Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Jun 2021 13:13 IST

1. Choksi: భారత్‌ పేరు వింటే బీపీ పెరుగుతోంది 

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లే కన్పిస్తోంది. ఛోక్సీ ‘అప్పగింత’పై డొమినికా న్యాయస్థానం సోమవారం విచారణ జరపాల్సి ఉండగా.. అనారోగ్యంగా ఉందంటూ ఆయన అసలు కోర్టుకే రాలేదు. దీంతో విచారణ వాయిదా పడింది. ‘మానసిక ఒత్తిడి’ కారణంగా ఛోక్సీ బీపీ పెరిగిందని అందుకే ఆయన రాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: మాట‌కు క‌ట్టుబడి ఆర్థిక‌సాయం: జ‌గ‌న్‌

వైఎస్ఆర్ వాహ‌న మిత్ర ప‌థ‌కంలో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల ప్ర‌జ‌లే ల‌బ్ధి పొందుతున్నార‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. వారంద‌రి బ‌తుకులు మార్చేందుకు ఏటా ఆర్థిక సాయం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో వాహ‌న మిత్ర ప‌థ‌కానికి సంబంధించి మూడో విడ‌త సాయాన్ని విడుద‌ల చేసిన ఆయ‌న మాట్లాడారు. ఈ ప‌థకం ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు రూ.10 వేల చొప్పున సాయం అంద‌జేస్తున్నామ‌న్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Galwan Valley: చైనా సరుకుపై గల్వాన్‌ ఎఫెక్ట్‌..!

చైనాతో గల్వాన్‌ లోయలో ఘర్షణ తర్వాత భారతీయ వినియోగదారుల తీరులో మార్పు వస్తోంది. చాలా మంది చైనా తయారీ వస్తువులకు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో చైనా వస్తువులు విరివిగా కొనుగోలు చేసిన వారు కూడా ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఒక కమ్యూనిటీ సోషల్‌ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

China: చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు

4. AP News: జ‌డ్జి రామ‌కృష్ణ‌కు బెయిల్

సస్పెండైన జడ్జి రామ‌కృష్ణ‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీక‌త్తుతో బెయిల్ ఇచ్చిన ధ‌ర్మాస‌నం.. విచార‌ణాధికారికి స‌హ‌కరించాల‌ని ఆదేశించింది. రాజద్రోహం కేసులో అరెస్టయిన జడ్జి రామకృష్ణ.. బెయిల్ కోసం ఉన్నత న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం ష‌రతుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. కేసు అంశంపై మీడియాతో మాట్లాడొద్ద‌ని ఆయ‌న్ను ఆదేశించింది. జడ్జి రామకృష్ణ ప్ర‌స్తుతం పీలేరు స‌బ్‌జైలులో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజేఐ) జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. హైద‌రాబాద్ నుంచి ఈ ఉద‌యం బ‌య‌లుదేరి యాదాద్రి వెళ్లిన సీజేఐకు మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, జ‌గ‌దీశ్‌రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆల‌య అర్చ‌కులు సీజేఐ దంప‌తుల‌ను పూర్ణ‌కుంభంతో ఆల‌యంలోకి స్వాగ‌తించారు. దర్శనం అనంతరం బాలాలయంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Vaccine: రెండు డోసులతో డెల్టా వేరియంట్‌కు చెక్‌

భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌పై రెండు డోసుల ఫైజర్‌ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ వెల్లడించింది. ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ టీకా రెండు డోసులను తీసుకున్నవారిలో 96 శాతం మందికి ఆస్పత్రిలో చేరే పరిస్థితి రావడం లేదని వారు తెలిపారు. అదే ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నవారిలో 92 శాతం మంది పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ఇంగ్లండ్‌లో డెల్టా వేరియంట్‌ కారణంగా కేసుల్లో భారీ పెరుగుదల నమోదైన నేపథ్యంలో వైద్య నిపుణులు ఈ పరిశోధనను నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: 60వేలకు తగ్గిన కేసులు..

7. TS News: ఈటల విమానంలో సాంకేతిక లోపం

తెలంగాణ మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో పాటు మరికొంతమంది నేతలు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భాజపాలో చేరిక సందర్భంగా ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు దిల్లీ వెళ్లారు. ఈరోజు ఈటల బృందం తిరిగి హైదరాబాద్‌ బయల్దేరింది. ఈ క్రమంలో ఈటల బృందం సహా 184 మంది ప్రయాణికులతో ఉన్న విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Skater girl: సినిమా కోసం స్కేటింగ్‌ పార్క్

నిజ జీవితాల్లోంచి స్ఫూర్తి పొంది అనేక కథలు వెండితెరపై సందడి చేస్తాయి. అయితే ఓ వైపు సినిమా తీస్తూనే అక్కడి చిన్నారుల జీవితాల్లో  మార్పు తెచ్చిన స్ఫూర్తిమంతమైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ‘స్కేటర్‌ గర్ల్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 11న విడుదలైన సినిమా. మంజరి మకిజన్య్‌ ఆ చిత్రానికి దర్శక-నిర్మాత.  రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో స్కేటింగ్‌ క్రీడలో రాణించాలని కలలు గనే పదహారేళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. సినిమాకోసం ఉదయ్‌పుర్‌కి సమీపంలోని ఖేమ్‌పుర్‌ గ్రామంలో భారీ స్కేటింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Koratala: హీరోయిజం లెక్కలు మార్చిన డైరెక్టర్‌

9. Mask: వైరస్‌ను అంతం చేసే మాస్కు

వైరస్‌ను వడకట్టడమే కాకుండా దాన్ని నిర్వీర్యం కూడా చేసే వినూత్న మాస్కును పుణెకు చెందిన ఒక అంకుర పరిశ్రమ అభివృద్ధి చేసింది. త్రీడీ ముద్రణ, ఔషధ పరిజ్ఞానాన్ని అనుసంధానించడం ద్వారా ఈ ఘనత సాధించింది. థింకర్‌ టెక్నాలజీస్‌ ఇండియా సంస్థ ఈ మాస్కును రూపొందించింది. దానికి యాంటీవైరల్‌ పూతను పూశారు. ఈ తరహా రసాయనాలను వైరుసైడ్స్‌ అని కూడా పిలుస్తుంటారు. సోడియం ఒలెఫిన్‌ సల్ఫోనేట్‌ ఆధారిత మిశ్రమంతో దీన్ని తయారుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. WTC Final: కోహ్లీసేన ‘5’ శత్రువులు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మరో నాలుగు రోజులే ఉంది. ఇంగ్లాండ్‌ను 1-0తో మట్టికరిపించిన న్యూజిలాండ్‌ ఉత్సాహంతో ఉంది. టీమ్‌ఇండియాతో పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఐసీసీ టోర్నీల్లో ఎన్నో జట్లను ఓడించిన భారత్‌కు.. కివీస్‌ చేతిలో మాత్రం ఓటములు తప్పడం లేదు. అందుకే తొలిసారి ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలవాలంటే కోహ్లీసేన ప్రత్యర్థిని కట్టడి చేయక తప్పదు. ఆ ఐదుగురు శత్రువులను అడ్డుకోక తప్పుదు. ఇంతకీ వారెవరు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Rahul Dravid: దాదా కూడా చెప్పేశాడు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని