Updated : 11 Jul 2021 13:17 IST

Top Ten News @ 1 PM

1. J&K: ప్రభుత్వ ఉద్యోగుల ముసుగులో..!

సయ్యద్‌ సలాహుద్దీన్‌.. ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌. మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది. అతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్క కుమారుడు తప్ప అందరూ జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 2016లో వీరిలో ఒక కుమారుడు పనిచేస్తున్న కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేస్తే.. భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి అందరితోపాటు అతడిని కూడా కాపాడాయి. తాజాగా సలాహుద్దీన్‌ సంతానంలో ఇద్దరు కుమారులు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. WIvsAUS: ఆసీస్‌కు రెండో షాకిచ్చిన వెస్టిండీస్‌

వెస్టిండీస్‌ జట్టు ఆస్ట్రేలియాకు వరుసగా రెండో టీ20లోనూ షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలుపొందిన కరీబియన్‌ జట్టు తాజాగా జరిగిన రెండో మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. ఐదు టీ20ల ఈ సిరీస్‌లో విండీస్‌ ఇంకో మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చిన్నారి హృదయాలను కాపాడండి: గావస్కర్‌

3. ‘ఆ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం’

రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, బాల వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ, సీమ ఎత్తిపోతల వల్ల జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుంది. పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్‌పైనే ఆధారపడ్డాయి. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే మా పరిస్థితేంటి?’’ అని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌లో ఆషాఢమాస బోనాలు ప్రారంభం

హైదరాబాద్‌లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఇవాళ ప్రారంభమైన ఆషాఢబోనాలు వచ్చే నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: వైభవంగా దుర్గమ్మకు ఆషాఢ సారె

5. Taliban: భారత్‌ చేరుకున్న అఫ్గాన్‌లోని దౌత్యసిబ్బంది

అఫ్గానిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం నుంచి మన దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన విమానంలో భారత్‌కు తీసుకొచ్చింది. అయితే, భారత కాన్సులేట్‌ను మాత్రం ఇంకా మూసివేయలేదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IT Rules: ఎట్టకేలకు దిగొచ్చిన ట్విటర్‌!

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్‌లో ‘రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి’(ఆర్‌జీఓ)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్​ప్రకాశ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు సంస్థ వెబ్‌సైట్‌లో ఆయన వివరాలు ఉంచింది. అందులోని ఈమెయిల్ ​ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Ransomware: రాన్సమ్‌వేర్‌ను అడ్డుకోండి

7. హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

మహానగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి,బాలానగర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, లంగర్‌హౌస్‌, గోల్కొండ, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట,యాకుత్‌పుర, కార్వాన్, బహదూర్‌పుర, దూద్‌బౌలి,గౌలిపుర తదిరత ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఊపిరి తీసుకోనివ్వని ఉత్కంఠ

దెయ్యలు, భూతాలు లేకున్నా... భయపడిపోతారు. అతీంద్రియ శక్తులేవి లేకుండానే అద్భుతాలు జరగాలని కోరుకుంటారు. అనుక్షణం ఉత్కంఠ, ప్రతి సన్నివేశంలో ఆశ్చర్యం... అనుభవిస్తారు. ఎక్కడా అంటారా? ‘డోంట్‌ బ్రీత్‌’ సినిమా చూడండి. ఇవన్నీ మీకూ అనుభవమవుతాయి. ఊపిరి తీసుకోవడమూ మరిచిపోయిన అనుభూతి మీ సొంతమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నేడు రోదసిలోకి తెలుగమ్మాయి

9. ఒకసారి ఛార్జింగ్‌తో 120 కి.మీ ప్రయాణం

నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ రోడ్లపైనా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఉండే విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది గ్రావ్‌టన్‌ మోటార్స్‌. హైదరాబాద్‌కు చెందిన ఈ అంకురం తన తొలి విద్యుత్‌ వాహనం ‘క్వాంటా’ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 120 కిలోమీటర్లు అవలీలగా దూసుకుపోవచ్చని వెల్లడించింది. లి-ఐయాన్‌ బ్యాటరీని రిబ్‌డ్‌ ఛాసిస్‌లో బిగించడం ద్వారా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ సీఈఓ పరశురామ్‌ పాక తెలిపారు. రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం అనే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Corona : 41 వేల కేసులు.. 41 వేల రికవరీలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజాగా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. నిన్న 18,43,500 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 41,506 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్య కాస్త తగ్గింది. అంతకుముందు రోజు 1200 మరణాలు నమోదు కాగా.. తాజాగా 895 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కీళ్లనొప్పులకు చెక్‌ చెబుదామా...

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని