Updated : 05 Nov 2021 13:08 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Modi: కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

దేవభూమి ఉత్తరాఖండ్‌లో పవిత్ర ఛార్‌దామ్‌ యాత్రల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది గురువు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఉదయం దేహ్రాదూన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్(రిటైర్డ్) గుర్మీత్ సింగ్‌, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ ధామి సాదర స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Virat Kohli: కొంచెం తీపి... ఎక్కువ చేదు.. ఇదీ విరాట్‌ ఇయర్‌ రివ్యూ

ఆధునిక క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌.. నిలకడకు మరోపేరు.. కొండంత లక్ష్యాన్నైనా సునాయసంగా కరిగించే ఛేదన రారాజు... ఫీల్డింగ్‌లో చిరుత.. ఫిట్‌నెస్‌లో మేటి. ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ గురించి చెప్పమంటే ఎవరన్నా ఈ మాటలే చెబుతారు. గతేడాది కాలంలో విరాట్‌ ఇలానే ఉన్నాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు అతడి పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే చెబుతూ... ఈ ఏడాది అతడి ప్రదర్శన ఎలా సాగిందో రివైండ్‌ చేసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL : యే దోస్తీ.. హమ్‌ నహీ తోడేంగే!

3. Farm House Case: గుత్తా సుమన్‌ వాట్సప్‌ చాటింగ్‌పై పోలీసుల ఆరా..

మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ కస్టడీ విచారణ ముగిసింది. దీంతో అతడిని ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మరోవైపు కస్టడీలో భాగంగా నార్సింగి పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సుమన్‌ ఫోన్‌లోని వాట్సప్‌ చాటింగ్‌ను పరిశీలించి దానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఎక్కడెక్కడ క్యాసినోలు నిర్వహించారని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Amaravati Padayatra: ఐదో రోజుకు చేరిన అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ‘మహా పాదయాత్ర’ ఐదో రోజుకు చేరుకుంది. ఐదోరోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైంది. మార్గంమధ్యలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. తమ భవిష్యత్తు బాగుండాలంటే అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగాలని ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Acharya: సిద్ధ.. నీలాంబరిల ప్రేమగీతిక చూశారా?

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా దీపావళికి రెండో గీతం విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Useful Websites: ఈ వెబ్‌సైట్లు చూశారంటే.. ఔరా అనాల్సిందే!

తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఈ సినిమా డైలాగ్ ఇప్పుడు ఎందుకు అంటారా. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో మనకు తెలియని బోలెడు విషయాలున్నాయి. కొత్తగా ఎంత తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అలా మీకు తెలియని.. ఉపయోగకరమైన కొన్ని వెబ్‌సైట్ల గురించి చెప్పబోతున్నాం. మరి ఆ వెబ్‌సైట్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

New PC Installation: కొత్త కంప్యూటర్‌లో తప్పక ఉండాల్సినవి ఏంటి?

7. T20 World Cup: ఆటకు వీడ్కోలు పలికిన విండీస్‌ స్టార్‌ డ్వేన్‌ బ్రావో

వెస్టిండీస్ స్టార్‌​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్​ టోర్నీ అనంతరం రిటైర్‌​ కానున్నట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి అనంతరం అతడు ఫేస్​బుక్​ లైవ్​లో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. ‘‘వీడ్కోలుకు సమయం వచ్చేసింది. 18 ఏళ్లుగా విండీస్​ జట్టులో ఆడుతున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను’’ అని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. India Corona: 6 లక్షల కరోనా పరీక్షలు.. 12 వేల కేసులు

 దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 6,70,847 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,729 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు కూడా 12 వేలకు పైనే కేసులు వెలుగుచూశాయి. నిన్న 221 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది ప్రారంభంలో దేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి 3.43 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Jack Ma: ఆయనను కలవడమే జాక్‌ మా కొంపముంచిందా?

అంతా అనుకున్నట్లు సాగి ఉంటే.. అలీబాబా సహ వ్యవస్థాపకుడు, యాంట్‌ గ్రూప్‌ అధినేత జాక్‌ మా గత ఏడాది ఈ సమయానికి ఆయన జీవితంలోనే అత్యంత అద్భుతమైన క్షణాల్ని ఆస్వాదిస్తుండేవారు. 37 బిలియన్‌ డాలర్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకి సిద్ధమైన యాంట్‌ గ్రూప్‌ షేర్లు ఇప్పటికే అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో నమోదై ఉండేవి. కట్‌ చేస్తే.. ప్రస్తుతం అత్యంత నిరాడంబరంగా జాక్‌ మా ఐరోపా పర్యటన కొనసాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Nirmala Sitharaman: గంగిరెద్దుకు QR కోడ్‌.. వీడియో షేర్‌ చేసిన కేంద్రమంత్రి

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిన తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ కూడా అధికమయ్యాయి. సూపర్‌ మార్కెట్‌ నుంచి కిల్లీకొట్టు వరకు.. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నుంచి పానీపూరీ బండి వరకు ఈ మధ్య ఎక్కడ చూసినా గూగుల్‌ పే, ఫోన్‌ పే క్యూఆర్‌ కోడ్‌లే కన్పిస్తున్నాయి. నగరాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని