Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 18 May 2023 13:09 IST

1. Karnataka CM: సీఎంగా సిద్ధరామయ్యే.. డీకేకు డిప్యూటీ పదవి: కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన

కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister)గా సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ గురువారం అధికారిక ప్రకటన చేసింది. సీఎం ఎంపికపై సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగనున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. Tirumala: తిరుమలలో భారీగా రద్దీ.. కిలోమీటర్ల మేర భక్తుల బారులు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. cricket: మైదానంలో బంతి కనిపించడంలేదు.. ఎందుకంటే..!

‘‘నువ్వు బౌలర్‌ కావాలని అస్సలు అనుకోవద్దు’ అని నా కుమారుడికి చెబుతా. అతడు బంతిని ముట్టుకుంటే ఆ చేతి మీద కొడతా. ఎందుకంటే అతడు బ్యాటర్‌ కావాలనేది నా కల. అతడికి రోజూ శిక్షణ ఇప్పిస్తున్నా. నెట్స్‌లో నేనే బౌలింగ్‌ చేస్తా. ఇప్పుడు ఐపీఎల్‌లో నేను బౌలింగ్‌ చేస్తున్నందుకు రూ.50 లక్షలు ఇస్తున్నారు. అతడు మంచి బ్యాటర్‌గా మారితే ఓ పదేళ్లలో రూ.20 కోట్లైనా ఇస్తారు. నా కొడుకు కోసం ఓ రూ.20 కోట్లు పక్కనపెట్టుకోవాలని ముంబయి ఇండియన్స్‌కు చెప్పా’’.. భారత స్పిన్నర్‌ పియూష్‌ చావ్లా ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. అండమాన్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ప్యాకేజీ వివరాలు ఇవిగో..

ఈ వేసవి సెలవుల్లో ఎక్కడికైనా ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఓ వైపు సముద్ర అందాలు.. ఇసుక తిన్నెలు.. పచ్చని చెట్ల మధ్య సేద తీరాలని చూస్తున్నారా? అయితే, ఐఆర్‌సీటీసీ అండమాన్‌ టూర్‌ ప్యాకేజీపై లుక్కేయాల్సిందే. హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణంతో మొదలై పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లడం.. అక్కడి అందాలు వీక్షించాక తిరిగి హైదరాబాద్‌కు విమానంలో చేరుకోవడంతో టూర్‌ పూర్తవుతుంది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు సాగే ఈ ప్యాకేజీ మే 26న ప్రారంభం అవుతుంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Jallikattu: ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తమిళనాడు (Tamil Nadu) సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu) విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. జల్లికట్టుపై తమిళనాడు చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Kiren Rijiju: కేంద్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు..

కేంద్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రుల్లో ఇద్దరి శాఖలను మార్చుతూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. న్యాయశాఖ మంత్రి (Law Minister)గా ఉన్న కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌ (Arjun Ram Meghwal)కు న్యాయమంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. ముంబయి పేలుళ్ల ఘటన.. రాణాను భారత్‌కు అప్పగించనున్న అమెరికా

వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) అమెరికా(USA)లో పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదం కట్టడికి ఇరుదేశాల మధ్య కీలక అడుగుపడింది. 26/11 ముంబయి దాడుల్లో కీలక నిందితుల్లో ఒకడైన తహవూర్‌ రాణాను అప్పగించాలని భారత్‌ చేసిన అభ్యర్థనకు ఆమోదం లభించింది. ఈ మేరకు అమెరికాలోని కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. భారత్‌-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Ott Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల సందడే సందడి!

Telugu Ott Movies: ప్రతి వారం సరికొత్త సినిమాలు థియేటర్‌లలో సందడి చేసేందుకు సిద్ధమవుతుంటే, ఇప్పటికే ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు వస్తున్నాయి. అలా ఈ వీకెండ్‌లో వినోదాలను పంచడానికి సిద్ధమైన సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Craters : ఉల్కపాతంతో భారత్‌లో ఏర్పడ్డ మూడు బిలాలివే!

కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూ గ్రహం (Earth) పుట్టుక మొదలైంది. మానవ జాతి మనుగడ మొదలైనప్పటి నుంచి కూడా ఈ గ్రహంపైకి అంతరిక్షం (Space) నుంచి రకరకాల శకలాలు వచ్చి పడ్డాయి. అందులో కొన్ని చాలా చిన్నగా ఉండేవి. మరికొన్ని పరిమాణంలో చాలా పెద్దగా ఉండటం వల్ల భూగోళాన్ని ప్రభావితం చేశాయి. సాధారణంగా గ్రహ శకలాలు భూమి దిశగా పయనిస్తున్న క్రమంలోనే కాలిబూడిదైపోతాయి. అతి తక్కువ మాత్రమే విజయవంతంగా భూమిని చేరుతాయి. అలా చేరిన వాటిలో సుమారు 190 దాకా భూమిపై పడి ఒక మచ్చలా ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Siddaramaiah: రైతు కుటుంబంలో పుట్టి.. స్వయం కృషితో రెండు సార్లు సీఎంగా..!

కర్ణాటకలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. రాష్ట్రంలో పాపులర్‌ నేతగా ఉన్న సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ఐదేళ్ల విరామం తర్వాత కన్నడ సీఎం పీఠంపై మరోసారి సిద్ధరామయ్య ఆశీనులు కానున్నారు. ఈ మేరకు సిద్ధూ తన కొత్త జట్టుతో కలిసి మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు