Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 25 May 2023 13:00 IST

1. Akash Madhwal: ఇంజినీర్‌ TO క్రికెటర్‌.. పాతికేళ్లకు ఎంట్రీ.. ఇదీ ఆకాశ్ మధ్వాల్‌ స్టోరీ!

ఐపీఎల్ సీజన్‌ 2023 (IPL 2023) ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూను చిత్తు చేసి ముంబయి (LSG vs MI) ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర యువ బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌దే. కేవలం ఐదే పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి సంచలన బౌలింగ్‌ చేశాడు. దీంతో అందరి దృష్టి ఈ బౌలర్‌పై పడింది. ఇంతకీ అతడెవరా..? అని వెతికేయగా మధ్వాల్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మరి అవేంటో మీరూ చదివేయండి.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. Sudhakar: ఆ వార్తలు నమ్మకండి.. నేను బాగానే ఉన్నా: కమెడియన్‌ సుధాకర్‌

తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై టాలీవుడ్‌ కమెడియన్‌ సుధాకర్‌ (Sudhakar Betha) స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తన గురించి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై సుధాకర్‌ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ ఆరోగ్యం బాలేదని.. ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో రూమర్స్‌ కనిపించాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Gold: పాన్ లేకుండా ఎంత క్యాష్‌తో బంగారం కొనొచ్చు?

నగదు నిర్వహణలో భాగంగా రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2,000 నోట్లను ఖర్చు పెట్టేందుకు తొందరపడుతున్నారు. చాలా మంది బంగారం (Gold) కొనుగోలుకు రూ.2,000 నోట్లను తీసుకెళ్తున్నారు. అయితే, నగదుతో బంగారం కొనడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటో చూద్దాం..! పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. Hyderabad: తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసిన కేసులో దర్యాప్తు సాగిందిలా..

అప్పు తీర్చాలని అడిగినందుకు నర్సు తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసి దారుణంగా హతమార్చిన ఘటన నగరంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాను సహజీవనం చేస్తున్న మహిళ వద్ద అతడు అప్పు తీసుకొని.. ఆ సొమ్ము తిరిగి ఇమ్మని అడిగినందుకు ఆమెను నిందితుడు చంద్రమోహన్‌ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దాదాపు వారం రోజులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. తాజాగా ఈ కేసును ఛేదించే క్రమంలో దర్యాప్తు సాగిన తీరును పోలీసు వర్గాలు వెల్లడించాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల హవా.. టాపర్లు వీళ్లే..

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఫలితాల వివరాలను ఆమె వెల్లడించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్‌&మెడికల్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌ టాప్‌-10లో 8 మంది, అగ్రికల్చర్‌&మెడికల్ విభాగాల టాప్‌-10లో ఏడుగురు ఏపీ విద్యార్థులే ఉండటం గమనార్హం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Modi: పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదం.. విపక్షాలకు మోదీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకను బహిష్కరిస్తూ విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) పరోక్షంగా తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని మోదీ గురువారం ఉదయం భారత్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Satyendar Jain: జైల్లో కుప్పకూలిన సత్యేందర్‌ జైన్‌.. ఆసుపత్రికి తరలింపు

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో (Tihar Jail) ఉన్న ఆప్‌ (AAP) నేత, దిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ (Satyendar Jain) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. గురువారం ఉదయం ఆయన జైలు గదిలోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోవడంతో అధికారులు వెంటనే దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Sriram Aditya: మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని పవన్‌ కల్యాణ్ సినిమాకు వెళ్లాడు: ప్రియాంక గ్రేస్

‘భలే మంచి రోజు’తో అందరి మనసులు గెలిచిన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య (Sriram Aditya) తన భార్య ప్రియాంక గ్రేస్‌తో (Priyanka grace) కలిసి  ‘అలా మొదలైంది’ (ala modalaindi) కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ల జీవితంలో జరిగిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సినిమాల్లో సన్నివేశాలకు మించి జరిగిన వాళ్ల పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ఫ్రెండ్స్‌ లేకపోతే పెళ్లి జరిగేది కాదంటూ వాళ్లందరికీ థ్యాంక్స్‌ చెప్పారు. వెన్నెల కిషోర్‌కు ఈ జంట చెప్పిన సరదా ముచ్చట్లు మీరు చదివేయండి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. SC To SHIRDI- NASHIK: 3 రోజుల్లో శిర్డీ, నాసిక్‌ టూర్‌.. ప్యాకేజీ వివరాలివిగో..!

IRCTC Tour package | ఇంటర్నెట్‌ డెస్క్‌: వారాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే, కేవలం మూడు రోజుల్లో శిర్డీ (SHIRDI), నాసిక్‌లను (NASHIK) సందర్శించేందుకు అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ (IRCTC tour package). సాయి శివమ్‌ పేరిట ఈ ప్యాకేజీని అందిస్తోంది. మూడు రాత్రులు, 4 పగళ్లు సాగే ఈ యాత్ర వివరాలు ఇవిగో.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. LSG vs MI: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కొంప ముంచిన రనౌట్లు!

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయానికి ఆకాశ్‌ మధ్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శన ఒక కారణం అయితే.. రనౌట్లు మరో కారణం అని చెప్పాలి. సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో మొత్తంగా మూడు రనౌట్లు నమోదయ్యాయి. కీలక సమయంలో వికెట్లు ఇచ్చేయడంతోపాటు.. అనవసర పరుగులకు పోయి రనౌట్లు అయ్యారు. ఆ రనౌట్లు జరిగాయిలా... పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని