Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Jul 2021 13:45 IST

1. ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించారు. విజయవాడలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోస్టులను విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు, సంస్థల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మూడో వేవ్‌కు అంత తీవ్రత ఉండకపోవచ్చు

భారత్‌లో కరోనా మూడో వేవ్‌ వచ్చినా.. అది రెండో వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు.  మూడో వేవ్‌ తప్పదంటూ విస్తృతంగా అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఊరట కలిగిస్తున్నాయి. ఇటీవల వారు నిర్వహించిన ఓ అధ్యయనం గురించి ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: 38వేల కేసులు..43వేల రికవరీలు

3. అప్పుడే గెజిట్‌పై స్పందిస్తా: చంద్రబాబు 

 తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నేత బచ్చుల అర్జునుడిని పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. బచావత్‌ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని తెలిపారు. దీనిపై వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Tokyo Olympics: ఒలింపిక్‌ గ్రామంలో తొలి కరోనా కేసు

మరో ఆరురోజుల్లో ఒలింపిక్స్‌ క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్‌ కలకలం రేపింది. ఒలింపిక్స్‌ క్రీడా గ్రామంలో తొలి కరోనా కేసు నిర్ధారణ అయ్యింది. స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు టోక్యో నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా శనివారం వెల్లడించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలను బయటపెట్టలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Cricket News: ఆఖరి ఓవర్లో 35 పరుగులు! 

5. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: యడియూరప్ప

కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వస్తున్న వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, భాజపా నేత యడియూరప్ప ఖండించారు. రాజీనామాపై వస్తున్న ఊహాగానాల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. కర్ణాటకలో ప్రాజెక్టులు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకే తాను దిల్లీ వచ్చినట్లు చెప్పారు. యడియూరప్ప, ఆయన కుమారుడు విజేయంద్ర శుక్రవారం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. సాయంత్రం వీరిద్దరూ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులను కలిశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నెల‌కు రూ.1.5 ల‌క్ష‌ల ఆదాయం కోసం ప్ర‌ణాళిక‌

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబ‌డి ఉంటాయి. కానీ, పెట్టుబడిదారుడు దీర్ఘ‌కాలం కొన‌సాగితే ఈ రిస్క్ త‌గ్గుతుంది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), పోస్ట్ ఆఫీస్ రిక‌రింగ్ డిపాజిట్, వంటి డెట్ ప‌థ‌కాలు దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం.  పెట్టుబడి దీర్ఘకాలికంగా అంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవ‌డం మంచిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* జస్ట్‌ డయల్‌లో రిలయన్స్‌ రిటైల్‌కు 41% వాటా

7. ఎలుకల పాలైన రూ. 2లక్షల వృద్ధుడి కష్టార్జితం 

‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం’ అనేది నానుడి. కానీ, మహబూబాబాద్ జిల్లాలో ఓ ఎలుక చెలగాటం ఓ నిరుపేదకు ప్రాణసంకటంగా మారింది. అనారోగ్యం బారిన పడిన ఓ వృద్ధుడు శస్త్రచికిత్స కోసం దాచుకున్న డబ్బును ఎలుకలు కొరికేశాయి. దాదాపు రూ.2 లక్షలకు పైనే నగదును పనికి రాకుండా చేశాయి. 500 నోట్లన్నింటికీ రంధ్రాలు చూసిన వృద్ధుడు బోరున విలపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారు ఇందిరానగర్ తండాకు చెందిన రెడ్యా కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Corona: ప్రధాన విలన్‌ డెల్టానే

టీకా పొందాక కూడా కొందరు కొవిడ్‌-19 బారినపడటానికి ప్రధాన కారణం డెల్టా రకం కరోనా వైరస్సేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇలాంటివారిలో 9.8 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, 0.4 శాతం కేసుల్లోనే మరణం సంభవించిందని తేలింది. దీన్నిబట్టి ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని, మరణాలను టీకాలు తప్పిస్తున్నాయని అధ్యయనం స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Covid: 10 మంది కుటుంబీకులను కోల్పోయా..

9. Baahubali: ప్రీక్వెల్‌కు సిద్ధం కండి..!

తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ నలుదిశలకు వ్యాపింపజేసిన బ్లాక్‌ బస్టర్‌ ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడా చిత్రానికి ప్రీక్వెల్‌ రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్‌’ పేరుతో ప్రీక్వెల్‌ని వెబ్‌సిరీస్‌ రూపంలో విడుదల చేయనున్నట్లు ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం మహిష్మతి సామ్రాజ్యం ఎలా ఏర్పడింది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Train: 19 నుంచి డెము, మెము రైళ్లు

దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 19 నుంచి కొన్ని... 20, 21 తేదీల నుంచి మరికొన్ని ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా నేపథ్యంలో 2020 మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఈ రైళ్లు రద్దయ్యాయి. గతంలో తిరిగే రైళ్ల స్థానే అదే మార్గంలో కొత్త నంబర్లతో ప్రత్యేక రైళ్లుగా ద.మ.రైల్వే పట్టాలు ఎక్కిస్తోంది. మొత్తం 82 రైళ్లను నడపనుండగా అందులో 66 ప్యాసింజర్లు కాగా, 16 ఎక్స్‌ప్రెస్‌లు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పది కిలోమీటర్లు పొడిగిస్తే.. విమానాశ్రయానికి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని