Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jul 2021 13:52 IST

1. డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో చెప్పిన ఆనంద్‌ మహీంద్రా!

ట్రెండింగ్‌ అంశాలతో నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా ప్రజలకు ఓ పాఠం నేర్పించారు. డబ్బులు వృథాగా ఎలా ఖర్చు చేయకూడదో సొదాహరణంగా చూపించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. వైరస్‌.. అమ్మానాన్నలను తీసుకుపోయింది..!

ఏడాదిన్నర కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి విలయంలో హృదయవిదారక కోణమిది. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన ఈ మాయదారి మహమ్మారి.. ఎంతో మంది చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. లక్షల మంది పిల్లలను దిక్కులేనివారిని చేసింది. కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15లక్షల మందికి పైనే చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయినట్లు లాన్సెట్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. ఒక్క భారత్‌లోనే 1.19లక్షల మంది పిల్లలపై కరోనా కాఠిన్యం చూపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: 40శాతంమేర పెరిగిన కొత్త కేసులు

3. విభజిత రాష్ట్రంలో రిజర్వేషన్‌ ప్రయోజనాలుండవా?

ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్‌ పొందిన షెడ్యూల్‌ కులాలకు చెందిన ఓ వ్యక్తి విభజన తర్వాత ఏర్పాటైన రాష్ట్రంలో తన కోటా ప్రయోజనాలను కోల్పోతారా? - ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి ప్రశ్న తొలిసారి తమ ముందుకి వచ్చినట్లు జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి ఉదంతం ఎక్కడైనా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని విచారించనున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో సహకరించాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ని అడిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Vishal: మరోసారి తీవ్రంగా గాయపడిన విశాల్‌

కోలీవుడ్‌ నటుడు విశాల్‌ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. తదుపరి సినిమా యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయమైంది. విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’. శరవణన్ దర్శకత్వంలో విశాల్‌ 31వ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈసినిమా షూట్‌ జరుగుతోంది. ఇందులో విశాల్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎంతో ఎనర్జిటిక్‌గా సాగుతోన్న క్లైమాక్స్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లో బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. China: భారీ వరదలు.. తేలియాడిన కార్లు

చైనాలోని హెనన్‌ ప్రావిన్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 1000ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడంతో భీకర వరదలు సంభవించాయి. ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు కనీసం 12 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెనన్‌ ప్రావిన్స్‌.. అనేక వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక. చైనా అతిపెద్ద ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ కూడా ఇక్కడే ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నామినేటెడ్‌ పదవుల్లో వివక్ష: అచ్చెన్నాయుడు

నిధులు, అధికారాలున్న కార్పొరేషన్లను సీఎం జగన్‌ సొంత సామాజిక వర్గానికి ఇచ్చి ప్రాధాన్యత లేని పదవులను బలహీనవర్గాలకు ఇచ్చారని తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైకాపాలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ.. విద్యావంతులైన నిరుద్యోగులపై లేదని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులను డమ్మీలుగా చేశారని.. నామినేటెడ్‌ పదవుల్లోనూ వివక్ష చూపించారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ద్రవిడ్‌ ఆందోళన.. రాహుల్‌తో దీపక్‌కు సందేశం!

రాహుల్‌ ద్రవిడ్‌ అంటేనే మిస్టర్‌ కూల్‌! మ్యాచ్‌ ఎంత ఉత్కంఠంగా సాగుతున్నా అతడు మాత్రం ప్రశాంతంగానే ఉంటాడు. శ్రీలంకతో రెండో వన్డేలో మాత్రం అతడు కాస్త ఆందోళన చెందినట్టు కనిపించింది. వెంటనే డ్రస్సింగ్‌ రూమ్‌ నుంచి డగౌట్‌కు చేరుకున్నాడు. బ్యాటింగ్‌ చేస్తున్న దీపక్‌ చాహర్‌కు తమ్ముడు రాహుల్‌ చాహర్‌తో ఏదో సందేశం పంపించాడు. ఆ సంగతి పక్కనపెడితే అతడు డగౌట్లో కనిపించడం మాత్రం వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Deepak chahar: ద్రవిడ్‌ సర్‌ నమ్మకం వల్లే..

8. కొత్తతరం కెరియర్లు.. మెకట్రానిక్స్‌.. రోబోటిక్స్‌

సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఈ అవసరాన్ని తీర్చే సామర్థ్యమున్నవే మెకట్రానిక్స్, రోబోటిక్స్‌. అందుకే ఇవి ఎవరూ ఊహించని స్థాయిలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. వీటి సాంకేతిక పరిజ్ఞానం యంత్రాలకు జీవం పోయటమే కాకుండా వాటి నిర్వహణలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించడానికీ ఉపయోగపడుతోంది. ఈ ఉద్యోగాలకు భవిష్యత్తులో బాగా డిమాండ్‌   పెరగబోతోందని లింక్డ్‌ఇన్‌ నివేదిక వెల్లడిస్తోంది!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. TS News: రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి తొర్రూర్ వెళ్తున్న బస్సుకు ఫిట్‌నెస్‌ లేకపోవడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్‌ తెలిపారు. అనంతరం వేరే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ట్యాంకరు కింద పడి తండ్రీ కుమారుడు మృతి

10. దీపక్‌ ఆర్డర్‌ నిర్ణయం ద్రవిడ్‌దే: భువీ

దీపక్‌ చాహర్‌ను ముందు పంపించాలన్న నిర్ణయం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌దేనని టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అతడా స్థానానికి న్యాయం చేశాడని ప్రశంసించాడు. మ్యాచ్‌ కఠినంగా సాగడంతో ఒక్కో బంతి ఆడుతూ ముందుకు సాగామని వివరించాడు.లంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య ఛేదనలో దీపక్‌ చాహర్‌ (69*; 82 బంతుల్లో 7×4, 1×6) అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని