Updated : 19 Jan 2022 13:07 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Supreme Court: కొవిడ్‌ పరిహారం చెల్లింపుల్లో జాప్యం.. ఏపీపై సుప్రీం అసహనం

కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాలపై అత్యున్నత న్యాయస్థానం అసహనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ, బిహార్‌ ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 2గంటలకు హాజరవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. UP Election 2022: మనసు మార్చుకున్న అఖిలేశ్‌.. పోటీ ఎక్కడి నుంచంటే..?

త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ స్థానంలో నిల్చోవడం లేదని చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేశ్‌ యాదవ్(Akhilesh Yadav).. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అజంగఢ్‌లోని గోపాల్‌పూర్‌(Gopalpur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సమాజ్‌వాదీ పార్టీకి షాక్‌.. భాజపాలో చేరిన ములాయం కోడలు

3. 5G Smartphones: మీడియాటెక్ ప్రాసెసర్‌తో పాపులర్ 5జీ ఫోన్లు.. ధర, ఫీచర్లివే!

గతేడాది విడుదలైన ఫోన్లలో ఎక్కువ శాతం మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఇవి అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్లు కాకపోయినా.. పెర్ఫామెన్స్‌ పరంగా కాస్త వెనుకబడినా.. తక్కువ ధరకే 5జీ మోడెమ్‌ (5G Modem)తో కూడిన ప్రాసెసర్లను అందిస్తుండటంతో పాపులర్‌ మొబైల్‌ తయారీ కంపెనీలు వీటివైపు మొగ్గుచూపాయి. దీంతో తక్కువ ధరకే 5జీ సపోర్ట్‌తో వివిధ కంపెనీల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Dhanush Aishwarya: హుందాగా ప్రకటించినా సమంతనే ట్రోల్‌ చేశారు: నటి

కోలీవుడ్‌ నటుడు ధనుష్‌‌, ఆయన సతీమణి ఐశ్వర్య తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించి అందర్నీ షాక్‌ గురి చేసిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ మళ్లీ కలవాలని కోరుకుంటూ పలువురు నెటిజన్లు వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌.. ధనుష్-ఐశ్వర్యలతో మాట్లాడి తిరిగి వాళ్లని ఒక్కటి చేయడంటూ మలయాళీ నటి లక్ష్మి రామకృష్ణన్‌కు ట్వీట్‌ పెట్టాడు. దానిపై స్పందించిన లక్ష్మి వాళ్ల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించవద్దని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Modi: డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో మోదీ ప్రసంగానికి బ్రేకులు!

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఆన్‌లైన్‌ సదస్సులో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగానికి ఓ దశలో బ్రేకులు పడ్డ ఘటన భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ప్రధానికి ప్రసంగాన్ని అందించే టెలీప్రాంప్టర్‌లో సమస్య తలెత్తడం వల్లే అంతరాయం ఏర్పడిందని హస్తం పార్టీ ఆరోపించింది. టెలీప్రాంప్టర్‌ పనిచేయనప్పుడు మోదీ మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేసింది. ఆ ఆరోపణలను భాజపా నాయకులు తోసిపుచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Burj Khalifa: ‘ఇంకా బుర్జ్‌ ఖలీఫాపైనే ఉన్నా’.. ఇదిగో వీడియో..!

ఓ ఐదంతస్తుల భవనంపైకి ఎక్కి కిందకు చూస్తేనే కళ్లు తిరిగినట్లనిపిస్తుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa)పైకి ఎక్కడమంటే పెద్ద సాహసమే. అలాంటి క్లిష్టమైన ఫీట్‌ను ఈ మహిళ రెండు సార్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది ఆగస్టులో బుర్జ్‌ ఖలీఫాపై నిలబడి ఎమిరేట్స్ విమానయాన సంస్థకు యాడ్‌ చేసిన నికోల్‌ స్మిత్‌ లడ్విక్‌ మరోసారి ఆ ఫీట్‌ను సాధించింది. ఈ సారి కూడా అదే సంస్థకు యాడ్‌ చేసి పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. India Corona: భారీగా పెరిగిన కొత్త కేసులు.. ఎంతమందికి కరోనా సోకిందంటే..?

దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 2,82,970 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కంటే 44,889(18 శాతం మేర) కొత్త కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.13 శాతానికి పెరిగిపోయింది. ఇక, మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 441 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Jio: రూ.30,791 కోట్ల స్పెక్ట్రం బకాయిలు చెల్లించిన జియో

స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించినట్లు టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో తెలిపింది. మార్చి 2021కి ముందు జరిగిన స్పెక్ట్రం వేలానికి సంబంధించి వడ్డీతో సహా అన్ని బకాయిలను చెల్లించేసినట్లే పేర్కొంది. 2014, 2015, 2016లో జరిగిన వేలంలో జియోకు స్పెక్ట్రం కేటాయింపులు జరిగాయి. అలాగే 2021లో భారతి ఎయిర్‌టెల్‌తోనూ స్పెక్ట్రం వినియోగానికి సంబంధించి ఓ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా కంపెనీ 585.3 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రం సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Virat Kohli : మరో రికార్డుకు చేరువలో కోహ్లీ..

టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. నేటి నుంచి జరగనున్న వన్డే సిరీస్‌లో మరో 22 పరుగులు చేస్తే.. సఫారీ జట్టుపై ప్రస్తుత టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, 26 పరుగులు చేస్తే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సాధించిన పరుగుల రికార్డును అధిగమించనున్నాడు.  దక్షిణాఫ్రికాలో 29 మ్యాచులు ఆడిన గంగూలీ 1,313 పరుగులు, 36 మ్యాచులు ఆడిన ద్రావిడ్‌ 1,309 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ.. వన్డే సిరీస్‌కు రబాడ దూరం

10. Ap News: అందరి లక్ష్యం ఒకటే.. కలిసి పోరాడితేనే సాధిస్తాం: సూర్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోల వ్యవహారంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ అన్నారు. అందరి లక్ష్యం ఒకటే అయినందున కలిసి పోరాడితేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోకుండా జీవోలపై పునఃసమీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ సంఘాల పేర్లు వేరైనప్పటికీ వారంతా ఉద్యోగులేనని స్పష్టం చేశారు. అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప అధికారుల కమిటీ సిఫార్సులు కాదని చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని