Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

top 10 news in eenadu.net : ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు

Updated : 19 Aug 2022 13:02 IST

1. బకాయిలు చెల్లించేశాం.. ఆ నిషేధం ఏపీకి వర్తించదు: విజయానంద్‌

ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వివరణ ఇచ్చారు. పవర్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్‌..! ఎందుకు..?

చైనాలో కరవు తీవ్రంగా ఉంది. అక్కడ హీట్‌ వేవ్‌ కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద నదిలో నీటి నిల్వలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. మరోవైపు విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. హైడ్రోపవర్‌ ఉత్పత్తి సాధ్యం కాక.. ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలకు పూర్తిగా సెలవులు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలే కొవిడ్‌ లాక్‌డౌన్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు కరెంటు కోతలు గుదిబండలా మారాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్‌.. ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో 3.7కిలోల బంగారం

తమిళనాడు రాజధాని చెన్నైలో గతవారం ఓ ఆభరణాల రుణ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే సంస్థ ఆఫీసులోకి చొరబడిన దుండగులు సిబ్బందిని బెదిరించి రూ.20కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. దోపిడీ చేసిన నగల్లో కొన్ని స్థానిక ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో లభించడం కలకలం రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ ఇంటి నుంచి 3.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఈనాడు’ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ఓ వెయ్యి పదాల భావం..ఒక్క చిత్రంలో చూపవచ్చు.. చిత్రానికున్న ఘనత అలాంటిది.. అందుకే చిత్రం చెప్పే భావాలు, అర్థాలెన్నో.. ఆధునిక కాలంలో ఛాయాచిత్రగ్రాహకుల అద్భుత సృజన, కళానైపుణ్యం మేలిమి ఆవిష్కారాలకు కారణమవుతోంది. నేడు అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా ‘ఈనాడు’లో ప్రచురితమైన అందమైన చిత్రాలు మీకోసం మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ కూడా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. యాపిల్‌ యూజర్లకు అలర్ట్‌.. వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి! 

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌ తమ ఉత్పత్తుల్లోని సాఫ్ట్‌వేర్‌లో తీవ్రమైన భద్రతా లోపాన్ని గుర్తించింది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ కంప్యూటర్లు వినియోగిస్తున్న వారంతా తమ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. లేదంటే హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలు

దేశ రాజధాని దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారులో మరోసారి సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. దిల్లీ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోదియా నివాసంలో నేడు సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. మద్యం విధానంపై దాఖలైన కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. సిసోదియా నివాసంతో పాటు దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని 21 చోట్ల ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. నిఖిల్‌ ‘కార్తికేయ 2’ కృష్ణాష్టమి ప్రత్యేక ఇంటర్వ్యూ

నిఖిల్‌, అనుపమ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. కృష్ణతత్వంపై తెరకెక్కిన ఈ సినిమా టీమ్‌ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. దేశంలోని ప్రముఖ కృష్ణ మందిరాలివే!

 హిందూ సంప్రదాయంలో కృష్ణుడి అవతారం ఎంతో ప్రత్యేకమైనది. శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఎనిమిదో అవతారమే శ్రీ కృష్ణావతారం. పరంధాముడు బహుళ పక్ష అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రంలో జన్మించడం వల్ల ఆ రోజును కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణిగా  పేర్కొంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ కృష్ణ దేవాలయాలు ఏంటి? ఎక్కడున్నాయి. అనే వివరాలు ఇవీ... మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. దాయాదుల పోరులో భారత్‌కే ఎడ్జ్‌.. 

గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీల్లో టీమ్‌ఇండియాపై పాక్‌కదే మొట్టమొదటి గెలుపు. అయితే మరోసారి ఇరు జట్లూ ఆసియా కప్‌ వేదికగా తలపడనున్నాయి. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ మొదలు కానుంది. ఆ మరుసటి రోజే భారత్‌-పాక్‌ జట్ల మధ్య సమరం ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా దాయాది జట్టుపై విజయం సాధించాలనే నిశ్చయంతో ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని