Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Sep 2021 13:49 IST

1. Karnataka: ‘భాజపా నాకు డబ్బు ఆఫర్‌ చేసింది.. కానీ..!’

రెండేళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి భాజపా ‘ఆపరేషన్‌ కమల్‌’ కారణమంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తాజాగా అందుకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వీడేందుకు కాషాయ పార్టీ తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్‌ చేసినట్లు చెప్పారు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపడంతో నాలుక్కరుచుకున్న ఆ ఎమ్మెల్యే తానలా అనలేదంటూ మాటమార్చడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Priyanka Gandhi: యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ?

2. Lovestory: మనం ఏం చేయలేమని మాటలంటున్నరే: నాగచైతన్య

అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ వచ్చేసింది. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. సాయిపల్లవి కథానాయిక. మరో కొన్నిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం ఉదయం ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Ganesh nimajjanam : మినహాయింపులు ఇవ్వకపోతే హైదరాబాద్‌ స్తంభిస్తుంది

గణేశ్‌ నిమజ్జనంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని కోరారు. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని.. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Uttej: నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం

 ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నవదీప్‌

5. Hyderabad News: మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతం

నగరంలోని మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక(13నెలలు) ఘటన విషాదాంతమైంది. ఇంటి సమీపంలోని నీటి గుంతలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిన్న ఉదయం పనులకు వెళ్తూ తల్లిదండ్రులు చిన్నారిని పక్కింట్లో వదిలి వెళ్లారు. బాలికను చూసుకోమని వారికి చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనులకు వెళ్లి వచ్చే సరికి బాలిక కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. India Corona: మరోసారి తగ్గిన కేసులు..200కు దిగొచ్చిన మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 12,08,247 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 27,254 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 4.6 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో మరణాల సంఖ్య మరోసారి 200కు దిగొచ్చింది. నిన్న 219 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.32 కోట్ల మంది వైరస్‌ బారిన పడగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఫొటోగ్యాలరీ కోసం 👆 క్లిక్‌ చేయండి

7. Top-Up Loan: టాప్‌-అప్‌ లోన్‌ ఎప్పుడు తీసుకోవాలి?

ఆర్థిక అత్యవసర సమయాల్లో మన ముందున్న కొన్ని మార్గాల్లో టాప్‌-అప్‌ లోన్‌ ఒకటి. ఇప్పటికే ఉన్న గృహ రుణంపై మరికొంత మొత్తాన్ని తీసుకుంటే దాన్నే ‘టాప్‌-అప్‌ రుణం’ అంటారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు ఇటువంటి రుణాన్ని అందిస్తుంటాయి. అయితే, ఇది ఎప్పుడు తీసుకోవాలి? అర్హతలేంటి వంటి విషయాల్ని పరిశీలిద్దాం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సైదాబాద్‌ ఘటనపై కేసీఆర్‌, కేటీఆర్‌ స్పందించకపోవడం దారుణం : సీతక్క

సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటుచేసుకున్న చిన్నారిపై అఘాయిత్యం, హత్య ఘటనపై ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని  కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఇప్పటి వరకూ ఈ ఘటనపై  స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. సైదాబాద్‌లో బాలిక కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Taliban: ఇంద్రభవనంలో తాలిబన్లు.. అధీనంలోకి అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు దోస్తమ్‌ నివాసం!

విశాలమైన గదులు.. సుతిమెత్తని పరుపులు.. ఇంట్లోనే ఈతకొలను.. వ్యాయామశాల, విదేశీ మద్యం సీసాలతో నిండిన బార్‌.. వీటన్నింటితో కూడిన ఇంద్రభవనం లాంటి ఓ ఇల్లు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల చేతికి చిక్కింది. ఆధునిక సదుపాయాలతో ఉన్న ఆ నివాసంలో ఇప్పుడు దాదాపు 150 మంది ముఠా సభ్యులు ఉంటున్నారు. సర్వాంగ సుందరంగా ఉన్న ఇంటిని చూసి అచ్చెరువొందుతున్నారు. ఇంతకీ ఆ నివాసం ఎవరిదో తెలుసా..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. AP Politics: తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయి: అచ్చెన్నాయుడు

ఏపీలో వైకాపా రెండేళ్ల పాలనలో తెదేపా శ్రేణులపై నమోదు చేసిన తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కొందరు పోలీసుల వ్యవహారశైలి శృతి మించుతోందన్నారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు తెదేపా కార్యకర్త అంజిపై కడప జిల్లా చిన్నమండెం పోలీసులు అక్రమ కేసులు పెట్టడంతో పాటు కొట్టి హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Nara Lokesh: ఏపీ.. ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారిపోయింది: లోకేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని