Updated : 16/11/2021 13:41 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. CM Jagan: జగన్‌ ఆగ్రహం.. సీఎంవో, ఐఏఎస్‌ అధికారుల పరుగులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శని, ఆదివారాల్లో తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రిపూట వచ్చేప్పుడు ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం వచ్చింది. ఈ విషయమై సీఎం స్వయంగా తన కార్యాలయం అధికారులతో మాట్లాడి, ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఫలితంగా సీఎంఓ నుంచి సచివాలయం... అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్‌కు ఆదేశాల పరంపర కొనసాగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Amaravati Padayatra: అమరావతి ఉద్యమం @700రోజులు..

2. Audit Diwas  ‘కాగ్‌’ మరింత బలపడుతోంది..!

 ‘‘అతి కొద్ది సంస్థలు మాత్రమే కాలక్రమంలో మెరుగుపడుతూ.. మరింత శక్తిమంతం అవుతాయి.. చాలా సంస్థలు మాత్రం ప్రాధాన్యం కోల్పోతాయి. కాగ్‌ మన వారసత్వం.. దానిని ప్రతి తరం గుర్తుపెట్టుకోవాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలోని కాగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తొలి ఆడిట్‌ దినోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘‘ప్రభుత్వ పనితీరును విశ్లేషించే క్రమంలో కాగ్‌ బయటి సంస్థల మాదిరిగా విశ్లేషించడం కలిసొచ్చే అంశం’’ అని మోదీ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TRS: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో పేర్లను ప్రకటించారు. శాసన మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాశ్‌, కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావులకు అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. usa-china talks: బైడెన్‌- షీ జిన్‌ పింగ్‌ భేటీ..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ మధ్య తొలిసారి వర్చువల్‌ భేటీ మొదలైంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం లభిస్తోంది. వీరి మధ్య తైవాన్‌, వాణిజ్యం, మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు బహిరంగ ఘర్షణలుగా మారకూడదని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

US Army: అమెరికా సైనిక కుటుంబాల్లో ఆకలి కేకలు 

5. Supreme Court: ఆలయాల్లో రోజువారీ కార్యకలాపాలను కోర్టులు చేపట్టవు: సుప్రీం

తిరుమల అంశంపై ఓ భక్తుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ధర్మాసనం ఇవాళ విచారణను ముగించింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని పిటిషన్‌ దాఖలైంది. విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫు న్యాయవాది.. పూజలు, కైంకర్యాలన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. లోటుపాట్లు లేకుండానే స్వామివారికి సేవలు జరుగుతున్నాయని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Joker Malware: జోకర్‌ రీఎంట్రీ.. ఈ యాప్స్‌ డిలీట్‌ చేయండి. లేదంటే..

జోకర్ మాల్వేర్‌ (Joker virus).. ఈ వైరస్‌ పేరు వింటే చాలు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఈ ప్రమాదకర వైరస్‌ 2017లో బయటపడింది. స్మార్ట్‌ ఫోన్‌లలోకి (Smart Phones) చొరబడే ఈ వైరస్‌ ఫోన్‌లలో ఉండే విలువైన సమాచారాన్ని మనకు తెలియకుండానే కాజేస్తుంది. అప్పుడప్పుడు కనిపిస్తూ మాయమవుతూ వస్తున్న ఈ వైరస్‌... మళ్లీ కలకలం రేపింది.  ఏడు ఆండ్రాయిడ్ యాప్స్‌లో (Android Apps) మళ్లీ ప్రత్యక్షమైనట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Hardik Pandya: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. రూ.5 కోట్ల వాచ్‌లపై హార్దిక్‌ స్పష్టత

టీమ్‌ఇండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య వద్ద ముంబయి ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారులు రెండు విదేశీ చేతి గడియారాలను గుర్తించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ పూర్తయ్యాక యూఏఈ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పాండ్య లగేజీని తనిఖీలు చేశారు. అతడి వద్ద ఉన్న వాచ్‌లకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2022 T20 World Cup: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి వేదికల ఖరారు

8. 7 Rules Of Money: ఆర్థిక భరోసాకు ఏడు డబ్బు సూత్రాలు..!

జీవితంలో విజయం సాధించడానికి మనకు మనమే అనేక నియమాలు పెట్టుకుంటాం. కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను పాటిస్తాం. ఎంత తినాలి? ఏ సమయంలో తినాలి? ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడు లేవాలి?.. ఇలాంటి నియమాలు మనలో క్రమశిక్షణను అలవరుస్తాయి. అలాగే డబ్బు విషయంలోనూ నిర్దిష్టమైన సూత్రాలు పాటించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎక్కడ మదుపు చేయాలి? వంటి విషయాల్లో కొన్ని నియమాలు పాటిస్తేనే ఆర్థికంగా అనుకున్న విజయం సాధిస్తాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Rajamouli: ఆ సినిమాలో చిరు అలా చేయలేకపోయారు.. అందుకే చరణ్‌తో చేయించా!

సాధారణ సన్నివేశాన్ని సైతం తన టేకింగ్‌తో భావోద్వేగంగా మలిచి ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేయడంలో సిద్ధహస్తులు దర్శక ధీరుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అందుకే ఆయన తీసే సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాదు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. ఇక ఎమోషనల్‌ సన్నివేశాలు, హీరో ఎలివేషన్‌ సీన్స్‌ తీయడంలో ఆయనను కొట్టిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ రామ్‌చరణ్‌ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: మాపై దాడులకు కేసీఆరే సూత్రధారి: బండి సంజయ్‌

‘మాపై తెరాస దాడులకు సీఎం కేసీఆర్‌ సూత్రధారి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. వానాకాలం పంట కొనాలని కోరితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. సంజయ్‌ పర్యటన సందర్భంగా నిన్న నల్గొండ, మిర్యాలగూడలలో తెరాస, భాజపా కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. బండి సంజయ్‌ కాన్వాయ్‌పైనా దాడి జరిగిన నేపథ్యంలో ఆయన సూర్యాపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

India Corona : భారీగా తగ్గిన కొత్త కేసులు.. మెరుగ్గా రికవరీ రేటు

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని