Updated : 07 Jul 2021 13:08 IST

Top Ten News @ 1 PM

1. పండ్లు అమ్ముకునే వ్యక్తిగా జీవితం మొదలు పెట్టి..

భారత సినీ ప్రపంచంలో అత్యుత్తమ నటుడు దిలీప్‌కుమార్‌. తనదైన ప్రత్యేకమైన నటనా చాతుర్యం, సంభాషణలతో ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించారు. రాజ్‌కపూర్‌, దేవానంద్‌లతో కలిసి హిందీ సినీ రంగంలో త్రిమూర్తుల్లో ఒకరిగా నిలిచారు. మెథడ్‌ యాక్టర్‌గా పేరొందిన దిలీప్‌కుమార్‌ నటనకు పాఠశాల వంటి వారు. ఏ పాత్ర నటిస్తే, ఆ పాత్ర తానే అయి, అత్యంత సహజమైన నటనను ప్రదర్శించేవారు. అలాంటి దిగ్గజ నటుడు బుధవారం తుది శ్వాస విడిచారు.  నటనలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన దిలీప్‌కుమార్‌ నటనా ప్రస్థానం పరిశీలిస్తే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Dileep Kumar: ఆయన మరణంతో ఓ శకం ముగిసింది

2. రూమ్‌ నెం. 39.. ఉత్తర కొరియా ఖజానా!

ఉత్తర కొరియా పేరు వినగానే ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఆయన నియంతృత్వ పాలన, విలాసవంతమైన జీవనశైలి గుర్తొస్తుంది. కిమ్‌ తను తినే ఆహార పదార్థాలను విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. ఖరీదైన కార్లు, వాచీలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే తరచూ కొనుగోలు చేస్తుంటాడు. తను ఉండటానికి దేశవ్యాప్తంగా 17 ప్యాలెస్‌లు, తన ఆరోగ్య పరిరక్షణ కోసం 130 మంది వైద్యులతో ఓ ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డెల్టా ప్లస్‌ ప్రమాదకరమనే ఆధారాల్లేవు: డీహెచ్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సందర్భంగా వైద్యారోగ్య, విద్యా, పోలీస్‌, జైళ్ల, శిశు సంక్షేమ శాఖలు ధర్మాసనానికి నివేదికలు సమర్పించాయి. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్యశాఖ ధర్మాసనానికి వివరించింది. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: 43వేల కేసులు..47వేల రికవరీలు

4. ట్రంప్‌ నిర్ణయం వాపస్‌.. బెజోస్‌కు కనకవర్షం..!

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో కుదిరిన ఓ డీల్‌ను ప్రస్తుత బైడెన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. రెండేళ్ల క్రితం టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌కు ఇచ్చిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌ ప్రకటించింది. దీంతో అపరకుబేరుడు, అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌కు కనకవర్షం కురిసింది. ఒక్కరోజే ఆయన నికర సంపద రూ.62వేల కోట్లకు పైనే పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. MS Dhoni: ఈ 5 ధోనీకే సాధ్యం!

భారత క్రికెట్‌ మహామహులైన ఆటగాళ్లను చూసింది. అక్కున చేర్చుకుంది. పేరు ప్రతిష్ఠలు, అంతులేని సంపదలు అందించింది. ఒక్కొక్కరిది ఒక్కో శైలి.. ఒక్కో తత్వం.. మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రం అందరికీ భిన్నం. కేవలం భారతే కాదు అసలు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనూ ఎవరికీ సాధ్యం కానివి అతడు సాధించి పెట్టాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియాకప్‌లు, మూడు ఐపీఎల్‌ ట్రోఫీలు.. ఇది మహేంద్రుడు మాత్రమే చేయగల మాయాజాలం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India vs Srilanka: వీళ్లుంటే.. సెంచరీల మోతే! 

6. Choksi: భారత్‌ చెప్తేనే నన్ను అరెస్టు చేశారు 

భారత ప్రభుత్వ అధికారుల ‘ఆదేశాల’తోనే డొమినికా పోలీసులు తనను అరెస్టు చేశారని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ ఆరోపించారు. ఈ మేరకు డొమినికా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి, అక్కడి పోలీస్‌ చీఫ్‌, దర్యాప్తు అధికారిపై హైకోర్టులో కేసు వేశారు. తనపై ఉన్న కేసులన్నంటినీ కొట్టివేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Pawan: ప్రజల కన్నీళ్లు తుడుస్తాం: పవన్‌

జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్‌.. కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* HYD: ప్రగతిభవన్‌ ముట్టడికి నర్సుల యత్నం

8. కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య

దివంగత కేంద్ర మాజీ మంత్రి పి.ఆర్‌.కుమారమంగళం సతీమణి కిట్టీ కుమారమంగళం హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దిల్లీ వసంత్‌ విహార్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిట్టీ కుమారమంగళం ఆమె నివాసంలో మరో సహాయకురాలితో కలిసి నివాసముంటున్నారు. తరచూ బట్టలు ఉతకడానికి వచ్చే ఓ వ్యక్తి మంగళవారం రాత్రి తలుపు కొట్టాడు. తెలిసినవాడు కావడంతో ఇంట్లోని సహాయకురాలు లోపలికి అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. pak: భారత సరిహద్దుల్లో పాక్‌ సెల్‌ టవర్లు..!

భారత సరిహద్దుల్లో పాక్‌ నిర్మించిన సెల్‌ టవర్లు ఆందోళనకరంగా మారాయి. ఇటీవల జమ్ములో డ్రోన్‌ దాడి జరగడంతో ఇప్పుడు సెల్‌ టవర్లు మన భధ్రతా సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జమ్ము దాడి నేపథ్యంలో నిన్న హోంశాఖ కీలక అధికారులు దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా భారత సరిహద్దుల్లో పాక్‌ సెల్‌ టవర్‌ నిర్మించి మొబైల్‌ నెట్‌వర్క్‌ను బలపర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భూమా అఖిలప్రియ భర్తపై మరో కేసు

10. బావి మాయమైంది.. వెతికిపెట్టండి

పొలంలోని బావి కనిపించడం లేదని.. వెతికి పెట్టాలని ఓ రైతు పోలీసులకు విన్నవించారు. కర్ణాటక బెళగావి జిల్లాలోని మావినహొండ గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అవాక్కయిన పోలీసులు.. అసలు విషయం ఆరాతీశారు. పంచాయతీ అధికారులు రైతు మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్లు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని