Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Mar 2023 13:10 IST

1. గుజరాత్‌తో తొలి మ్యాచ్‌.. ధోనీ అందుబాటులో ఉంటాడా..? లేదా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ (IPL 2023) 16వ సీజన్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. సినీ తారలు తమన్నా భాటియా, రష్మిక మంధాన ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అతిపెద్ద మైదానం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల  మధ్య మొదటి మ్యాచ్‌ జరగనుంది. అరంగేట్రం చేసిన తొలి ఏడాదే కప్‌ను సొంతం చేసుకున్న హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని గుజరాత్‌ మరోసారి టైటిల్‌పై కన్నేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈరోజే లాస్ట్ డేట్.. ఈ 7 పనులు పూర్తి చేశారా?

ఈరోజు మార్చి 31. తేదీ గుర్తుచేస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఈరోజుతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. రేపటి నుంచి కొత్త లెక్కలు.. కొత్త పద్దులు.. కొత్త ప్రణాళికలు. ఇది అటుంచితే.. ఈరోజుతో కొన్ని కీలక పనులకు గడువు ముగియనుంది. మరి అవి పూర్తి చేశారో లేదో ఒకసారి చూసుకోండి. ఇంతకీ ఆ పనులేంటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నేరారోపణల ధ్రువీకరణ.. ట్రంప్‌ అరెస్టు తప్పదా..?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అగ్రరాజ్య (America) చరిత్రలోనే తనపై వచ్చిన నేరారోపణలకు క్రిమినల్‌ ఛార్జ్‌లను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బుతో ప్రలోభపెట్టినట్లు ట్రంప్‌పై ఆరోపణలు రాగా..దానిపై తాజాగా న్యూయార్క్‌ గ్రాండ్ జ్యూరీ వాటిని ధ్రువీకరించి ఆయనపై అభియోగాలు మోపింది. దీంతో ఆయన ఇప్పుడు క్రిమినల్‌ ఛార్జ్‌లను ఎదుర్కోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ సినిమా భారీ వైఫల్యంతో నా కెరీర్‌ ముగిసిపోయింది: మనీషా

‘బొంబాయి’ (Bombay)తో దక్షిణాది సినీ ప్రియులకు చేరువైన నటి మనీషా కొయిరాలా (Manisha Koirala). ఆ సినిమా విజయం తర్వాత పలు కోలీవుడ్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ‘బాబా’ (BABA) తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నటించిన ఆ సినిమాపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. సినిమా వైఫల్యంతో దక్షిణాదిలో తన కెరీర్‌ ముగిసిపోయిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆలయంలో మెట్లబావి ఘటన.. 35కి చేరిన మృతులు

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో నవమి వేడుక పెను విషాదాన్ని మిగిల్చింది. ఆలయంలో మెట్లబావి (Step Well) పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత

వైకాపా నుంచి సస్పెండైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని తన నివాసంలో ఉండగా గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు వైద్యులను రప్పించారు. ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ వైతెపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో షర్మిలతో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. అంతకుముందు షర్మిల మాట్లాడుతూ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గొలుసుకట్టు సంస్థలకు ప్రచారం చేయొద్దు: అమితాబ్‌కు సజ్జనార్‌ విజ్ఞప్తి

గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ ట్విటర్‌ వేదికగా ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓ సంస్థకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్‌ చేస్తూ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. ‘‘గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్‌ చేయడం కానీ.. వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొద్దు’’ అని సజ్జనార్‌ సలహా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధి అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. నార్సింగి అడ్మిన్‌ ఎస్సై బాలరాజు కథనం ప్రకారం.. గుంటూరు పట్టణానికి చెందిన వినోద్ కుమార్‌ (32) ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా గుంటూరు నుంచి పని చేసిన ఆయన.. ఆఫీస్‌కు వెళ్లాల్సి రావటంతో ఇటీవల అల్కాపూర్‌లోని సోదరుడి ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రాణం తీసిన మస్కిటో కాయిల్‌.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్‌ (Mosquito Coil) ఆరుగుర్ని బలితీసుకుంది. ఆ కాయిల్‌ కారణంగా మంటలు చెలరేగి, ఆ తర్వాత వెలువడిన విషపూరిత వాయువులను (Toxic Gas) పీల్చడంతో ఊపిరాడక ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం మరింత విచారకరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు