Updated : 25 Jun 2022 13:04 IST

Top ten news @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

1. శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19 ఏళ్లు వేదన అనుభవించారు..!

19 ఏళ్ల పాటు మోదీ పడిన బాధను తాను దగ్గరి నుంచి చూశానని.. శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకొన్నట్లుగా ఆయన ఈ వేదనను అనుభవించారని కేంద్ర హోం  శాఖ మంత్రి  అమిత్‌ షా అన్నారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను నిన్న సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శనివారం అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ

చిత్తూరు మాజీ మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారన్నారు. బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కొనసాగుతోన్న ‘మహా’ అనిశ్చితి.. శిందే కంచుకోటలో 144 సెక్షన్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఎంవీఏ కూటమి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే.. తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. శిందే గువాహటిలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో కూర్చొని తన బలం పెంచుకుంటుండగా.. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను కోల్పోయిన ఉద్ధవ్ వర్గం క్షేత్రస్థాయి కార్యకర్తలపై దృష్టి సారించింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం శివసేన జాతీయ కార్యవర్గంతో ముంబయిలో భేటీ కానున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  ‘బాలీవుడ్‌’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!

మన దేశంలో ‘పెద్ద సినిమా’ అంటే హిందీ సినిమానే. అక్కడి నటీనటులే ఇండియన్‌ సినిమా స్టార్లు. ఖాన్‌ త్రయం, కపూర్ ఫ్యామిలీ, యాక్షన్‌ హీరోలు అక్షయ్‌, అజయ్‌... వీళ్లే అగ్రతారలు. అయితే ఇదంతా గతం. గత పదేళ్లలో భారతీయ చిత్రపరిశ్రమలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు దక్షిణాది చిత్రాలు/ కథల హవా ఇండియన్‌ సినిమాను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్నాయి. అదే సమయంలో బాలీవుడ్‌ వసూళ్ల వేటలో వెనుకబడింది. దీనికి కారణమేంటి? మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అప్పుడు ఆడారు.. గెలిపించారు.. ఇప్పుడు ఎలా ఆడతారో?

విదేశీ టెస్టు సిరీస్‌ల్లో టీమ్‌ఇండియాని వేధించే ప్రధాన సమస్య బ్యాటర్ల వైఫల్యం. గత మూడు పర్యాయాలు ఇంగ్లాండ్‌లో (Ind vs Eng) ఓడిపోవడానికి కారణమదే. మన బ్యాట్స్‌మెన్ (Team India) చెలరేగి ఆడితే ఎలాంటి విజయాలు వస్తాయో గతంలో చూశాం. 2014 నుంచి 2021 వరకు ఇంగ్లాండ్‌ (England)లో ఆడిన 14 టెస్టుల్లో భారత్‌ 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఈ 4 మ్యాచ్‌ల్లో శతకాలతో రాణించిన ఆ భారత ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం! మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నా: జస్టిస్‌ ఎన్వీ రమణ

తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. మా తెలుగుతల్లికి మల్లెపూలదండతో కార్యక్రమం ప్రారంభమైందని.. తెలుగుతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఐటీఆర్ ను ఆన్‌లైన్‌లోనే ఫైల్‌చేయండి..ఇలా!

మ‌దింపు సంవ‌త్స‌రం (ఏవై) 2022-23కి గానూ ఆదాయ‌పు ప‌న్ను శాఖ రిట‌ర్ను ఫారంల‌ను నోటిఫై చేసింది. ఐటీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో రిట‌ర్నుల‌కు సంబంధించిన ప‌లు ఫారంలు అందుబాటులో ఉన్నాయి. ప‌న్ను చెల్లింపుదారులు త‌మ‌కు వ‌ర్తించే ప‌న్ను ఫారంను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లోనే దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఐటీఆర్ దాఖ‌లు చివ‌రి తేదీ జులై 31. స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ప‌న్ను దాఖ‌లుకు కావ‌ల‌సిన ఫారం 26ఏఎస్‌, ఏఐఎస్‌తో పాటు ఇత‌ర ప‌త్రాల‌ను సిద్ధం చేసుకుని వీలైనంత త్వరగా ఫైల్‌ చేయడం మంచిది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. వివాహమైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి

నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వివాహమై కొన్ని గంటలు గడవకముందే నవవరుడు శివకుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్‌కు జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన శిరీషతో శుక్రవారం వివాహం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ ఫైట్‌.. వీఎఫ్‌ఎక్స్‌ కథ ఇదీ!

బలమైన కథకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ను జతచేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచే దర్శకుల్లో రాజమౌళి (Rajamouli) ముందు వరుసలో ఉంటారు. రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR) కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోనూ ఆయన వీఎఫ్‌ఎక్స్‌కు (Visual Effects) పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎలా జరిగిందో ఇప్పటికే చిత్ర బృందం చూపించింది. ఇప్పుడు ‘క్లైమాక్స్‌ ఫారెస్ట్‌ ఫైట్‌’ విజువల్స్‌కు సంబంధించిన వీడియో విడుదలైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. పుజారాను డకౌట్‌ చేసిన షమి.. తర్వాత ఏం చేశాడో చూడండి..!

టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి.. టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారాను డకౌట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా ప్రధాన జట్టు అసలు టెస్టుకు ముందు లీసెస్టర్‌ జట్టుతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లీసెస్టర్‌ జట్టులో ఆడుతున్న పుజారా శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. షమి బౌలింగ్‌లో బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్‌ తీసుకొని వికెట్లకు తాకడంతో పుజారా నిరాశతో వెనుదిరిగాడు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని