Top ten news 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 న్యూస్‌

top news of eenadu.net: ఈనాడు.నెట్‌లోని టాప్‌  వార్తలు మీకోసం... 

Updated : 18 Aug 2022 12:57 IST

1. నకిలీ వార్తల వ్యాప్తి.. 8 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం వేటు

సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోన్న పలు యూట్యూబ్ ఛానళ్లపై ఇందులో భాగంగానే కేంద్రం నిషేధం విధించగా.. తాజాగా మరో 8 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. మంకీపాక్స్ టీకాలు 100 శాతం పనిచేయవు..!

కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచాన్ని ఇప్పుడు మంకీపాక్స్(monkeypox) ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే 92 దేశాలకు విస్తరించిన ఈ వైరస్‌.. 35 వేల మందికి సోకింది. వీరిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారంలోనే దాదాపు 7,500 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు వారంతో పోల్చితే.. 20 శాతం మేర కేసులు పెరిగాయని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. నీతీశ్ ఆ పనిచేస్తే.. బిహార్‌లో ప్రచారాన్ని ఆపేస్తా: పీకే కీలక వ్యాఖ్యలు

స్వాతంత్ర్య దినోత్సవం వేళ బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఇచ్చిన వాగ్దానాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మహాగఠ్‌ బంధన్‌ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే బిహార్‌లో తాను ప్రచారాన్ని ఆపేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జన్‌ సురాజ్‌ అభియాన్‌’ను ఉపసంహరించుకొని నీతీశ్‌కు మద్దతు ప్రకటిస్తానని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురి అరెస్టు?

తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్న 8 మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు వాడిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఖర్చు లేకుండానే టర్మ్‌ ఇన్సూరెన్స్‌..తీసుకుంటారా మరి?

 ఇప్పటివరకు మార్కెట్‌లో రెండు రకాల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. పాలసీ కాలపరిమితి ముగిసేలోపు బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే హామీ మొత్తం లభిస్తుంది. ఒకవేళ జీవించి ఉంటే చెల్లించిన ప్రీమియంలు మాత్రం తిరిగి రావు. మరొకటి ‘రిటర్న్‌-ఆఫ్‌-ప్రీమియం (RoP) టర్మ్‌ ప్లాన్‌’. దీంట్లో పాలసీ గడువు ముగిసే వరకు వ్యక్తి జీవించి ఉంటే కట్టిన ప్రీమియం మొత్తం తిరిగొస్తుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ వచ్చేస్తోంది

మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న ‘గాడ్‌ ఫాదర్‌’(God Father) టీజర్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్‌ని ఆయన  పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 21, ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. విశాఖలో టిఫిన్‌ సెంటర్‌ వద్ద పేలుడు

విశాఖపట్నం గాజువాక పరిధిలోని ఆటోనగర్‌లో టిఫిన్‌ సెంటర్‌ వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి టిఫిన్‌ సెంటర్‌లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. జాగిలాలు, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడుగా భావించినా.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులు అనుమానిస్తున్నారు.  

8. చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖ 

ముందస్తు చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే భారతీ ఎయిర్‌టెల్‌కు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం’ నుంచి 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖ అందినట్లు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ వెల్లడించారు. చెల్లింపులు చేసిన రోజే ఇలా లేఖ అందడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారని ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. డిప్రెషన్‌ను ఈ లక్షణాలతో కనిపెట్టొచ్చు!

డిప్రెషన్‌లో ఉన్న వారికి ఆ విషయం తెలియకపోవచ్చు. వారిలో కనిపించే మార్పులను బట్టి వారు డిప్రెషన్‌లో ఉన్నారో లేదో గుర్తించవచ్చు అదెలా అంటే..  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం

జామాబాద్ జిల్లా బాల్కొండలో భాజపా నిర్వహించిన రైతు ధర్నా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. చెక్ డ్యామ్‌లన్నీ కేంద్రం నిధులతో నిర్మించారని అర్వింద్ వ్యాఖ్యానించగా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. రైతులు లేని ధర్నా చేశారని, చెక్ డ్యామ్‌లపై అబద్ధాలు చెప్పారని విమర్శించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని