Updated : 04 Nov 2021 13:13 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Modi: ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా: మోదీ

ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని..  వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను ప్రధానిగా రాలేదని.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని సైనికులను ఉద్దేశించి అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: ఒంగోలులో ‘నరకాసుర వధ’.. భారీగా హాజరైన ప్రజలు

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వయో బేధం లేకుండా అందరూ ఆనందంగా పాల్గొంటున్నారు. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి సందర్భంగా పలుచోట్ల ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఉన్న చెన్నకేశవ ఆలయం వద్ద బుధవారం రాత్రి నుంచి వేడుకలు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: ఏపీలోనూ వ్యాట్‌ తగ్గించాలి: సోము వీర్రాజు

3. AP News: నాన్న 12 ఎకరాలు పంచారు.. కుమారులు 120కి పెంచారు!

ఒక్కొక్కరికీ నాలుగు చొప్పున నాన్న పంచిన 12 ఎకరాల్లో ముగ్గురన్నదమ్ములూ ఉమ్మడిగా వ్యవసాయం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను, మార్కెట్‌ ఒడుదొడుకులను జయించారు. మంచి లాభాలు ఆర్జిస్తూ ఇప్పుడా పొలాన్ని 120 ఎకరాలకు పెంచారు. నాలుగే పంటలతో అధిక దిగుబడులు సాధిస్తూ... ఖర్చులు పోను ఏడాదికి రూ.2.5 కోట్లు ఆర్జిస్తున్నారు. పంటలు నష్టపోకుండా తోటి అన్నదాతలకు సలహాలిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Manchi Rojulochaie Review: రివ్యూ: మంచి రోజులు వచ్చాయి

మారుతి(Maruthi) సినిమా అన‌గానే న‌వ్వులు గ్యారెంటీ అనే ఓ భ‌రోసా. కామెడీ విష‌యంలో ఆయ‌న‌కంటూ ఓ బ్రాండ్ ఉంది. అగ్ర తార‌ల‌తో కూడా సినిమాలు తీసి న‌వ్వించారు. వీలు చిక్కిన‌ప్పుడు చిన్న సినిమాలూ చేస్తుంటారు.  ఒక ప‌క్క గోపీచంద్‌తో ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’ చేస్తూనే క‌రోనాతో వ‌చ్చిన విరామంలో ఆయ‌న ఓ చిన్న సినిమా చేశారు. అదే... ‘మంచి రోజులు వ‌చ్చాయి’(Manchi Rojulochaie). దీపావళి పండ‌గ సంద‌ర్భంగా...  మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Sapthagiri: సప్తగిరిలో మరో కోణం.. ఉత్కంఠగా ‘ఎయిట్‌’ టీజర్‌

5. Stock Market Tips :టిప్పులతో ముప్పే!

‘మీరు స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా? మంచి టిప్‌లు (సూచనలు) ఇస్తాం. నెలకు కనీసం 2-3 షేర్లు సిఫారసు చేస్తాం. వాటితో మీరు లక్షలు ఆర్జించవచ్చు.. ఫలానా కంపెనీ షేర్లు కొంటే తెల్లారేసరికి కోటీశ్వరులైపోవచ్చు’ అంటూ చిన్న ఇన్వెస్టర్లకు కొన్ని సంస్థల నుంచి కాల్స్‌ వస్తుంటాయి. ఇలాంటివి నమ్మి పెట్టుబడి పెడితే నిలువునా మునిగిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడులు పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షేర్లు కొనేముందు ఏయే అంశాలు పరిశీలించాలి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. India Corona: 10 లక్షల పరీక్షలకు కరోనా పాజిటివ్‌ కేసులు ఎన్నంటే..?

దేశంలో తాజాగా కరోనా కేసులు పెరిగాయి. 10,67,914 మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తే..12,885 మందికి పాజిటివ్‌గా తేలింది. గత కొద్దికాలంగా కేసుల్లో ఈ హెచ్చుతగ్గులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 461 మరణాలు నమోదయ్యాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 3.43 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 3.37 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 15,054 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Anemia: వెలుగులోకి రక్తహీనత రహస్యాలు

7. TS News: ఫాంహౌస్‌లో పేకాట.. వాట్సాప్‌లో గుత్తా సుమన్‌ ఇన్విటేషన్‌!

నగర శివారు మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసులో నార్సింగి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులతో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వాట్సాప్‌ సందేశాలతో పేకాట శిబిరాలకు వారిని సుమన్‌ ఆహ్వానించినట్లు తెలిసింది. ఇది వరకు గోవా, శ్రీలంకలో క్యాసినోలు నిర్వహించిన సుమన్‌.. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Mohan babu: చిరంజీవి గురించి బాలకృష్ణ షోలో మోహన్‌బాబు ఏమన్నారంటే?

చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడని సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈ షో ప్రసారమవుతోంది. దీపావళి సందర్భంగా బాలకృష్ణ తొలి ఇంటర్వ్యూ ను మోహన్‌బాబుతో చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు మోహన్‌బాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంతేకాదు, మోహన్‌బాబు కూడా బాలకృష్ణను ఎదురు ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Cinema news: న్యూ మూవీ అప్‌డేట్స్‌ తారాజువ్వలు.. చిచ్చుబుడ్లు.. లక్ష్మీ బాంబులు ఇవే!

9. Yogi Adityanath: అయోధ్య మందిర నిర్మాణాన్ని ఆపే అధికారం ఎవరికీ లేదు: యోగి

అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2023నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. బుధవారం రామ్‌ కథ పార్క్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో యోగి పాల్గొని మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఖబరిస్థాన్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Rahul Dravid: మైదానంలో బౌలర్లకు గోడలా.. భారత్‌ విజయాలకు నీడలా..!

వివిధ జట్లకు కోచ్‌గా ద్రవిడ్‌ ఇప్పటికే సత్తాచాటాడు. 2014 నుంచి రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అండర్‌-19, భారత్‌- ఎ జట్లకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న అతను.. యువ ఆటగాళ్లను సానబెట్టాడు. తన శిక్షణలో 2016 అండర్‌-19 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌.. 2018లో కప్పు అందుకుంది. ఆ సమయంలోనే సీనియర్‌ జట్టు కోచ్‌గా వ్యవహరించాలని బీసీసీఐ కోరినా.. యువ ఆటగాళ్ల కోసం సున్నితంగా తిరస్కరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IND vs AFG: రోహిత్‌, రాహుల్‌, హార్దిక్‌, పంత్‌ దంచికొట్టుడు చూస్తారా?


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని