Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 06 Sep 2022 14:53 IST

1.నన్ను అసెంబ్లీలో చూడొద్దని సీఎం పంతం పట్టినట్లున్నారు: ఈటల

హుజూరాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని.. రూ.వందలకోట్లు పంపిణీ చేశారని ఈటల ఆరోపించారు.

ఉపఎన్నికల లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

2.ఎయిడెడ్‌ పాఠశాలలపై జగన్‌ది అనాలోచిత చర్య: తెదేపా

విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఎయిడెడ్‌ పాఠశాలలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి, సీనియర్‌ నేత పల్లా శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ తదితరులో కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడారు.

3.తెరాస నేత కౌశిక్‌రెడ్డికి చేదు అనుభవం.. స్థానికేతరుడంటూ అడ్డగింత

హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కాగా ఆ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఘన్ముక్ల పోలింగ్‌ కేంద్రం వద్దకు రాగా.. స్థానికేతరులకు ఇక్కడ ఏం పని అని అంటూ భాజపా శ్రేణులు నిలదీశారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.

4.జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్‌

బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్‌ లభించినప్పటికీ.. విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు.

5.రెండోరోజూ కొత్త కేసులే ఎక్కువ..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. వరుసగా రెండోరోజూ 14 వేల మందికి కరోనా సోకింది. ఎప్పటిలాగే కేరళ మృతుల సంఖ్యను సవరించింది. దాంతో 500కిపైగా మరణాలు నమోదయ్యాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను వెలువరించింది.

6. జిమ్‌లో గుండెపోటుకి కారణాలివే కావొచ్చు.. వైద్యులేమంటున్నారంటే?

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ (46) హఠాన్మరణం చెందడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇంట్లోనే జిమ్‌ చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మరణించడం పట్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అనేకమంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

2006లోనూ ఇలాగే..!

7. ఫేస్‌బుక్‌ ‘మెటా’గా ఎందుకు మారింది..?

మనం సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే భూమి, ఆకాశం ఒక చోట ఏకమైనట్లు  ఉంటుంది.. అది కేవలం మన కళ్లు చేసే మాయే.. మెటావర్స్ కూడా అటువంటి సాంకేతికతే. ఫేస్‌బుక్‌ తన మాతృ సంస్థ పేరును కొత్తగా ‘మెటా’గా మార్చింది. ఇదే భవిష్యత్తని ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. మెటా-వర్స్‌ అనే పదాలను కలిపి దీనిని సృష్టించారు.

8.చిన్నారులకు టీకా.. అమెరికా కీలక నిర్ణయం

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు టీకాలు అందించేందుకు ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపింది. అక్కడి అత్యున్నత స్థాయి నిపుణుల బృందం ఇచ్చిన అనుమతి మేరకు ఈ ప్రకటన వెలువడింది. టీకా పొందడం వల్ల దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఆ బృందం స్పష్టం చేసింది.

9.టూ-వీలర్‌ లోన్‌ ఎంత కాలపరిమితితో తీసుకోవాలి?

కొవిడ్‌-19 మూలంగా ప్రజారవాణా వసతులను వినియోగించుకోవడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు బస్సులు, ఆటోల్లో ప్రయాణించిన మధ్యతరగతి ప్రజలు సొంత వాహనాలు కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలకు డిమాండ్‌ పెరిగింది.

10.టీ20ల్లో కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్‌

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి సంబంధించిన ఓ రికార్డును బద్దలుకొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో తలపడిన సందర్భంగా పాకిస్థాన్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్‌-2లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందిన ఆ జట్టు సెమీస్‌కు మరింత చేరువైంది.

అయ్యో రసెల్‌.. ఇలా ఔటయ్యావేంటి?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని