Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Dec 2022 17:03 IST

1. CM KCR: సిరిసిల్లలో కేసీఆర్‌ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత మండేపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. ఇక్కడ గేటెడ్‌ కమ్యునిటి తరహాలో రూ.83.37 కోట్లతో 27 ఎకరాల్లో మొత్తం 1,320 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* జల వివాదంపై టీఎస్‌ హైకోర్టులో పిటిషన్‌

2. ‘రా’ఏజెంట్‌ను.. ఇప్పుడే మేడమ్‌కు రిపోర్టు చేశా..! 

దర్భంగా రైల్వేస్టేషన్‌ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్‌ నాసర్‌ ఖాన్‌ తన ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు. ఇందుకోసం రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ పేరు వాడుకొన్నాడు. తాను ‘రా’లో ఒక మహిళా అధికారి కింద పనిచేస్తున్నట్లు నమ్మించాడు. దీంతో అసలు విషయం తెలియని కుటుంబ సభ్యులు నిజమేనని నమ్మారు. చివరికి అతడి అరెస్టుతో నిజం బయటకు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Third wave: ‘మూడో’ ముప్పు.. 3 అవకాశాలు!

కరోనా కట్టడి నిబంధనల్ని పటిష్ఠంగా పాటించకపోయినట్లయితే మహమ్మారి మూడో దశలో కేసులు అక్టోబర్‌-నవంబరు మధ్య గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, రెండో వేవ్‌లో నమోదైన రోజువారీ కేసులతో పోలిస్తే మూడో వేవ్‌లో వాటిలో సగం మాత్రమే రికార్డవుతాయని తెలిపారు. ఒకవేళ సంక్రమణ సామర్థ్యం అధికంగా ఉన్న వైరస్‌లు వెలుగు చూస్తే మూడో వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Covid: క్షయపై పోరుకు కొవిడ్‌ అడ్డు

4. Arcitic: చివరిగడ్డ కరుగుతోంది!

పర్యావరణ మార్పుల ప్రభావం పట్టణాలనే కాదు... భూమి అంచులనూ చేరుతోంది! గాలి సైతం గడ్డకట్టేంత చలి ఉండే... ఆర్కిటిక్‌ ప్రాంతంలో మంచంతా కరిగినా... ఇక్కడ మాత్రం ఫర్వాలేదని శాస్త్రవేత్తలు ధైర్యంగా నమ్మిన ‘చివరి మంచు ప్రాంతం’ కూడా ఇప్పుడు పర్యావరణ ప్రభావానికి లోనవుతోంది! పర్యావరణ మార్పులిలాగే కొనసాగితే... మంచుతో నిండి ఉండే ఆర్కిటిక్‌లో 2040నాటికి... వేసవి మంచు అంతా కరిగిపోతుందని 2015లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. HYD: ఎస్‌బీఐ ఏటీఎంలో వింత సమస్య

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో వింత సమస్య తలెత్తింది. రాంనగర్‌లోని ఎస్‌బీఐ ఎటీఎంలో కస్టమర్లు నగదు విత్‌డ్రా చేస్తే వారి ఖాతాల నుంచి కాకుండా బ్యాంకు మూలధనం నుంచి డబ్బులు డెబిట్‌ అయ్యాయి. ఈ విధంగా రూ.3.40 లక్షలు విత్‌డ్రా జరిగింది. సాఫ్ట్‌వేర్‌ లోపంతో సాంకేతిక ఆధారాలు లభించలేదు. ఒకే ఏటీఎం నుంచి నగదు డెబిట్‌ కావడంతో సైబర్‌ కేటుగాళ్లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టీసీఎస్‌లో ఉద్యోగమంటూ యువతికి టోకరా

6. RGV: వాళ్లు విడిపోతుంటే మీకేంటి?

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు విడిపోవడంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. వారిద్దరికీ భవిష్యత్తు మరింత అందంగా, సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వాళ్లిద్దరి విడాకుల గురించి నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్‌ చేస్తోన్న వారికి కౌంటర్‌ విసిరారు. వాళ్లకి లేని బాధ మీకేంటి? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా బాధితులకు ఊబకాయం శాపం కాదు

పురుషులు, శరీర బరువు ఎక్కువగా ఉన్న కొవిడ్‌-19 బాధితులకు మరణం ముప్పు ఎక్కువంటూ జరిగిన విశ్లేషణలను తాజా అధ్యయనం ఖండించింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 44,305 మందితో సాగిన 58 అధ్యయనాలను విశ్లేషించి, ఈ మేరకు తేల్చారు. ఐసీయూలో చేరిన కొవిడ్‌ బాధితుల్లో పొగతాగేవారికి 40 శాతం, అధిక రక్తపోటు ఉన్నవారికి 54 శాతం, మధుమేహం ఉన్నవారికి 41 శాతం, శ్వాస సంబంధ రుగ్మతలున్నవారికి 75 శాతం మేర మరణం ముప్పు ఎక్కువని వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona : 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు

8. TS News: ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్‌ 

తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 151 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. www.tslprb.inలో నోటిఫికేషన్‌ వివరాలు తెలుసుకోవచ్చని పోలీస్‌ నియామక మండలి వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం

ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 85 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం సి-130 కుప్పకూలింది. జోలో ద్వీపం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు 40 మంది జవాన్లను రక్షించినట్లు ఆర్మీ చీఫ్‌ సిరిలిటో సొబెజనా తెలిపారు. మిగతావారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్‌ అవుతుండగా రన్‌వేను చేరుకోవడంలో ఫ్లైట్‌ విఫలమవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సొబెజనా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Russia: అలా కోటీశ్వరుడై.. ఇలా జైలుకెళ్లాడు

10. Petrol Price: చల్లారని పెట్రో ధరల మంట!

పెట్రోలు ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు విక్రయ సంస్థలు మూడుసార్లు ధరలు పెంచాయి. తాజాగా ఆదివారం లీటరు పెట్రోలుపై రూ.36 పైసలు, లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున పెరిగింది.  ఈ పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్  రూ.103.41; డీజిల్‌ రూ.97.40కు చేరుకుంది. తిరుపతి, విజయవాడలలో డీజిల్‌ ధరలు సెంచరీకి చేరువవుతున్నాయి. ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోల పెరుగుదల ప్రారంభమైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని