Updated : 01/11/2021 13:12 IST

Top 10 News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ పురస్కారాలు: జగన్‌
వివిధ రంగాల్లో సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డుల తరహాలో రాష్ట్రంలోనూ అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలోనూ అవార్డులు ఇస్తే బాగుంటుందని పలు సూచనలు అందాయని చెప్పారు. అన్నదాతలు, విద్యార్థులు, ప్రతి పేదవాడి కోసం దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి పనిచేశారన్నారు.

2.అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’ ప్రారంభం

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు తలపెట్టిన ‘మహా పాదయాత్ర’ ప్రారంభమైంది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో ప్రారంభించిన ఈ యాత్రకు తుళ్లూరులో శ్రీకారం చుట్టారు. ఇది తిరుపతి వరకు కొనసాగనుంది.

3.బండ బాదుడు.. రూ.2000 దాటిన వాణిజ్య సిలిండర్‌ ధర

దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు ఒకటో తేదీ షాకిచ్చాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరోసారి పెంచాయి. వాణిజ్య సిలిండర్‌పై రూ. 266 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2000 దాటడం గమనార్హం. అయితే ఇళ్లల్లో ఉపయోగించే డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను పెంచకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది.

4.వేసింది 17కోట్లు.. మిగిలింది 15కోట్ల డోసులు.. 

ఓ వైపు పండగల పేరుతో నిబంధనలు గాలికొదిలేస్తూ రద్దీగా తిరిగేస్తున్న జనం.. మరోవైపు నామమాత్రంగా సాగుతోన్న టీకా పంపిణీ.. ఇవన్నీ చూస్తుంటే కరోనా మూడో దశను మళ్లీ ఆహ్వానిస్తున్నామా అన్నట్లు ఉన్నాయి దేశంలో తాజా పరిస్థితులు. మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోనేలేదు. ఇప్పటికే చాలా దేశాలు బూస్టర్‌ డోసును మొదలుపెట్టాయి.

5.మేం తెగించి ఆడలేకపోయాం : విరాట్‌ కోహ్లీ

న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంపై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా బ్యాట్‌ ఝుళిపించలేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో, ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రెండు మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడమే ప్రతి ఒక్కర్నీ కలచివేసింది.

6.పశ్చిమాసియా మీదుగా అమెరికా బాంబర్‌ చక్కర్లు
పశ్చిమాసియా సముద్రతీరంలోని కీలకమైన రవాణా మార్గాల మీదుగా అమెరికాకు చెందిన బీ-1బీ లాన్సర్‌ బాంబర్‌ వెళ్లినట్లు స్వయంగా అమెరికా వైమానిక దళం ప్రకటించింది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల మీదుగా అగ్రరాజ్య బాంబర్‌ దూసుకెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీ-1బీ బాంబర్‌ను పంపించి మిత్రదేశాలకు బైడెన్‌ భరోసా కల్పిస్తున్నారని అమెరికా నావికాదళ సెంట్రల్‌ కమాండ్‌ ట్వీట్‌ చేసింది.

7.ఎఫ్‌ఏటీఎఫ్‌ కొరడా.. పాక్‌, టర్కీ కుతకుత..

అక్టోబర్‌లో ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్‌) కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే ఆ సంస్థ గ్రేలిస్టులో పాక్‌  కొనసాగుతుండగా.. కొత్తగా టర్కీని కూడా దానిలో చేర్చింది. దీంతో టర్కీ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయే పరిస్థితి నెలకొంది. అసలు ఈ ఆర్థిక చర్యల కార్యదళం అంటే ఏమిటీ..

8.దీపావళి ఆఫర్‌.. ఐఫోన్‌ 13పై రూ.24,000 తగ్గింపు!

యాపిల్‌ ఐఫోన్‌ (Apple iPhone).. ఈపేరు వింటే చాలు.. చాలా మంది బుర్రల్లో ఒక్కటే ఆలోచన. మనం ఎప్పుడు కొంటామా? అని. ఎందుకంటే.. సాధారణంగానే ఐఫోన్‌ ధరలు ఆకాశాన్నంటుతాయి. అలా అని అందరూ కొనలేరని కాదు. చాలా మంది ఎవరి ఖర్చులకు తగ్గట్లుగా వారు ప్రణాళికలు వేసుకొని.. ధరలు కొంచెం తగ్గిన తర్వాత కొందాములే అనుకుంటుంటారు.

9.ఈ రోజు కరోనా కేసులు ఎన్నంటే..?
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొద్దికాలంగా స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు 20 వేల దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 8,81,379 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,514 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే 2.4శాతం మేర కేసులు తగ్గాయి. అలాగే మార్చి ప్రారంభం నాటి స్థాయికి క్షీణించాయి. నిన్న 12,718 మంది కోలుకున్నారు. 251 మంది మృతి చెందారు.

10.ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌.. మాంచి కిక్కిచ్చిన జక్కన్న

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తోన్న ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా ఓ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది.

దీపావళికి థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని