Updated : 18 Jul 2021 13:12 IST

Top Ten News @ 1 PM

1. India vs Srilanka: తొలి వన్డేకు వర్షం ముప్పు!

భారత్‌, శ్రీలంక వన్డే సిరీసుకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి వన్డే మొదలవ్వనుంది. చాన్నాళ్ల నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌ మెరుపులు లేకపోవడంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐతే.. వారిని నిరాశపరిచే వార్త! తొలి వన్డే జరగనున్న ప్రేమదాస స్టేడియంలో ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరుణుడు బ్యాటింగ్‌ చేయొచ్చు! చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Shikhar Dhawan: కోహ్లీ, శాస్త్రీ చెబితే అలాగే చేస్తాం!

2. WhatsApp: మీ గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ లీకైందా? 

వాట్సాప్‌లో గ్రూపులు క్రియేట్‌ చేయడం సులువు. మనకు నచ్చిన వారిని చేర్చొచ్చు. లేదంటే ఇన్వైట్‌ లింక్‌ ద్వారా గ్రూప్‌లోకి ఆహ్వానించొచ్చు. అలా కొన్నిసార్లు మనం పంపే ఇన్వైట్‌ లింక్‌ మనకు పరిచయం లేని వ్యక్తులకు కూడా చేరిపోతుంటుంది. దీంతో గుర్తు తెలీని వ్యక్తులు మన గ్రూపుల్లో చేరిపోతుంటారు. దీనివల్ల గ్రూప్ ప్రైవసీకి భంగం కలగడమే కాకుండా అడ్మిన్‌కు కొత్త చికాకులు ఎదురవుతాయి. గ్రూప్‌లో చేరే వారిని ఆపుదామంటే అప్పటికే ఇన్వైట్ లింక్ ఇతరులకు షేర్‌ అయిపోయి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Maharashtra: 23కు చేరిన మృతుల సంఖ్య..!

మహారాష్ట్రలోని చెంబూరు, విఖ్రోలిలో గోడలు కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 23కు పెరిగింది. చెంబూరులో జరిగిన ఘటనలో 17 మంది మృతి చెందగా.. విఖ్రోలిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆంగ్లపత్రిక ఇండియాటుడే పేర్కొంది. ఈ ఘటనల్లో మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు. ‘‘ముంబయిలోని చెంబూరు, విఖ్రోలిలో గోడలు కూలి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

West Europe: పశ్చిమ ఐరోపా అతలాకుతలం

4. 40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్‌

భారత్‌ వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని దాటింది. శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులతో కలిపి దేశంలో టీకాల పంపిణీ 40 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం 21,18,682 మంది తొలిడోసు స్వీకరించగా.. 2,33,019 మంది రెండో డోసు తీసుకొన్నారు. దీంతో 40.49 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లైంది. ఇక కొవిడ్‌ సోకిన వ్యక్తికి క్షయ (టీబీ) సోకే అవకాశలు పెరిగిపోతాయని అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పగలు కలెక్టర్‌.. రాత్రి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌!

ప్రపంచ శ్రేణి క్రీడల్లో పాల్గొనే ఏ అథ్లెట్‌ అయినా పతకాలు సాధించాలని బలంగా కోరుకుంటారని, అందుకు తానూ మినహాయింపేమీ కాదన్నారు యూపీలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్‌ సుహాస్‌ యతిరాజ్‌ అన్నారు. ఆగస్టు 24నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్‌ క్రీడల్లో ఐఏఎస్‌ అధికారి బ్యాడ్మింటన్‌ విభాగంలో పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మీడియాతో ముచ్చటించిన ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. సుహాస్‌ పారా-బ్యాడ్మింటన్‌ విభాగంలో ప్రపంచంలో మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. US: ఒబామా వలస విధానం చట్టవిరుద్ధం 

అమెరికాలో ఒబామా హయాంలో తీసుకొచ్చిన వలస విధానం చట్టవిరుద్ధమంటూ టెక్సాస్‌లోని ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి ఆండ్రూ హానెన్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. నాటి విధానం 6 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులకు రక్షణ కవచంలా నిలిచిందని అభ్యంతరం చెప్పారు. తాజా తీర్పు.. ‘డ్రీమర్స్‌’కు చట్టబద్ధమైన రక్షణ, పౌరసత్వం కల్పించాలనుకుంటున్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ యంత్రాంగం ప్రయత్నాలకు విఘాతంగా మారింది. ఈ తీర్పుపై అపీల్‌కు వెళ్తామని బైడెన్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

US: వాషింగ్టన్‌లో కాల్పుల కలకలం

7. ఎలుకలు నగదు కొట్టేసిన బాధితుడికి మంత్రి హామీ

మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వృద్ధుడు శస్త్రచికిత్స కోసం దాచుకున్న డబ్బును ఎలుకలు కొరికేసిన ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. రైతుకు మెరుగైన వైద్యం, డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ మండలం వేంనూరు శివారు ఇందిరానగర్‌ కాలనీ తండాకు చెందిన భూక్య రెడ్యా కడుపులో కణితి రావడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది. అందుకు రూ.4 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నా కొడుకు ధైర్యవంతుడు: జర్నలిస్ట్‌ సిద్ధిఖీ తండ్రి

తన కొడుకు వృత్తిని అమితంగా ప్రేమించేవాడని, ధైర్యవంతుడని అఫ్గాన్‌లో మృతి చెందిన ఫొటో జర్నలిస్టు దానిశ్‌ సిద్దీఖి తండ్రి మహ్మద్‌ అఖ్తర్‌ సిద్దీఖి అన్నారు. ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ వృత్తి అవసరమా.. అని ఆరంభంలో దానిశ్‌ను హెచ్చరించామని, అయినా వినలేదని తెలిపారు. ‘‘దానిశ్‌.. చాలా ప్రశాంతంగా ఉండేవాడు. పిల్లలంటే చాలా ఇష్టం. భావోద్వేగ వ్యక్తి. ఈ వృత్తిని మానేయమని ఆరంభంలో చెప్పాం. కానీ రక్షణ ఉంటుందని చెప్పాడు. అన్ని జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరించేవాళ్లం’’ అని అఖ్తర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Araku tour: అరకు టూర్‌ ప్లాన్‌ చేశారా..?

 కొవిడ్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైపోయారని భావిస్తున్నారా? లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా? సరైన టూరిస్ట్‌ స్పాట్‌ కోసం వెతుకుతున్నారా? అలాంటి వారికి పచ్చదనం కప్పుకొన్న ప్రకృతి అందాలను పరిచయం చేస్తూ చల్లటి సాయంత్రం వేళ చక్కని కాఫీ అందించే ప్రముఖ పర్యాటక ప్రాంతం.. అరకు మీకు స్వాగతం పలుకుతోంది. భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ అరకు వెళ్లాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Aditya 369: టైమ్‌ మెషీన్‌ తెచ్చిన కబుర్లివే!

బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్‌ మూవీ ‘ఆదిత్య 369’. ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది. టైమ్‌ మెషీన్‌ మాట్లాడుతూ ఈ చిత్రానికి మూల స్తంభాలైన సింగీతం శ్రీనివాసరావు, బాలకృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్‌, పేకేటి రంగా, తరుణ్‌ల మనోగతాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నానీ రుణం తీర్చుకోలేను

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని