Updated : 23 Jul 2021 13:15 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. China Taishan Reactor: చైనా తీరు ‘అణు’మానాస్పదం..!

గుయాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని తైషాన్‌ అణు విద్యుత్తు కర్మాగారం నిర్వహణలో చైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తోంది. రేడియేషన్‌ లీకైనట్లు తేలినా ఇప్పటికీ ఆ ప్లాంట్‌ను కొనసాగిస్తోంది. అప్పట్లో ఇదేం తీవ్రమైంది కాదని చైనా అధికారులు కొట్టిపారేశారు. కానీ, వారు వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చెప్పలేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అణువిద్యుత్తు కర్మాగారానికి ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రామాటోమ్‌ సహభాగస్వామి. ఎలక్ట్రిసిటీ డె ఫ్రాన్స్‌ దీని మాతృ సంస్థ.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Priyamani: ముస్తఫా నేనూ అన్యోన్యంగా ఉన్నాం..

వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌తో తన దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతోందని నటి ప్రియమణి అన్నారు. ముస్తఫాకు తనంటే ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు. ప్రియమణి-ముస్తఫారాజ్‌ల వివాహం చట్టపరంగా చెల్లదంటూ ఆయన మొదటిభార్య ఆయేషా బుధవారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియమణి స్పందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Needa Review: నయనతార-నీడ (రివ్యూ)

3. Delta Variant: రెండు డోసులతోనే డెల్టా నుంచి రక్షణ.. ఫ్రాన్స్‌ పరిశోధనలో వెల్లడి

డెల్టా రకం కరోనా వేరియంట్‌.. యాంటీబాడీలకు ఒకింత తక్కువగా స్పందిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకే డోసు టీకాతో పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. రెండు డోసులతో చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉంటుందన్నారు. ఆల్ఫా రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ 50 శాతం ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. కరోనాలో మొదట వెలుగు చూసిన రకంతో పోలిస్తే.. ఆల్ఫా రకం 50 శాతం వేగంగా సంక్రమిస్తున్నట్లు వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.  Zomato Listing: తొలిరోజే దూసుకుపోతున్న జొమాటో షేర్లు!

నేడు తొలిసారి స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జొమాటో లిమిటెడ్‌ షేర్లు అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. షేరు ధర బీఎస్‌ఈలో రూ.115 వద్ద ప్రారంభమైంది. ఐపీఓ ధర రూ.76తో పోలిస్తే 51.32 శాతం ప్రీమియంతో నమోదైంది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈలో 53 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద లిస్టయ్యింది. ప్రారంభంలోనే బీఎస్‌ఈలో 42 లక్షల షేర్లు చేతులు మారడం విశేషం. ఇక ఎన్‌ఎస్‌ఈలో 19.41 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఉదయం 10:17 గంటల సమయంలో బీఎస్‌ఈలో జొమాటో షేరు ధర 72 శాతం ఎగబాకి 131 వద్ద ట్రేడవుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Jammu and Kashmir: సరిహద్దుల్లో డ్రోన్‌ కూల్చివేత.. 5కిలోల పేలుడు పదార్థాలు లభ్యం

జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సంచారం మరోసారి కలకలం రేపింది. భారత సరిహద్దుకు సమీపంలో ఓ డ్రోన్‌ను గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కనచక్‌ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం రాత్రి ఓ డ్రోన్‌ సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యాంటీ-డ్రోన్‌ స్ట్రాటజీ ద్వారా దానిపై కాల్పులు జరిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* TS News: భార్య, కుమార్తెను గొడ్డలితో నరికి చంపేశాడు

6. Rahul Gandhi: నా ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేశారు.. ఇది రాజద్రోహమే

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా.. దేశీయ వ్యక్తులు, సంస్థలపై ‘పెగాసస్‌’ స్పైవేర్‌తో నిఘా పెట్టారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఇది పూర్తిగా రాజద్రోహమేనని కేంద్రాన్ని దుయ్యబట్టారు. పెగాసస్‌ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తన ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేశారని తెలిపారు. దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆడ వేషంలో విమానం ఎక్కి.. అధికారులకు దొరికిపోయి..

కరోనా సోకినవారు ప్రయాణాలు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఓ వ్యక్తి విమానం ఎక్కడానికి అతి తెలివి ప్రదర్శించాడు. తన భార్యలా వేషం మార్చుకుని విమానాశ్రయ అధికారులను బురిడీ కొట్టించి విమానం ఎక్కాడు. అది టేకాఫ్‌ కూడా అయింది. ఇక గమ్యస్థానానికి చేరుకోబోతున్నానన్న ఆనందంలో అతడు చేసిన ఓ తప్పిదంతో ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. అధికారులకు దొరికిపోయి జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona Update: హమ్మయ్య.. 35వేలకు కొత్తకేసులు

8. Telecom AGR: టెలికం సంస్థలకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. బకాయిలు మొత్తం చెల్లించాల్సిందే!

గ్రామంలో జీన్స్‌ వేసుకుని తిరుగుతోందన్న కారణంతో.. 17 ఏళ్ల బాలికను ఆమె తాత, ఇద్దరు మామలు కొట్టి చంపిన దారుణ ఉదంతమిది. ఉత్తర్‌ప్రదేశ్‌ దేవరియా జిల్లాలో ఈనెల 19న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహువాదీహ్‌ ప్రాంతంలోని గ్రామానికి చెందిన బాలిక.. కొన్నాళ్లుగా పంజాబ్‌లోని లుథియానాలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమె తండ్రి అక్కడే ఉద్యోగం చేసేవారు. ఆయన మృతి అనంతరం ఇటీవల తల్లితో కలిసి సొంత గ్రామానికి తిరిగొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Tokyo Olympics: విలువిద్యలో అతాను  35, ప్రవీణ్‌ 31, తరుణ్‌ 37

టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల వ్యక్తిగత విలువిద్య పోటీల్లో భారత క్రీడాకారులు మోస్తరు ప్రదర్శన చేశారు. 72 బాణాల సీడింగ్‌ పోటీల్లో ప్రవీణ్‌ జాదవ్‌ 31, అతాను దాస్‌ 35, తరుణ్‌దీప్‌ రాయ్‌ 37 స్థానాల్లో నిలిచారు. తొలి అర్ధభాగంలో గట్టిపోటీనిచ్చిన అతాను దాస్‌ ఆఖరికి 653 పాయింట్లు మాత్రమే సాధించాడు. 10 పాయింట్లకు 24, లక్ష్యానికి (ఎక్స్‌) 7 సార్లు మాత్రమే గురిపెట్టాడు. ప్రతి సెషన్లో తొలి మూడు బాణాలను బాగానే సంధించిన అతడు మిగిలిన వాటిద్వారా ఎక్కువ పాయింట్లు రాబట్టలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tokyo Olympics: సీడింగ్‌ రౌండ్లో దీపిక తడబాటు.. ఆమె ప్రత్యర్థి ఒలింపిక్స్‌ రికార్డు

10. Motkupalli Narsimhulu Resign: భాజపాకు మోత్కుపల్లి రాజీనామా

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భాజపాకు రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు చెప్పారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భాజపా కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగానూ అవకాశం ఇవ్వలేదని ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని