- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Top Ten News @ 1 PM
1. Rafale: రఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు!
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైనట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ ‘మీడియాపార్ట్’ పేర్కొంది. రూ.59 వేల కోట్లు విలువ చేసే ఈ ఒప్పందం విషయంలో దర్యాప్తు జరిపేందుకు ఓ న్యాయూర్తిని కూడా నియమించినట్లు తెలిపింది. భారత్- ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ఒప్పందం కావడంతో ఈ అంశానికి ఇరు దేశాల్లో ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పీలేరులో రూ.400 కోట్ల భూకుంభకోణం: కిశోర్
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో భారీ భూ కుంభకోణం జరిగిందని తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో హైవేకు ఆనుకుని రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. మంత్రి, ఎంపీల అండ చూసుకొని వైకాపా నేతలు భూ కబ్జాకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ భూములకు లే- అవుట్లు వేసి అక్రమంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణలకు సంబంధించిన ఊరు, సర్వే నెంబర్ల వివరాలను ఆయన మీడియా ముందు ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* కొత్తఏజెన్సీకి చెల్లింపులు తక్కువే: తితిదే ఏఈవో
3. కో-బ్రాండెట్ కార్డులతో పెట్రోల్ ఖర్చు ఆదా!
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కో-బ్రాండెడ్ ఇంధన కార్డులు కొంత ఖర్చును తగ్గిస్తాయని చెప్పవచ్చు. ఈ కార్డులను ఉపయోగించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తే రివార్డులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, తిరిగి పెట్రోల్‌ను కొనుగోలు చేయడం వంటి వివిధ ప్రయోజనాలను పొందుతారు. ఇవి ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులను కూడా అందిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కాలం సీఎంని చేస్తే.. దురదృష్టం దించేసింది..!
కాలం కలిసొచ్చింది.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కానీ ఆయనకు అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. కరోనా రూపంలో వచ్చిన కొంత దురదృష్టం.. మరికొంత స్వయంకృతాపరాధం.. వెరసి నాలుగు నెలలు తిరగకుండానే ఆయన కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది..! 115 రోజుల అతితక్కువ పదవీకాలం.. సీఎంగా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ ప్రయాణం.. అంతా కష్టాలమయమే!! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. 2 డోసుల టీకాతో 98% మరణం నుంచి రక్షణ
దేశంలో అందిస్తున్న రెండు వ్యాక్సిన్లు (కొవాగ్జిన్, కొవిషీల్డ్) ప్రజలకు రోగ తీవ్రత, మరణం నుంచి మంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ వెల్లడించారు. ఈమేరకు చండీగఢ్‌లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్’ పంజాబ్ పోలీసులపై జరిపిన అధ్యయనాన్ని ఆయన ఉటంకించారు. ఈ అధ్యయనం ప్రకారం ఒక్క డోసు తీసుకున్న వారికి 92%, రెండు డోసులు తీసుకున్న వారికి 98% మరణం నుంచి రక్షణ లభించినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Corona: 5 లక్షల దిగువకు క్రియాశీల కేసులు
6. AamirKhan: 15 ఏళ్ల బంధానికి స్వస్తి
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు విడిపోతున్నారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై కుమారుడి బాధ్యత ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు. ‘మా ఈ 15 సంవత్సరాల వైవాహిక బంధం జీవిత కాలానికి సరిపడా ఎన్నో చిరునవ్వులు, ఆనందాలు, సంతోషాలను అందించింది. ప్రేమ, నమ్మకం, గౌరవంతో మా బంధం మరింత బలపడింది. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Shashi Tharoor: మోదీ గడ్డంపై థరూర్ సెటైర్
శశిథరూర్ ఆంగ్ల భాషా పరిజ్ఞానం గురించి తెలిసిందే. ఈ కేరళ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతుంటే నిఘంటువు వెతుక్కోవాల్సిందే. తాజాగా ఆయన ‘పొగోనోట్రోఫీ’ అనే పదం వాడి ట్విటర్‌లో హల్‌చల్ సృష్టించారు. ఈ పదంతో ప్రధాని మోదీ గడ్డానికి లంకె పెట్టారు. పొగోనోట్రోఫీ అంటే గడ్డం పెంచడం. కరోనా సమయంలో మోదీ కూడా పొగోనోట్రోఫీయే చేస్తున్నారంటూ థరూర్ వ్యంగ్యాస్త్రం విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Facebook: 3 కోట్ల కంటెంట్లపై చర్యలు
8. TS News: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
మనస్పర్థల కారణంగా భర్తను భార్య అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా ఉన్న సాయికుంట కాలనీలో నాగరాజు(39), స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన భార్య స్వరూప నిద్రిస్తున్న భర్తను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Second Wave: రెండో వేవ్ అయిపోలేదు: కేంద్రం
కరోనా రెండో ఉద్ధృతి ముగిసిపోలేదని.. ప్రజలు అలసత్వంగా ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. రోజువారీ కేసులు తగ్గుతున్నప్పటికీ.. జూన్ 23తో ప్రారంభమైన వారంలో 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10%పైగా నమోదైనట్టు గుర్తుచేసింది. దేశంలో ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో సమస్యాత్మక జిల్లాలున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. వైరస్ తగ్గిపోయిందన్న ఉద్దేశంతో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని.. యూరప్‌లో మళ్లీ కేసులు పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. KL Rahul: ధోనీ కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్తా!
ఎంఎస్ ధోనీ కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్తానని టీమ్‌ఇండియా స్ట్రోక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అంటున్నాడు. అందుకోసం రెండో ఆలోచనే చేయనని చెబుతున్నాడు. జట్టు సభ్యులు అతడికెంతో గౌరవం ఇస్తారని వెల్లడించాడు. ఆటగాళ్ల సామర్థ్యం మెరుగుపర్చడంలో విరాట్ కోహ్లీకి తిరుగులేదని తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న రాహుల్ మీడియాతో మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Sports News
T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- Nithyananda: నిత్యానందకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
- ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
- T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
- CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
- Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్ కష్టమే: భారత మాజీ ఆటగాడు
- AIFF: ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవి.. బరిలో దిగిన టీమ్‌ఇండియా ఫుట్‌బాల్ దిగ్గజం