Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Dec 2021 13:26 IST

1. US-China: ఆ నిర్ణయం విలువ రూ.1.5 కోట్ల కోట్లు!

అమెరికా స్టాక్‌ మార్కెట్లలో నమోదైన చైనా కంపెనీలకు ముప్పు తప్పేలా లేదు. యూఎస్‌ మార్కెట్ల నియంత్రణా సంస్థ ‘సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ)’ గురువారం ఓ కీలక నిబంధనకు ఆమోదం తెలిపింది. దీంతో చైనా కంపెనీల తనిఖీలకు సంబంధించిన వివరాల్ని బహిర్గతపరచడంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు ఓ రూపం సంతరించుకున్నట్లైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Modi: రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం : ప్రధాని మోదీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని మోదీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Konijeti Rosaiah: రోశయ్య పదవులకు వన్నె తెచ్చారు: సీఎం కేసీఆర్‌

3. CJI: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి: సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ

పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారాలు అవుతాయని తెలిపారు. నగరంలోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సులో సీఎం కేసీఆర్‌తో కలిసి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Bheemla Nayak: ‘భీమ్లానాయక్‌’ నుంచి ‘అడవి తల్లి మాట’.. పాట వచ్చేసింది

‘భీమ్లానాయక్‌’ పాటల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. అడవి తల్లి మాట... అంటూ సాగే ఇందులోని నాలుగో పాటని శనివారం విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. త్రివిక్రమ్‌ రచన చేస్తున్నారు. తమన్‌ స్వరకర్త. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. BCCI: టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన యథాతథం

టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనను యథాతథంగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోల్‌కతాలో నిర్వహించిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి మూడు టెస్టులు, మూడు వన్డేలు షెడ్యూల్‌ ప్రకారం ఉంటాయని స్పష్టం చేసింది. టీ20 మ్యాచ్‌లపై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Omicron: ఇప్పటికైతే ఒమిక్రాన్‌ తీవ్రమైందేమీ కాదు: సింగపూర్‌

కరోనా కొత్త వేరియంట్‌ వల్ల వచ్చే లక్షణాలు పాత వేరియంట్ల కంటే భిన్నంగా ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని సింగపూర్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉందనడానికి కూడా ఎలాంటి ప్రాతిపదిక లేదని పేర్కొంది. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రబలరూపకంగా మారుతుందా? లేదా? తెలియడానికి మరింత సమాచారం అవసరమని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రముఖులతో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య.. చిత్రాలు

రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) ఈ ఉదయం కన్నుమూశారు. రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించిన రోశయ్య.. కాంగ్రెస్‌ సీఎంల వద్ద కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప ఆర్థిక నిపుణుడిగా, రాజకీయాల్లో అజాతశత్రువుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎన్నో పదవులు నిర్వర్తించి వాటికి వన్నె తెచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News : మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

8. India Corona: కొత్త కేసులు, రికవరీలు.. 8 వేలే..!

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇద్దరిలో ఈ వేరియంట్ వెలుగుచూడగా, మరికొందరు అనుమానితులు పర్యవేక్షణలో ఉన్నారు. ఈ వేరియంట్‌పై కలవరపడాల్సిన పనిలేదని.. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే తాజా కరోనా గణాంకాలను విడుదల చేసింది.  నిన్న 12,52,596 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,603 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Living Lab: లివింగ్‌ ల్యాబ్‌.. ఓ అద్భుతం

రోజురోజుకూ వాతావరణంలో గాలి కాలుష్యం పెరిగిపోతోంది... మరి నియంత్రించేదెలా? నీటి నాణ్యతను లెక్కగట్టి ప్రజలకు సమాచారం చేరవేసేదెలా? ఇంధన వనరులను పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు అందించేదెలా? ఇటువంటి నిత్య సవాళ్లకు సమాధానం చెబుతోంది గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ట్రిపుల్‌ఐటీ)లో ఏర్పాటు చేసిన లివింగ్‌ ల్యాబ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇక చైనా నుంచి లావోస్‌కు నేరుగా రైలు

చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లోని కున్‌మింగ్‌ నుంచి లావోస్‌ రాజధాని వియంటియాన్‌కు రైలు మార్గం ప్రారంభమైంది. బీఆర్‌ఐలో ఇది తొలి సీమాంతర ప్రాజెక్టు కావడం గమనార్హం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. లావోస్‌ ప్రధాని థాంగ్లూన్‌ సిసోలిత్‌ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు విలువ 600 కోట్ల డాలర్లు. 2016లో నిర్మాణం ప్రారంభమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు