Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2021 13:10 IST

1. Corona: ఈ 4 కారణాలు.. వైరస్‌కు ఆహ్వానాలు

కరోనా మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదనిపిస్తోంది కొన్ని రోజులుగా నెలకొంటున్న పరిస్థితులను చూస్తుంటే. ఇటీవల భారత్ సహా పలు దేశాల్లో వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టినట్లే కన్పించినా.. తాజాగా మళ్లీ వ్యాప్తి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌. వేగంగా వ్యాపిస్తోన్న డెల్టా వేరియంట్‌ కరోనా ఉద్ధృతికి ప్రధాన కారణం కాగా..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: మరోసారి.. వెయ్యి దాటిన మరణాలు

2. సైనిక లాంఛనాలతో వీర జవాన్‌ అంత్యక్రియలు

కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో గురువారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలుకోల్పోయిన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి (23) అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో సైనిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి సుచరిత, ఉపసభాపతి కూన రఘుపతి పాల్గొన్నారు. సీఎం జగన్‌ ప్రకటించిన రూ.50 లక్షల సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. IPL : ధోనీ ఆడకపోతే నేనూ ఆడను!

మ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్‌ ధోనీ ఆడకపోతే తానూ ఐపీఎల్‌కు దూరమవుతానని స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో చెన్నై గెలిస్తే మరో రెండేళ్లు కొనసాగేందుకు మహీ భాయ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ‘నేను మరో నాలుగైదేళ్లు ఆడగలను. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఇంకా ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు రాబోతున్నాయి. నేను మాత్రం సీఎస్‌కేకు మాత్రమే ఆడతానని అనుకుంటున్నా. ఈ ఏడాది మేం రాణిస్తామని ధీమాగా ఉన్నాను’ అని అని రైనా అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* OMG: అమ్మాయిల క్రికెట్లో అద్భుత క్యాచ్‌..

4. Universe: విశ్వంలో కొత్త రకం విస్ఫోటం

విశ్వంలో ఒక కొత్త రకం తారా విస్ఫోటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన పాలపుంత గెలాక్సీలో అనేక రకాల మూలకాల ఆవిర్భావానికి సంబంధించిన గుట్టుమట్లను విప్పింది. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.  న్యూట్రాన్‌ తారల విలీనం ద్వారా మాత్రమే భార మూలకాలు ఉత్పత్తవుతాయన్న భావన ఇప్పటివరకూ ఉండేది. అయితే విశ్వం ఆవిర్భావానికి కారణమైన ‘బిగ్‌ బ్యాంగ్‌’ సంభవించిన కొద్దికాలానికే ఈ భార మూలకాలు ఏర్పడిన సంగతి శాస్త్రవేత్తలకు తెలుసు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. TS news: సాగర్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేత

నాగార్జునసాగర్‌లో జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 11 రోజుల్లో 30 మిలియన్‌ యూనిట్లను జెన్‌కో ఉత్పత్తి చేసింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణ జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని  కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని కేఆర్‌ఎంబీతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నారాయణపేటలో అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం

6. Insurance: బీమా తొలి ప్రీమియం వసూళ్లు పెరిగాయ్‌

జీవిత బీమా పాలసీల తొలి ప్రీమియం వసూళ్లు జూన్‌లో 4శాతం పెరిగాయి. ఐఆర్‌డీఏఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అన్ని జీవిత బీమా సంస్థలూ కలిపి జూన్‌లో రూ.30,009.48 కోట్ల మేరకు తొలి ప్రీమియం వసూలు చేశాయి. 2020 ఇదే నెలలో తొలి ప్రీమియం వసూళ్లు రూ.28,868.68 కోట్లే. అయితే భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తొలి ప్రీమియం వసూళ్లలో 4.14 శాతం క్షీణత కనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Petrol Prices: ఆగని పెట్రో బాదుడు

దేశంలో చమురు ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు శుక్రవారం ఒక్కరోజు విరామం ఇచ్చిన విక్రయ సంస్థలు.. శనివారం మళ్లీ పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 27 పైసలు చొప్పున వాతపెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.13కు చేరగా డీజిల్‌ రూ.99.66కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.87, డీజిల్ ధర రూ.97.96గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Auto news: పెట్రో బాదుడు నుంచి విముక్తి ఇలా..

8. ఉద్ధృతమవుతోన్న ఉక్కు కార్మికుల పోరాటం 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికుల చేస్తున్న పోరాటం రోజు రోజుకూ ఉద్ధృతమవుతోంది. ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలను నిరసిస్తూ భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, అఖిలపక్ష కార్మిక నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జగన్‌, షర్మిల మధ్య విద్వేషాల్లేవు: డిప్యూటీ సీఎం

ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఎలాంటి విద్వేషాలు, మనస్పర్థలు లేవని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాచెల్లెలు మధ్య విభేదాలున్నాయని వదంతులు సృష్టిస్తున్నారన్నారు. జగన్‌కు ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు కాదని చెప్పారు. కేసీఆర్‌ అంటే జగన్‌కు మంచి అభిమానం ఉందని నారాయణస్వామి తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP news: డాన్సర్లతో వైకాపా నేతల చిందులు

10. నేను ప్రేమలో విఫలమయ్యా: అనుపమ

నటి అనుపమ పరమేశ్వరన్‌ తన ప్రేమ గురించి బయటపెట్టారు. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని తెలిపారు. ‘అ ఆ’తో నాగవల్లిగా మెప్పించి తెలుగువారికి చేరువైన ఈ మలయాళీ కుట్టి వరుస ప్రేమకథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సోషల్‌మీడియాలో సూపర్‌ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని