Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Jan 2022 13:15 IST

1. CM Jagan: వివాదాలు లేని ప్లాట్లను తక్కువ ధరకే అందిస్తాం: సీఎం జగన్‌

వాదాలు లేని ప్లాట్లను మార్కెట్‌ ధర కంటే తక్కువకే మధ్యతరగతి ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని చెప్పారు. ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి పేదవాడికీ ఇల్లుండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఉమ్మ‌డి గృహ రుణం మంచిదేనా ?

2. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు కరోనా

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు కరోనా సోకింది. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సమీప బంధువు రచ్నా మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్‌కు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ‘‘లతా ఆరోగ్యంగానే ఉన్నారు.  ఆమె వయస్సు దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మా గోప్యతను గౌరవించండి. ఆమె కోసం ప్రార్థించండి’ అని రచ్నా అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Changpeng Zhao: ప్రపంచ కుబేరుడైన ఓ ‘కుక్‌’ కథ ఇది!

నా మూలాలున్న ఓ కెనడా కుర్రాడు ఇంటి ఖర్చుల కోసం మెక్‌ డొనాల్డ్స్‌లో ‘కుక్‌’గా పనిచేసేవాడు. రాత్రివేళల్లో గ్యాస్‌ స్టేషన్లలో విధులు నిర్వర్తించేవాడు. కట్‌ చేస్తే.. ఆ వ్యక్తే ఇప్పుడు యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో రాజకుటుంబీకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పక్కన ఏకంగా ఓ అపార్ట్‌మెంట్‌నే సొంతం చేసుకున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో భోజనాలు, వ్యాపార మంతనాలు. అలాగని ఆయన విలాసవంతమైన జీవితమేం గడపట్లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. AP News: విషాదం.. మునేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థులూ చనిపోయారు

కృష్ణా జిల్లాలో విద్యార్థుల గల్లంతు ఘటన విషాదాంతమైంది. చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మునేరులో ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థులూ విగతజీవులుగా మారారు. ఏడో తరగతి చదువుతున్న మాగులూరి సన్నీ (12), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్‌ (12), ఆరో తరగతి విద్యార్థి మైలా రాకేష్‌ (11), తొమ్మిదో తరగతి విద్యార్థి గురజాల చరణ్‌ (14) గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం నుంచి గాలింపు కొనసాగించారు. మంగళవారం ఉదయం ఆ ఐదుగురి మృతదేహాలను గుర్తించి మునేరు నుంచి వెలికితీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. India Corona: స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా కొత్త కేసులు లక్షపైనే నమోదవుతున్నాయి. అయితే నిన్న రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 4,461కి  చేరాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ కరోనా గణాంకాలను విడుదల చేసింది. సోమవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 1,68,063 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసులు 6.4 శాతం మేర తగ్గాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. RGV: సినిమా టికెట్ల అంశం.. మరోసారి స్పందించిన ఆర్జీవీ

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘మహారాష్ట్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు’’ అని ఆర్జీవీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Virat Kohli:ధోనీ ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా..: కోహ్లీ

 టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తనకు ఓ సలహా ఇచ్చాడని, దీంతో అప్పటి నుంచి దాన్ని కచ్చితంగా పాటిస్తున్నానని ప్రస్తుత టెస్టు జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (0) భారీ షాట్‌కు ప్రయత్నించి అనవసరంగా వికెట్‌ పారేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి బ్యాటింగ్‌ తీరుపై విమర్శలొచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IND vs SA: కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తాడు: హర్భజన్‌

8. AP News: సీమకు ‘తీపి’ కబురు..!

చాక్లెట్ల తయారీలో వినియోగించే కోకో కాయలు రాయలసీమలో కూడా కాశాయి. మన రాష్ట్రంలో కోస్తా ప్రాంతంలో కొబ్బరి తోటల్లో దీన్ని అంతర పంటగా సాగు చేస్తున్నారు. నల్లరేగడి, ఎర్రనేలలు దీనికి అనుకూలం. రాయలసీమలో ఎర్రగరప నేలలు ఎక్కువగా ఉన్నందున ఎక్కడా ఇంతవరకు ఈ మొక్కలు లేవు. కడప జిల్లా రైల్వేకోడూరులోని అనంతరాజుపేట ఉద్యాన కళాశాలలో దీన్ని ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. ఇక్కడ 70 వరకు మొక్కలు నాటగా అన్నీ బాగా పెరిగి ప్రస్తుతం కాయలు కాశాయని ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రొఫెసర్‌ యువరాజు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మళ్లీ కలిసే అవకాశాలు లేనప్పుడు విడాకులు మంజూరు చేయకపోవడం దారుణం

భార్యాభర్తలు మళ్లీ ఒక్కటై కాపురం చేసే అవకాశాలు ఏమాత్రం లేనప్పుడు.. వారికి విడాకులు జారీ చేయకపోవడం దారుణమని పంజాబ్‌-హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది. విడాకుల కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను గురుగ్రామ్‌ కుటుంబ కోర్టు తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఓ జంట విడిపోయింది. వారిని తిరిగి కలిపేందుకు మధ్యవర్తిత్వం వంటి మార్గాల్లో జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2003 నుంచి వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Viral Video: పట్టాలపై కూలిన విమానం.. ఎదురుగా దూసుకొస్తున్నరైలు.. ఏం జరిగిందంటే..?

దురదృష్టం.. అదృష్టం ఒకేసారి కలిసొస్తే ఇలానే ఉంటుంది. ఓ చిన్న విమానం పోయిపోయి రైలు పట్టాలపై కుప్పకూలింది. అందులో ఇరుక్కుపోయిన పైలట్‌ను పోలీసులు ఇలా బయటకు లాక్కొచ్చారో లేదో.. క్షణాల్లో ఓ రైలు వేగంగా ఆ విమాన శకలాన్ని ఢీకొంటూ వెళ్లిపోయింది. ఏ యాక్షన్‌ సినిమాకు తీసిపోని విధంగా ఉన్న ఈ సహజ దృశ్యం మొత్తం ఓ పోలీస్‌ అధికారి బాడీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని