Updated : 14 Oct 2021 22:25 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. MAA Elections: ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంగా జరుగుతోన్న పోలింగ్‌లో సీనియర్‌, జూనియర్‌ నటీనటులు పాల్గొంటున్నారు. అయితే, ‘మా’ సభ్యులను ప్రలోభపెట్టేలా పోలింగ్‌ కేంద్రం లోపల కూడా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రకాశ్‌రాజ్-మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గేటు బయట మాత్రమే ప్రచారం చేసుకోవాలంటూ ఇరు ప్యానల్స్‌ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైవ్‌ బ్లాగ్‌ కోసం 👆క్లిక్‌ చేయండి

2. Secret group of US military: ఆ ట్రంపరితనమే చైనాను భయపెట్టింది..

ట్రంప్‌ మూర్ఖుడు.. వాచాలత్వం ఎక్కువ.. తిక్క నిర్ణయాలు.. ఇలా  వెక్కిరించిన వారంతా ఒక్క విషయంలో ఆయన్ని మెచ్చుకొంటారు. చైనాతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు నేర్పించారు.. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన ఓ పని తాజాగా వెలుగులోకి వచ్చింది.. ఇది తెలుసుకొన్న చైనాకు గొంతులో తడారిపోయింది..! డ్రాగన్‌ను అంత ఆందోళనకు గురిచేసిన ట్రంప్‌ నిర్ణయం ఏమిటో తెలుసా..? తైవాన్‌కు అమెరికా సైన్యాన్ని పంపించడం..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Petrol Diesel Price Hike : ఆగని పెట్రో ధరల మంట!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఆరోరోజూ పెరిగాయి. ఆదివారం (10-10-2021) లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.14, డీజిల్‌ రూ.92.82కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.110.12, రూ.100.66గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా చమురు విక్రయ సంస్థలు ఇంధన ధరలను పెంచుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Brahmotsavam: కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారు అమ్మవార్లతో కలసి దర్శనమిచ్చారు. కల్యాణ మండపంలో నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు చంద్రకోలు, దండం ధరించి కనిపించారు. వాహన సేవలో భాగంగా అర్చకులు నక్షత్ర, పూర్ణకుంభ హారతులిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

5. Crime News: కదులుతున్న రైలులో యువతిపై సామూహిక అత్యాచారం

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకోవడమే కాకుండా.. 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లఖ్‌నవూ నుంచి ముంబయికి వెళ్తున్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇగత్‌పురి, కాసారా రైల్వేస్టేషన్‌ మధ్య కొండలపై ప్రయాణించే క్రమంలో రైలు వేగం నెమ్మదించింది. ఆ సమయంలో 8 మంది దుండగులు రైలులోని డీ-2 బోగిలోకి ప్రవేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IPL 2021: అవకాశాన్ని అందిపుచ్చుకొని.. సంచలనం సృష్టించాడు

జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. కానీ, ఐపీఎల్‌ చాలా మందికి చాలా అవకాశాలిచ్చింది. సద్వినియోగం చేసుకున్నవాళ్లు హీరోలయ్యారు. రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. అలాంటి కోవలోకే వస్తాడు మన తెలుగు తేజం కేఎస్‌ భరత్‌. విశాఖపట్నంలో టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు బాల్‌బాయ్‌గా సేవలందించిన అతడు.. ఇప్పుడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో కీలక ఆటగాడిగా మారాడు. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL 2021: హ్యాట్రిక్‌ అవకాశం కోల్పోయిన ముంబయి ఇండియన్స్‌

7. Corona : 214 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. మరోసారి 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 18,166 కేసులు వెలుగులోకి వచ్చాయి. 214 రోజుల కనిష్ఠానికి ఇవి చేరాయి. నిన్న 214 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,50,589కి చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. గడిచిన 24 గంటల్లో 23,624 మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Lakhimpur Kheri: ఆశిష్‌ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ!

ఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. శనివారం దాదాపు 12 గంటల విచారణ అనంతరం రాత్రి ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) కోర్టులకు సెలవు కావడంతో రాత్రే జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. TS News: గద్వాల ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. రూ.5లక్షల చొప్పున పరిహారం

గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు చనిపోవడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. మృతులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని సీఎం ఆదేశించారు. నిన్న కురిసిన వర్షానికి ఇంట్లో నిద్రిస్తున్న ఏడుగురిపై గోడ కూలడంతో ఐదుగురు మృతిచెందడంతో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

High Alert: దేశ రాజధానికి ఉగ్రముప్పు.. అప్రమత్తమైన పోలీసులు!

10. SS Rajamouli: ఆ ప్రశ్న జక్కన్న జీవితాన్ని మార్చింది!

కెరీర్‌లో ఒకటో, రెండో ఇండస్ట్రీ హిట్లుంటే టాప్‌ డైరెక్టర్‌ అంటారు. తీసినవన్నీ బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లైతే ఆయన్నే జక్కన్న అని పిలుస్తారు.  ‘స్టూడెంట్‌ నెం.1’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన ఎస్‌ఎస్‌ రాజమౌళి.. ‘సింహాద్రి’, ‘మగధీర’ మొదలుకొని ‘బాహుబలి: ది బిగినింగ్’‌, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని సంతకంగా సగర్వంగా నిలబడ్డారు. అక్టోబరు 10న ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా కథలరాయుడి నుంచి కలెక్షన్ల రారాజు దాకా జక్కన్న సాగించిన ప్రయాణంపై ఓ కథనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని