Updated : 29/11/2021 13:06 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1.అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే సంఘీభావం

పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వైకాపాకు చెందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్రలో భాగంగా నెల్లూరు మీదుగా వెళ్తున్న రైతులు.. శాలివాహన ఫంక్షన్‌ హాల్లో బస చేశారు. ఈ క్రమంలో శ్రీధర్‌రెడ్డి అక్కడికి వెళ్లి వారిని కలిశారు. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని.. తప్పకుండా సహకరిస్తానన్నారు.

2.పార్లమెంటు సమావేశాలు.. అలా ప్రారంభమై.. ఇలా వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నినాదాలు చేశారు. దీంతో సభాపతి సభను మధ్నాహ్నానికి వాయిదా వేశారు. మరోవైపు సిట్టింగ్‌ ఎంపీ ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మృతికి సంతాపంగా రాజ్యసభను ఛైర్మన్‌ గంటపాటు వాయిదా వేశారు.

3.సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం

విపక్షాల గందరగోళాల మధ్య సోమవారం లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుపై చర్చ జరగాలని విపక్ష నేతలు డిమాండ్లు చేశారు. అయితే వారి ఆందోళనల మధ్యే ఈ రద్దు బిల్లుకు ఆమోదం దక్కింది. గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా కొన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

4.కొత్త వేరియంట్‌ వ్యాప్తి.. జపాన్‌ కీలక నిర్ణయం!

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో జపాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వచ్చే విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ దేశ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వెల్లడించారు. 

5.ఆ విషయాలపై ఇంకా స్పష్టత లేదు: డబ్ల్యూహెచ్‌ఓ

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కీలక ప్రకటన చేసింది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా? అనే విషయాలపై ‘‘ఇంకా స్పష్టంగా తెలియదు’’ అని పేర్కొంది.

ఒమిక్రాన్‌ బాధితుల్లో స్వల్ప లక్షణాలు..!

6.తొలి సెషన్‌ న్యూజిలాండ్‌దే.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన భారత్‌

ఐదోరోజు ఆట తొలి సెషన్‌లో న్యూజిలాండ్‌ ఆధిపత్యం చెలాయించింది. 4/1తో సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లాథమ్‌ (35), సోమర్‌విలే(36) నిలకడగా ఆడుతూ భారత బౌలర్లపై పైచేయి సాధించారు. ఈ సెషన్‌ మొత్తంలో టీమ్‌ఇండియా 31 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయింది.

7.ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

కరోనా తర్వాత వరుసగా సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. అయితే, ఇప్పటివరకూ పాసింజర్‌ రైలులా సాగిన సినీ ప్రయాణం డిసెంబరు నెలలోఎక్స్‌ప్రెస్‌ స్పీడ్‌లో దూసుకుపోనుంది. అందుకు ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలే కారణం. మరి డిసెంబరు మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో వస్తున్నాయి.

8.సంగారెడ్డి జిల్లాలో 10క్వింటాళ్ల గంజాయి పట్టివేత

సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి లారీలో 10 క్వింటాళ్లు తీసుకొస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయి రవాణా చేస్తున్న లారీని గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కంది గ్రామం వద్ద పోలీసులు ఆ లారీని ఆపి తనిఖీ చేయగా తుక్కు కింద గంజాయి మూటలు కనిపించాయి.

9.అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడ్డా: తాప్సీ

అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని నటి తాప్సీ అన్నారు. ‘తప్పడ్‌’, ‘హసీనా దిల్‌రుబ’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ తార. ప్రస్తుతం మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో నటిస్తున్న తాప్సీ తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

10.అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌! 

మొబైల్‌ ప్రియులను అలరించేందుకు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తుంటాయి. ఇప్పటి వరకు అదిరే ఫీచర్లతో ఎన్నో రకాల కొత్త మోడల్స్‌ విడుదలయ్యాయి. వీటిలో 5జీ, బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌, ఫ్లాగ్‌షిప్‌ అంటూ వేర్వేరు మోడల్స్‌ ఉన్నాయి. అయితే గత కొద్ది నెలలుగా  కరోనా పరిస్థితుల కారణంగా కొన్ని ఫోన్ల విడుదల చేయడం ఆలస్యమైంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని