Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jun 2021 13:11 IST

1. WTC Final: ఐసీసీ నిబంధనలు సరిగ్గాలేవ్: వీవీఎస్‌

ఐసీసీ నిబంధనలు సరిగ్గా లేవని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ విమర్శించారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతున్న తీరు అభిమానులను నిరాశ పరిచిందన్నారు. ఛాంపియన్‌షిప్‌ అన్నప్పుడు విజేత ఎవరో తేలాలని పేర్కొన్నారు. నాలుగో రోజు ఆట రద్దు కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐసీసీ నియమాలు సరిగ్గా లేవని నాకనిపిస్తోంది. ఎవరెన్ని చెప్పినా అంతిమంగా విజేత ఎవరో తేల్చాలి’ అని లక్ష్మణ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* WTC Final: ఐదో రోజు చిరు జల్లులు! ఆట సాగొచ్చు

2. Raghurama: జగనన్న క్యాంటీన్లు తెరవాలి

నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. అన్న క్యాంటీన్ల బదులు జగనన్న క్యాంటీన్లను ప్రారంభించాలని కోరారు. ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అని దాదాపు అన్ని పవిత్ర గ్రంథాలలో చెబుతుంటారు. ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం అందించడం అనేది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎంతో అవసరమైనది. ఈ లేఖ ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని రఘురామ లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. DeltaPlus variant: 3 రాష్ట్రాలకు పాకిన కొత్తరకం..!

 భారత్‌లో కరోనా రెండోదశ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నప్పటికీ.. వైరస్‌ ముప్పు మాత్రం తొలగిపోలేదు. ఈ దశలో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్తరకం ప్రభావాన్ని అంచనా వేసే పనిలోపడ్డాయి. అయితే ఇది ఇప్పటికే మూడు రాష్ట్రాలకు పాకినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైతే కేంద్రం దీన్ని వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా మాత్రమే వర్గీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: 50వేల దిగువకు కరోనా కేసులు

4. CM Jagan: కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం

వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని జగన్‌ సర్కార్‌ విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ మీట నొక్కి 23,14,342 మంది ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. SBI: మీ ఇంటికే ఎస్‌బీఐ బ్యాంక్‌

మారుతున్న పరిస్థితుల్లో కిరాణా సామగ్రి మొదలు.. ఖరీదైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వరకూ గుమ్మం వద్దకే వచ్చి అందిస్తోన్న జీవన శైలి అలవాటయ్యింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌తో.. బ్యాంకు చేతిలో ఉన్నట్లుగా మారిపోయినా.. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ ఇబ్బందీ లేకుండా.. బ్యాంకుకు నేరుగా రాలేని వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Jeff bezos: అంతరిక్ష యాత్రపై వింత పిటిషన్‌

6. అది ‘మూడో కూటమి’ సమావేశం కాదు

రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ నివాసంలో మంగళవారం జరగనున్న ప్రతిపక్షాల భేటీ అనేక ఊహాగానాలకు తెరతీస్తోంది. భాజపా, కాంగ్రెస్‌ కేంద్రాలుగా సాగుతున్న రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ‘తృతీయ కూటమి’ ఏర్పాటు కోసమే ఈ సమావేశం జరగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలకు చెక్‌ పెడుతూ సీనియర్‌ రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ఓ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Manoj Bajpayee: మామూలుగా స్టార్‌ కాలేదు!

జీవితంలో ఏదో సాధించాలని కలలు కంటాం. ఆ కలలు కల్లలు చేసేందుకు కాలం ఎన్నో కష్టాలు పెడుతుంది. ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆ కష్టాలు, కన్నీళ్లకు బెదరకుండా దాటొస్తేనే విజయం వరిస్తుంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కూడా 9 ఏళ్ల వయసులో అలాంటిదే ఓ కల కన్నాడు. అమితాబ్ బచ్చన్‌లా వెండితెర మీద వెలిగిపోవాలనుకున్నాడు. కట్‌ చేస్తే, ‘ఫ్యామిలీ మ్యాన్‌’తో ఓటీటీ సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* టీకాలు ఇప్పిస్తానంటూ సురేశ్‌బాబుకు టోకరా

8. Vaccine: ప్రపంచానికి 5.5 కోట్ల డోసులిస్తాం 

 ప్రపంచ దేశాలకు 5.5 కోట్ల డోసుల కొవిడ్‌-19 టీకాలను కేటాయించనున్నట్లు అమెరికా సోమవారం ప్రకటించింది. ఇందులో భారత్, బంగ్లాదేశ్‌ వంటి ఆసియా దేశాలకు 1.6 కోట్ల డోసులను ఇస్తామని తెలిపింది. అమెరికాలోని జో బైడెన్‌ సర్కారు ఇప్పటికే 2.5 కోట్ల డోసులను వివిధ దేశాలకు కేటాయించింది. తాజా ప్రకటనతో ఆ కేటాయింపు 8 కోట్ల డోసులకు చేరుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ ‘కాలింగ్‌’ ఇలా..

సాంకేతిక విప్లవంతో ఇంట్లోనే కూర్చొని దూర ప్రాంతాల వారిని చూసుకుంటూ మాట్లాడుకునే వెసులుబాటు వచ్చింది. దీని కోసం మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను అత్యధికమంది వినియోగిస్తున్నారు. యూజర్‌ ఫ్రెండ్లీ, వేగవంతం, భద్రతాపరంగా సురక్షితమైన చాటింగ్‌, కాలింగ్‌ చేసుకునే అవకాశం వాట్సాప్‌ కల్పించింది. ఇప్పుడు వాట్సాప్‌ వెబ్, డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం ఇప్పటికే వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి కాలింగ్‌ ఎలా చేసుకోవాలో ఓసారి తెలుసుకుందాం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మీ పేరు మీద ఎన్ని నెంబర్లున్నాయో ఇలా తెలుసుకోవచ్చు...

10. Mask:మాస్కు పెట్టుకోకపోతే తలపై ఒక్కటిస్తుంది!

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. కఠిన ఆంక్షలను ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. దీంతో ప్రజలు యథావిధిగా రోడ్లపైకి వస్తున్నారు. అయితే, కొవిడ్‌ కట్టడి నిబంధనల్ని పాటించకపోతే మూడో వేవ్‌ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ.. ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. మార్కెట్లు, రోడ్లు, షాపింగ్‌ మాళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని