Updated : 20 Jul 2021 13:50 IST

Top Ten News @ 1 PM

1. china: డ్రాగన్‌ చేతికి మైక్రోసాఫ్ట్‌ జీరోడే..!

జనవరిలో చైనా మైక్రోసాఫ్ట్‌ సర్వర్ల ఎక్స్‌ఛేంజీని హ్యాక్‌ చేసింది.. ఈ విషయాన్ని అమెరికా, యూకే, నాటో కూటమి ధ్రువీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా 30,000 కంపెనీల కీలక సమాచారాన్ని అపహరించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికా మిత్రపక్షాలు- చైనా మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే చైనాలోని మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్యూరిటీ గూఢచర్యం చేయిస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఈ హ్యాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Corona: ఒకే వ్యక్తి.. ఒకేసారి రెండు వేరియంట్లు

కరోనా వైరస్‌లో కొత్త రకాలు పుట్టుకొస్తోన్న వేళ.. ఒకే వ్యక్తికి రెండు వేరియంట్లు సోకిన ఘటన భారత్‌లో వెలుగుచూసింది. అస్సాంలోని ఓ మహిళా వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడినట్లు నమూనా పరీక్షల్లో నిర్ధారణ అయింది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు. దీనిపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)కి చెందిన అధికారి విశ్వజ్యోతి బొర్కాకొటి మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: భారీగా తగ్గిన కేసులు, మరణాలు

3. ఈటలతో వ్యక్తిగత కక్ష లేదు: గంగుల

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాని చెప్పారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని వివరించారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. విచారణలో నా పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. India vs Srilanka: హాయ్‌ పృథ్వీ! నీ బ్యాటింగ్‌ బాగుంది

యువ ఓపెనర్‌ పృథ్వీషా పాదాల కదలిక చాలా బాగుందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. ఇప్పుడు బంతిని చక్కగా ఆడగలుగుతున్నాడని ప్రశంసించాడు. శ్రీలంకతో తొలి వన్డేలో 24 బంతుల్లోనే 43 పరుగులు చేయడం అద్భుతమని కొనియాడాడు. పృథ్వీషాకు ఛాపెల్‌ ఓ లేఖ రాశాడని తెలిసింది.‘హాయ్‌ పృథ్వీ! శ్రీలంకపై నువ్వాడిన ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ చూశాను. ఇప్పుడు నీ పాదాల కదలిక మరింత బాగుంది’ అని ఛాపెల్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రెండో వన్డేకు అందుబాటులో సంజు

5. తన బయోపిక్‌ గురించి ప్రియాంక ఏమందంటే?

బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా కొనసాగుతూనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడా సత్తా చాటుతోంది ప్రియాంక చోప్రా. నిక్‌ జొనాస్‌తో పెళ్లయ్యాకా అంతర్జాతీయంగా మరింత పాపులర్‌ అయ్యింది. పలు అంతర్జాతీయ వేదికలపై గౌరవాలు, సత్కారాలు అందుకుంటోంది. తమిళ చిత్రం ‘తమిజాన్‌’తో నాయికగా కెరీర్‌ మొదలుపెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయికగా ఎదిగింది. జాతీయస్థాయి ఉత్తమ కథా నాయికగా పురస్కారం అందుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇలా అయితే బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బు సేఫ్‌!

‘డిపాజిట్ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ చట్టం(డీఐసీజీసీ)-1961’ ప్రకారం బ్యాంకుల్లో ఉండే మన సొమ్ములో రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. అంటే ఏదైనా అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని బ్యాంకు నుంచి డబ్బు తస్కరణకు గురైనా.. లేదా బ్యాంకు దివాలా తీసి ఖాతాదారులకు చెల్లించలేకపోయినా.. ఈ బీమా వల్ల రూ.5 లక్షల వరకు మనకు తిరిగి వస్తాయి. మిగతా సొమ్ముకు ఒకరకంగా చెప్పాలంటే రక్షణ లేనట్లే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈ 6 సూత్రాలతో.. మీ డబ్బులకు డబ్బులు కాస్తాయి

7. Unlock: దశలవారీగా పాఠశాలలు తెరవాలి

దేశంలోని పాఠశాలలను దశలవారీగా తెరవాలని ఎయిమ్స్‌ సంచాలకుడు రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశాన్ని దేశం పరిశీలించాలని వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో గతేడాది మార్చిలో తొలి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి దేశంలో పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తరగతులను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓ‘పెన్‌’ చేయాలంటే రూ.7 లక్షలు

ఒక పెన్‌.. ఎంత ఖరీదు ఉంటుంది. రూ.10 నుంచి రూ.వెయ్యి వరకు ఉంటుంది. ఇంకాస్త విభిన్నమైనది అయితే రూ.వేలల్లో ఉంటుంది. అలాంటిది బెంగళూరులోని కోరమంగళలో విలియమ్‌ పెన్స్‌ సంస్థ రూ.7 లక్షల విలువైన కలాన్ని విక్రయానికి ఉంచింది. ఈ సంస్థ 20 ఏళ్లుగా బ్రాండెడ్‌ కలాలకు చిరునామాగా నిలుస్తోంది. ఇక్కడ రూ.10వేల విలువైన కలాలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వేల ఉద్యోగాలకు పది చాలు!

9. Space Tour: బెజోస్‌ రోదసియాత్ర ఇలా..

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను రోదసిలోకి తీసుకెళ్లే ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌక యాత్ర ఆద్యంతం ఒక ప్రణాళిక ప్రకారం సాగుతుంది. పూర్తి స్వయంచాలితమైన ఈ నౌకకు పునర్‌వినియోగ సామర్థ్యం ఉంది. దీన్ని పదేపదే ఉపయోగించొచ్చు. ఆరంభం నుంచి ముగింపు వరకూ యాత్ర ఇలా సాగుతుంది. రోదసిలో తేలియాడే అంతరిక్ష కాలనీలను నిర్మించే లక్ష్యంతో 2000లో బ్లూ ఆరిజిన్‌ను బెజోస్‌ స్థాపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Pegausus: ‘పెగాసస్‌’తో దద్దరిల్లిన పార్లమెంట్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ‘పెగాసస్‌’ వ్యవహారం కుదిపేస్తోంది.  హ్యాకింగ్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఆందోళనలకు దిగాయి. దీంతో కొద్ది నిమిషాలకే ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్షాలు ‘పెగాసస్‌’ అంశాన్ని లేవనెత్తాయి. హ్యాకింగ్‌ వ్యవహారంపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. విపక్ష ఎంపీలు సీట్ల నుంచి బయటకు వచ్చి నినాదాలు చేశారు. సభను కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్‌ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: రేపు తెరాసలోకి కౌశిక్‌ రెడ్డి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని