Updated : 02/12/2021 22:19 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1.ప్రగతి భవన్‌లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది: బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌ దిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే వెళ్లినట్లు ఆయన ఆరోపించారు. సొంత పనుల కోసమే దిల్లీ వెళ్లారని.. భాజపాను అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు. నగరంలో రెండో రోజు భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

2.తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరణ : కేంద్రం

తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం సేకరణ చేపడతామని వెల్లడించింది. గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం కలిసిన విషయం తెలిసిందే.

3.మంత్రి గారూ.. త్రివిక్రమ్‌కు ట్విటర్‌ ఖాతా లేదండి..!

సినిమా టిక్కెట్ల ధరల విషయంపై దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పేరుతో ఇటీవల ఓ ట్వీట్‌ నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అది త్రివిక్రమే చేశారని అభిప్రాయపడిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా త్రివిక్రమ్‌ ట్వీట్‌ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ స్పందించింది.

4.దేశంలో కొత్తగా 8,318 కేసులు..465 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 9,69,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,318 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 21 శాతం మేర తగ్గాయి. నిన్న 10,967 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. వారిలో 3.39 కోట్ల మంది వైరస్‌ను జయించారని శనివారం కేంద్రం వెల్లడించింది. 

5.ఒమిక్రాన్‌ కలవరం.. ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ

కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌, నీతిఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మన దేశంలో వ్యక్తిగత ప్రయాణాలకు సామాన్యులు ఎక్కువగా ద్విచక్రవాహనాల వైపే మొగ్గుచూపుతారు. తక్కువ ధర, ట్రాఫిక్‌లో త్వరగా వెళ్లడం, నిర్వహణ ఖర్చులు తక్కువ వంటి అంశాలే అందుకు కారణం. పైగా రద్దీ ఎక్కువగా ఉండే మన మెట్రో నగరాల్లో కార్ల కంటే టూ వీలర్లలో వెళ్తే దాదాపు సగం సమయం ఆదా అవుతోందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.

7.మోదీజీ ఆ దేశాల నుంచి విమానాలు ఆపండి: కేజ్రీవాల్‌

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆ వేరియంట్‌ భారత్‌లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. ఆయా దేశాల నుంచి తక్షణమే విమానాల రాకపోకలను నిలిపివేయాలని ట్విటర్‌ వేదికగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించారు. 

8.తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌.!

కాన్పూర్‌ వేదికగా జరగుతుతోన్న మొదటి టెస్టు మూడో రోజు తొలి సెషన్‌లో కివీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌ నైట్ బ్యాటర్‌ విల్‌ యంగ్‌ (89) ఔటయ్యాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 67వ ఓవర్ తొలి బంతికి అతడు కీపర్‌కు చిక్కి పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత బౌలర్ల నిరీక్షణకు తెరదించినట్లయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18), ఓవర్‌ నైట్ బ్యాటర్ టామ్‌ లేథమ్‌ (82)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

9.రూ.10 వేల కోట్ల ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించిన మస్క్‌!

కంపెనీలను స్థాపిస్తామంటే ఆయా ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుంటాయి. సంస్థలు సైతం వాటిని ఆనందంగా స్వీకరిస్తాయి. కొన్ని కంపెనీలైతే.. ప్రభుత్వ సాయం కోసం అర్జీ పెట్టుకుంటాయి. కానీ, ఎలాన్ మస్క్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఫ్యాక్టరీ నిర్మాణానికి సాయం చేస్తామని ప్రభుత్వమే ముందుకు వచ్చినా.. ఆయన మాత్రం దాన్ని తిరస్కరించారు.

10.పునీత్‌ మరణించే వరకూ ఆ విషయం ఎవరికీ తెలీదు: రాజమౌళి

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం తనని ఎంతగానో కలచివేసిందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. తాజాగా బెంగళూరుకు చేరుకున్న ఆయన పునీత్‌ ఇంటికి వెళ్లారు. పునీత్‌ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పునీత్‌ మరణాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని