Updated : 04 Oct 2021 13:09 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Pandora Papers: చరిత్రలోనే అనైతిక సంపాదన వివరాల అతిపెద్ద లీకేజీ..! 

పాండోరా పేపర్లు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సొంత దేశాన్ని కాదని పన్నుతక్కువ ఉన్న విదేశాలకు సంపద తరలించిన వారి వివరాల గుట్టు రట్టైంది. ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) విడుదల చేసిన ఈ పేపర్లను బట్టి ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో దాచిన సొమ్ము మొత్తం విలువ కనీసం 5.6 ట్రిలియన్‌ డాలర్ల నుంచి అత్యధికంగా 32 ట్రిలియన్‌ డాలర్ల వరకూ ఉంటుందని ఐసీఐజే అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిగా థియేటర్‌లో విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరగడం శుభపరిణామం. ముఖ్యంగా దసరా నవరాత్రి ఉత్సవాలు, సెలవుల నేపథ్యంలో కొత్త సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి కాస్త మంచి గుర్తింపు ఉన్న కథానాయకులు వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విడుదలై థియేటర్‌లో అలరించిన పలు చిత్రాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు సైతం ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించే ఆ చిత్రాలేంటో చూసేద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Samantha: ఇకపై నా పనులు నేనే చేసుకోవాలి: సమంత

3. Tavolara: ఇదో బుల్లిరాజ్యం.. జనాభా 11 మందే!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని వివిధ దేశాల ప్రభుత్వాల అధీనంలో ఉంటే.. మరికొన్నింటిని ధనవంతులు కొనుగోలు చేసి తమకు విడిదిగా మార్చుకుంటున్నారు. ఇంకా కొన్ని వసతులు లేక నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకునే ద్వీపం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే.. చూడటానికి ఓ ప్రైవేటు ఐలాండ్‌లా కనిపించినా.. ఇది ఓ చక్రవర్తి పరిపాలిస్తున్న ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నరాజ్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. MAA Elections: నరేశ్‌ అహంకారి.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. మండిపడ్డ ప్రకాశ్‌రాజ్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ సిగ్గుపడేలా నటుడు నరేశ్‌ ప్రవర్తిస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. నరేశ్‌ అహంకారి అని.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ ప్రచార కార్యక్రమాల్లో జోరుపెంచారు. ఇందులో భాగంగా అసోసియేషన్‌ సభ్యులతో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో విష్ణు ప్యానల్‌, నరేశ్‌లపై ఆయన మండిపడ్డారు. ఈ సారి జరగనున్న ‘మా’ ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* MAA Elections: గత ఎన్నికల్లో నేను ఓడిపోలేదు.. ఓడించారు: శ్రీకాంత్‌

5. TS News: తెలంగాణపై కేంద్రానిది చిన్నచూపు: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పర్యాటకం, ఇతర విషయాల్లో కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో నిరాదరణకు గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 160 కి.మీ. మేర గోదావరి సజీవంగా పారుతోందని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IPL 2021: సన్‌రైజర్స్‌ ఉమ్రాన్‌ను ఎందుకు ఆడించలేదో ఆశ్చర్యం కలిగించింది: నెహ్రా

ఎంతో నైపుణ్యం ఉన్న జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇంతకుముందే ఎందుకు ఆడించలేదని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. రెండో దశలో ప్రధాన పేసర్‌ టి.నటరాజన్‌ కరోనా బారిన పడటంతో ఆ స్థానాన్నీ భర్తీ చేస్తూ జట్టు యాజమాన్యం ఈ యువపేసర్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే కోల్‌కతాపై తొలి మ్యాచ్‌ ఆడిన ఉమ్రాన్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IPL 2021: 2011 తర్వాత ఇదే తొలిసారి : విరాట్‌ కోహ్లీ

7. AP News: షాపింగ్‌ మాల్‌ ఎస్కలేటర్‌లో ఇరుకున్న చిన్నారి

విశాఖలోని మద్దిలపాలెంలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లోని ఎస్కలేటర్‌లో చిన్నారి చిక్కుకుపోవడం అలజడి సృష్టించింది. ఆదివారం సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం నిన్న సాయంత్రం మాల్‌కు వచ్చింది. పై అంతస్తులోకి వెళ్లేందుకు వారు ఎస్కలేటర్‌ ఎక్కారు. మార్గంమధ్యలో చిన్నారి డ్రెస్‌ ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. భయంతో పాప గట్టిగా కేకలు వేయడంతో మాల్‌ సిబ్బంది వెంటనే ఎస్కలేటర్‌ను ఆపేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Lakhimpur Kheri Violence:: యూపీ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఆదివారం రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ కారుతోపాటు మరో వాహనం దూసుకెళ్లింది. ఈ  ఘటనలో నలుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆశిష్‌ మిశ్రాపై స్థానిక పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మరికొందరి పేర్లూ పొందుపరిచినట్లు సమాచారం. ఇరుపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అదనపు డీజీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Lakhimpur Kheri Violence: లఖింపుర్‌ ఖేరీ ఘటనలో జర్నలిస్టు మృతి

9. Aryan khan: ఆర్యన్‌తో మాట్లాడిన షారుఖ్‌..

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తన కుమారుడితో మాట్లాడారు. ఆర్యన్‌ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు నిన్న అరెస్టు చేసిన తర్వాత షారుఖ్‌ రెండు నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఆర్యన్‌ తండ్రితో మాట్లాడారని ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి. విచారణ సమయంలో ఆర్యన్‌ ఒక దశలో కన్నీటి పర్యంతమైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. నేడు ఆర్యన్‌ను మరోసారి కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Corona : 200 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 20వేలకుపైనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అంతక్రితం రోజు(22,842)తో పోల్చితే తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇక మరణాలు 200లోపే చోటుచేసుకోవడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 కేసులు నమోదయ్యాయి. నిన్న 180 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,48,997కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని