Updated : 15 Aug 2021 13:24 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Afghanistan: కాబుల్‌ సమీపంలో తాలిబన్లు.. ఏ క్షణమైనా దేశ రాజధానిలోకి!

అఫ్గానిస్థాన్‌ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబుల్‌కు సమీపంలో ఉన్న మరో నగరం జలలాబాద్‌ను సైతం ఆక్రమించారు. వేకువజామున ప్రజలు నిద్ర లేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్‌ జెండాలు పాతుకుపోయాయి. ప్రస్తుతం వారు కాబుల్‌కు అత్యంత సమీపంలో ఉన్నారు. జలాలబాద్‌ ఆక్రమణతో కాబుల్‌ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. CM KCR: రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ: కేసీఆర్‌

స్వాతంత్ర్య పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. 75వ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. India-Pakistan Division: ఐదు వారాల్లో...అడ్డంగా గీసేశారు!
భారత, పాకిస్థాన్‌లుగా దేశం విడిపోయింది సరే! ఇంతకూ ఈ రెంటినీ విడగొట్టిందెవరు? ఏ భాగం ఎవరికన్నది ఎవరు నిర్ణయించారు? ఎలా నిర్ణయించారు? ప్రపంచ చరిత్రలో... కోట్ల మందిని నిరాశ్రయుల్ని చేసి... వలసబాట పట్టించి... లక్షల మంది ధనమానప్రాణాలను హరించిన అత్యంత దారుణమైన విభజన రేఖ గీసింది సర్‌ సైరిల్‌ రాడ్‌క్లిఫ్‌! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Vinesh Phogat: ప్రపంచ నంబర్‌ వన్‌కు ఏమైంది..!

మనస్సు అత్యంత శక్తిమంతమైంది.. ఓటమి అంచున ఉన్నా గెలిపించగలదు.. విజయం ముంగిట ఉన్నా ఓడించగలదు.. ‘అథ్లెట్లకు ప్రతి రోజు చాలా కీలకమైనదే.. బరిలోకి దిగే సమయానికి ఎలా ఉన్నాం.. శరీరం, మనస్సు ఎంత సహకరిస్తున్నాయన్న దానిపైనే ఆ రోజు విజయం ఆధారపడి ఉంటుంది’.. ఈ మాటలు అన్నది ఎవరోకాదు.. ఒలింపిక్స్‌ ట్రాక్ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Neeraj chopra: ఇది కొత్త అనుభూతి :నీరజ్‌ చోప్రా

5. CM Jagan: 26 నెలలుగా ప్రజారంజక పాలన అందిస్తున్నాం: జగన్‌

హక్కులు అందరికీ సమానంగా ఉండాలని.. హక్కులు, వాటి అమలు మధ్య తేడాలను రూపు మాపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనాన్ని ఆయన స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలను సీఎం జగన్‌ పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రజాజీవనంలో ప్రభుత్వ అనవసర జోక్యం తగ్గాలి: మోదీ

వలస పాలన నుంచి విముక్తి పొంది 75వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు కరోనా నిబంధనలు పాటిస్తూనే.. ఈ అమృత ఘడియల్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తున్న ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. India Corona : 36 వేల కేసులు.. 38 వేల రికవరీలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కేసులు వెలుగు చూడగా.. మరణాల సంఖ్య 500లోపే నమోదైంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో 493 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Pawankalyan: యాహూ.. పవన్‌కల్యాణ్ - రానా మూవీ టైటిల్‌ ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌-రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటోన్న సినిమా టైటిల్‌ ఖరారైంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ విషయంలో ఎన్నో పేర్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటికి పుల్‌స్టాప్‌ పెడుతూ సినిమా టైటిల్‌ని చిత్రబృందం ఆదివారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 75th Independence Day: తెలుగు చిత్రాల్లో దేశభక్తి గీతాలు

9. Murder: గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

 గుంటూరు నగరం కాకాణి రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు విద్యార్థినిని కత్తితో పొడిచి చంపాడు. ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Fuel Tanker Explosion: ఇంధన ట్యాంకర్‌ పేలి 20 మంది మృతి..ఎక్కడంటే?

లెబనాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భారీ ఇంధన ట్యాంకు పేలింది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోయారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగినట్లు లెబనాన్‌ రెడ్‌ క్రాస్‌ వెల్లడించింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. లెబనాన్‌లో తీవ్ర ఇంధన కొరత నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని