Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jan 2022 13:13 IST

1. AP News: కొత్త పే స్కేళ్లతోనే జీతాలు.. మరోసారి సర్కారు ఉత్తర్వులు

ఇటీవల విడుదల చేసిన పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణతో ముందుకెళుతుండగా.. ఏపీ ప్రభుత్వం కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు చెల్లించేలా బిల్లుల తయారీకి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌, ట్రెజరీ, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులను సర్కారు ఆదేశించింది. ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్‌ను అనుసరించి బిల్లుల చెల్లించాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Virat Kohli: కోహ్లీ అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు: అక్తర్‌

అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌గా మారిన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీ విషయంలో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల్ని పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని హితవు పిలికాడు. కెప్టెన్సీ అంత సులువైన విషయం కాదని.. తీవ్ర ఒత్తిడి మధ్య బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని.. కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. India Corona: ఆగని కరోనా ఉద్ధృతి.. వరుసగా నాలుగో రోజూ 3 లక్షల పైనే!

దేశంలో కరోనా వైరస్ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. శనివారంతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 18,75,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,33,533 మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్తగా మరో 525 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Jacinda Ardern: ఒమిక్రాన్‌ ఆంక్షలు.. వివాహాన్ని రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌ ప్రధాని

4. Pakistan: పాక్‌ ముక్కుపిండి పరిహారం వసూలు చేసిన చైనా..!

పాక్‌-చైనాలు తమ బంధాన్ని ‘ఐరన్‌ బ్రదర్స్‌ బంధం’గా చెప్పుకొంటాయి. కానీ, సొమ్ము విషయానికి వస్తే మాత్రం చైనా ఎక్కడా తగ్గదు. పాక్‌లో దాసు  హైడ్రోపవర్‌ డ్యామ్‌ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించి నష్ట పరిహారాన్ని చైనా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ దాడిలో 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2021 జులై 14వ తేదీన చైనా పాకిస్థాన్‌లో దాసు హైడ్రోపవర్‌ డ్యామ్‌ నిర్మాణ పనుల వద్ద భారీ ఉగ్రదాడి జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పంజాబ్‌లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు?

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటించే విషయమై కాంగ్రెస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారు. ఆయనను సమర్థించే వారి సంఖ్యా పెరుగుతోంది. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సిద్దూ కంటే పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రి చన్నీకే మద్దతిస్తున్నారు. తనను కాకుండా మరెవరినైనా అధికారికంగా ప్రకటిస్తే ఎన్నికల ముంగిట్లో సిద్దూ ఎలా ప్రవర్తిస్తారోననే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘పతంజలి’ నాసికా ఔషధం

బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌మైకోసిస్‌) వ్యాధిపై పనిచేసే సరికొత్త ఆయుర్వేదిక్‌ నాసికా ఔషధాన్ని (నేసల్‌ డ్రాప్‌)ను అభివృద్ధి చేసినట్లు పతంజలి సంస్థ వెల్లడించింది. ‘అనూ తైల’ పేరిట పతంజలి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల బృందం దీన్ని కనుగొన్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు గాను అధునాతన సాంకేతిక విధానాలతో లోతైన పరిశోధన జరిగినట్లు పేర్కొంది. పరిశోధన వివరాలు ‘ది జర్నల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ మైక్రోబయాలజీ’లో ప్రచురితమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Monkey Fever: కర్ణాటకలో మంకీ జ్వరం కలకలం

7. Russia: వేడి పెంచిన రష్యా!..మరిన్ని యుద్ధవిన్యాసాలకు నిర్ణయం

ఉక్రెయిన్‌ అంశంపై అమెరికా, రష్యాల మధ్య పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఈ రెండు దేశాల మధ్య భద్రతపరంగా చెలరేగిన అతిపెద్ద సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది సైనికులను మోహరించిన రష్యా తదుపరి వ్యూహం పశ్చిమ దేశాలకు అంతుచిక్కడంలేదు. మరోవైపు ఈ ప్రాంతంలో మరిన్ని సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన రష్యా.. వేడిని రాజేసింది. కరీబియన్‌ ప్రాంతంలో సైనిక మోహరింపులనూ కొట్టిపారేయలేమని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నేతాజీకి జాతి ఘన నివాళులు.. గణతంత్ర దినోత్సవాలకు నేడు శ్రీకారం

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా భారతదేశం నేతాజీకి కృతజ్ఞతాపూర్వక నివాళులర్పిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు.. బోస్‌ను ‘నేషనల్‌ ఐకాన్‌’గా నిలిపాయని, ఆయన ఆశయాలు, త్యాగాలు దేశవాసులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. AP News: రూ.20కోట్ల చిట్టీలు కట్టించిన మహిళ.. అర్ధరాత్రి పరారీకి యత్నం!

చిట్టీల పేరుతో అనంతరపురంలో ఓ మహిళ సుమారు వంద మందిని బురిడీ కొట్టించింది. దాదాపు రూ.20 కోట్ల వసూలు చేసి మోసం చేసింది. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన జయలక్ష్మి బ్యూటీ పార్లర్ నడుపుతూ స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తోంది. ఇరుగుపొరుగున ఉండే వాళ్లు ఆమెను నమ్మి చిట్టీలు కట్టారు. అయితే కొన్నాళ్లుగా ఆమె వారికి డబ్బులివ్వకుండా తప్పించుకొని తిరుగుతోంది. ఇదే క్రమంలో నిన్న అర్ధరాత్రి ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా బాధితులు వెంబడించి పట్టుకొని ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 10. Maruthi: సమయం వచ్చినప్పుడు అన్నీ రివీల్‌ అవుతాయ్‌: మారుతి

నేటితరం యువతను ఆకర్షించే విధంగా విభిన్న ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించి కెరీర్‌లో మంచి పేరు సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ఇటీవల ‘మంచి రోజులొచ్చాయి‌’ చిత్రంతో మిశ్రమ స్పందనలు అందుకున్న ఆయన ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా ‘పక్కా కమర్షియల్‌’ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే మారుతి తదుపరి చిత్రాల గురించి శనివారం పలు వార్తలు బయటకు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* SureshRaina: ‘పుష్ప రాజ్‌’గా సురేశ్‌ రైనా.. కొనసాగుతోన్న హవా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని