Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Mar 2023 13:15 IST

1. ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. కొనసాగుతోన్న మూడో రోజు సిట్‌ విచారణ

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌, డాక్యానాయక్‌, రాజేశ్వర్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజుతో కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో సిట్‌ అధికారులు వీలైనంత కీలక వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

2. ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం..

ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌ EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15% వడ్డీరేటు (Interest Rate)ను నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదనలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

3. ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) పోల్చదగిన ఆటగాడిగా ఇటీవల కాలంలో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ (Babar Azam) పేరు వినిపిస్తోంది. మ్యాచ్‌లపరంగా విరాట్ కంటే బాబర్‌ చాలా తక్కువే ఆడాడు. విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలం తన అత్యుత్తమ ఫామ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫామ్‌పరంగా కాస్త తగ్గినప్పటికీ ఫిట్‌నెస్‌లో మాత్రం విరాట్‌ను మించే ఆటగాడు లేడనేది కాదనలేని సత్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

4. వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు!

వరుస సెలవుల నేపథ్యంలో వచ్చే నెల ఏప్రిల్‌లో బ్యాంకులు దాదాపు సగం రోజులు పనిచేయడం లేదు. శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయి. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

5. హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు.. ఇకపై ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనే బుకింగ్స్‌

శివుని పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్‌ (Kedarnath) ఒకటి. అలాగే చార్‌ ధామ్‌ యాత్రలో ఇది కూడా భాగం. ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని శివుణ్ని దర్శించుకొంటారు. అయితే, హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం అంత సులువు కాదు. ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌ వరకు మాత్రమే వాహనాలపై వెళ్లేందుకు వీలుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

6. ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్‌ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..

కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత (Disqualification) వేటు.. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా దీనిపై అగ్రరాజ్యం అమెరికా (America) కూడా స్పందించింది. రాహుల్‌ గాంధీ కేసును తాము గమనిస్తున్నామని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

7. ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు

సరదాగా కొన్ని రోజుల పాటు విదేశాల్లో పర్యటించి వద్దామనుకునే వారికి వీసా అతిపెద్ద సమస్య. అనుకున్న సమయానికి వీసా రాకపోవడం, అది వచ్చేటప్పటికి సమయం కుదరకపోవడం లాంటి సమస్యలతో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ వస్తారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు ప్రత్యేకించి వీసా అక్కర్లేదు. ఆయా దేశాలే మనవాళ్లకు ఈ-వీసాలు, వీసా ఆన్‌ అరైవల్‌ ఏర్పాటు చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

8. కెరీర్‌లో ఇలాంటివి సహజం.. వాటిని అధిగమించడమే సవాల్‌: ధావన్‌, యువీ

టీ20 క్రికెట్‌లో అదరగొట్టిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav).. టెస్టులు, వన్డేల్లో మాత్రం తేలిపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. వరుసగా వన్డేల్లో వచ్చిన అవకాశలను సద్వినియోగం చేసుకోవడంలో సూర్య విఫమలయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సున్నాకే పెవిలియన్‌కు చేరిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

9. పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెన్నిస్సే రాష్ట్రంలోని  నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాల(Nashville School Shooting)లో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో నిందితురాలు/నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.  అయితే, ఈ కాల్పులకు తెగబడేందుకు ఆ వ్యక్తి ముందుగానే  సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి

10. రాహుల్‌కు సావర్కర్‌ మనవడి సవాల్‌

వీర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  దీనిపై తాజాగా సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ నేతపై తీవ్రంగా మండిపడ్డారు. తన తాత గురించి తప్పుగా మాట్లాడినందుకు మండిపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ఆయన ఓ సవాల్‌ విసిరారు. దేశ భక్తుడు.. హిందుత్వ సిద్ధాంతకర్త అయిన సావర్కర్‌ ఎప్పుడు బ్రిటిష్‌ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు