
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
1. KTR Vs Revanth: ట్వీట్ వార్.. రేవంత్ వర్సెస్ కేటీఆర్!
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఒకరు ట్వీట్ చేస్తే దానికి ప్రతిగా మరొకరు కౌంటర్ ఇస్తున్నారు. ఆ ఇద్దరి ట్వీట్ల వార్‌తో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసలెందుకీ ట్వీట్ వార్?ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది? రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తాను ‘వైట్ ఛాలెంజ్’ ప్రారంభిస్తున్నానని ఇటీవల రేవంత్ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Sonusood: సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదు.. కాలమే సమాధానం చెబుతుంది..!
తనపై జరిగిన ఐటీ దాడులపై నటుడు సోనూసూద్ స్పందించారు. విషయమేదైనా సరే సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ఐటీ దాడుల అనంతరం ఆయన సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. ‘ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను’ అని సోనూ ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. IPL 2021: నిలవాలంటే గెలవాలి.. కోల్‌కతా ముందున్న సవాళ్లివే!
కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమి పాలై రెండు మ్యాచ్‌లే గెలిచింది. కరోనా ఉద్ధృతి కారణంగా టోర్నీ నిరవధిక వాయిదా పడేసమయానికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సిన పరిస్థితి. అయితే, తాము చరిత్ర తిరగరాస్తామని ఆ జట్టు చీఫ్ మెంటార్ డేవిడ్ హస్సీ తాజాగా ధీమా వ్యక్తం చేశాడు. కోల్‌కతా నిజంగా చెలరేగాలంటే వేటిపై దృష్టి సారించాలి? అధిగమించాల్సిన అడ్డంకులేంటి..? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* IPL 2021: ధోనీ భాయ్ వెన్నంటి ఉంటే.. ఎక్కువ ఆలోచించాల్సిన పనిలేదు: రుతురాజ్
4. పాన్-ఆధార్ లింకింగ్ గడువు ఇదే..
మీ పాన్-ఆధార్ లింకింగ్ పూర్తి చేసుకోవాలి. పాన్‌తో ఆధార్‌ని లింక్ చేయడానికి చివరి తేదీని ప్రభుత్వం పొడిగించింది. పాన్‌తో ఆధార్‌ని లింక్ చేయడానికి చివరి తేది ఇపుడు మార్చి 31, 2022. అంతకు ముందు, పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేది సెప్టెంబర్ 30, 2021. పాన్-ఆధార్ లింక్‌కి ఇంకా 6 నెలల పొడిగింపు ఉంది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Apple iOS 15: నేడే యాపిల్ ఐఓఎస్ 15 విడుదల.. 10 ఆసక్తికర ఫీచర్లివే
కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 13, వాచ్ 7 సిరీస్, కొత్త ఐపాడ్‌లను యాపిల్ విడుదల చేసింది. తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్‌ను ప్రకటించింది. యాపిల్ కొత్త ఓఎస్ ఐఓఎస్ 15ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి 10:30 నుంచి యూజర్స్ తమ డివైజ్‌లలో ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఐఫోన్లలో ఉన్న ఐఓఎస్ 14.8 ఓఎస్ స్థానంలో కొత్త ఐఓఎస్ 15ని డౌన్‌లోడ్ చేసుకోవాలని ఐఫోన్, ఐపాడ్ యూజర్లకి యూపిల్ సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ డ్రామా ‘లవ్‌స్టోరీ’. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వినాయకచవితికి తీసుకువస్తారని ప్రకటించినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చివరి నిమిషంలో విడుదల తేదీని మార్చారు. ఎట్టకేలకు సెప్టెంబరు 24న ‘లవ్‌స్టోరీ’ విడుదల కానుంది. ఫీల్‌గుడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహించడం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Cinema News: మంత్రి నానితో సినీ ప్రముఖుల భేటీ
7. TSRTC: ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదు: బాజిరెడ్డి
రైల్వే ఆస్తులను అమ్మినట్లు ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఛైర్మన్‌గా ఆయన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద గల బస్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఆర్టీసీని నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయి ఎండీని నియమించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Punjab Congress: సీఎం చన్నీనే.. కానీ సిద్ధూ నాయకత్వంలోనే ఎన్నికలకు..!
పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ ప్రమాణస్వీకారం వేళ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధుకు మద్దతుగా పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. రావత్ వ్యాఖ్యలను పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునిల్ జాఖర్ తప్పుబట్టారు. అసలేం జరిగిందంటే.. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. నేడు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Vaccine: ‘5 డోసులు పూర్తి.. ఆరో డోసుకు షెడ్యూల్..!’
కరోనా రెండు డోసులు తీసుకున్న ఓ వ్యక్తి తన టీకా ధ్రువపత్రం చూసుకుని అవాక్కయ్యాడు. పేరు తప్పో, అచ్చు తప్పు పడిందో అనుకునేరు.. సర్టిఫికేట్‌లో ఆయన టీకా 5 డోసులు తీసుకుని, ఆరో డోసుకు షెడ్యూల్ చేసుకున్నట్లుగా ఉంది. దీంతో కంగుతిన్న ఆయన.. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకుంది. మేరఠ్‌లోని సర్ధానా ప్రాంతానికి చెందిన రామ్‌పాల్ సింగ్.. భాజపా బూత్ స్థాయి నాయకుడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* India Corona: 30 వేల కేసులు.. 43వేల రికవరీలు
10. Evergrande: కరోనా తర్వాత.. ప్రపంచం గొంతుపై చైనా మరో కత్తి..!
కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చేందుకు చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్ బ్రదర్స్ తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే దివాలా అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ (రూ.22.5 లక్షల) డాలర్ల మేరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్(పెట్టుబడి గ్రేడ్‌లో లేని సంస్థల బాండ్లు) ఈల్డ్ ఒక్కసారిగా 14.4శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
- Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్‌ప్రీత్ హాట్ స్టిల్!
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
- IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం