘నాటు నాటు (Naatu Naatu)’తో దద్దరిల్లింది. ఈ అవార్డు ప్రకటనకు ముందు ఈ పాటను ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పరిచయం చేయగా.. ఆ తర్వాత గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ లైవ్‌లో పాడారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. WTC Final: శ్రీలంక ఓడింది.. భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లింది

కేన్‌ మామ టీమ్‌ఇండియాను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేర్చాడు. ఇదేంటి..? న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌కు.. భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా..?  శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో న్యూజిలాండ్‌ను కేన్‌ విలియమ్సన్‌ విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు డ్రా అయినా సరే టీమ్‌ఇండియా మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిపోయింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Oscars 2023: ఆయన ధైర్యమే ఆస్కార్‌ కల నెరవేరేలా చేసింది.. ప్రముఖుల ప్రశంసలు

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డు ఈ ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) (బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి) పాటకు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నాటి కల నేడు సాకారమైందన్నారు. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Yes Bank Shares: నష్టాల్లో యెస్‌ బ్యాంక్‌ షేర్లు.. ఆరంభంలో 12 శాతం పతనం!

యెస్‌ బ్యాంక్‌ (Yes Bank) షేర్లు సోమవారం నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం దాదాపు 12 శాతం నష్టపోయిన షేరు రూ.14.40 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కొనుగోళ్ల మద్దతుతో తర్వాత కనిష్ఠాల నుంచి పుంజుకుంది. ఉదయం 11:44 గంటల సమయంలో 3.94 శాతం నష్టపోయి రూ.15.85 వద్ద ట్రేడవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Ram Charan: ఎన్టీఆర్‌.. నీతో మళ్లీ డ్యాన్స్‌ చేయాలని ఉంది: రామ్‌చరణ్‌

‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ (Oscars 2023) వరించడం పట్ల రామ్‌చరణ్‌ (Ram Charan) ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు చెబుతూ ఆయన ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు. మరోసారి తారక్‌ (NTR)తో డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే, ఈ అవార్డు భారతీయ నటీనటులందరి సొంతమని అన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. NTR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నాతో కలసి దూకిన పులి ఇదే!: ఆస్కార్‌ వేడుకలో ఎన్టీఆర్‌ సరదా కామెంట్స్‌

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’లో తనతో కలసి దూకిన పులి ఇదే’.. అంటూ ఆస్కార్‌ వేడుకలో ఎన్టీఆర్‌(NTR) సరదాగా మట్లాడారు. ఆస్కార్‌ వేడుకలో ఓ రిపోర్టర్‌ ఎన్టీఆర్‌ ధరించిన డ్రెస్‌ గురించి అడగ్గా.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ వస్త్రధారణలో వచ్చినట్టు చెప్పారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

10. Chiranjeevi: ‘నాటు నాటు’కు ఆస్కార్‌.. తెలుగువారి గొప్పతనాన్ని చాటారు: చిరంజీవి

‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’ నుంచి ‘నాటు నాటు’కు ఆస్కార్‌ అవార్టు వచ్చిన సందర్భంగా చిత్ర బృందానికి మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులందరికీ ఇవి గర్వించే క్షణాలని చెప్పారు. చిత్ర బృందం పడిన కష్టానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని