Updated : 26 Jan 2022 13:12 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Republic Day: ఏపీలో అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన: గవర్నర్‌ బిశ్వభూషణ్‌

ఏపీ వ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసు దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ: గవర్నర్‌ తమిళిసై

2. Chiranjeevi: చిరంజీవికి కరోనా పాజిటివ్‌.. ట్వీట్‌ చేసిన నటుడు

అగ్ర కథానాయకుడు, నటుడు మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం ఉదయం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘అన్నిరకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Budget 2022: బడ్జెట్‌లో ఈ ప్రకటనే ఉంటే.. 15 ఏళ్లకు రూ.80 లక్షలు పొందొచ్చు!

అత్యంత ప్రజాద‌ర‌ణ పొందిన చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో పీపీఎఫ్ (PPF) ఒక‌టి. పెట్టుబ‌డుల‌కు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబ‌డి అందిస్తున్న ప‌థ‌కం ఇది. ఇందులో అస‌లు, వ‌డ్డీ రెండింటిపైనా ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. అందువ‌ల్ల దీన్ని సేవింగ్స్‌ క‌మ్ టాక్స్‌ సేవింగ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం వార్షికంగా 7.10 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ ప‌థకంలో గ‌రిష్ఠంగా సంవ‌త్సరానికి రూ.1.50 ల‌క్షల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Republic Day: దిల్లీలో ఘనంగా గణతంత్ర సంబరాలు

దేశ రాజధాని దిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందనం చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. 2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్‌ పోలీసు ఏఎస్‌ఐ బాబురామ్‌కు అశోక్‌ చక్ర పురస్కారం వరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Konda Trailer: ఆకట్టుకునేలా ఆర్జీవీ‘కొండా’ ట్రైలర్‌

‘విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు పుట్టుకొస్తారని 180 సంవత్సరాల క్రితం కార్ల్‌మార్క్స్‌ చెప్పినట్లు, సమాజంలో ఏర్పడిన విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వ్యక్తి కొండా మురళీ’ అని అంటున్నారు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. కొండా మురళీ-సురేఖ దంపతుల జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన యాక్షన్‌, ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కొండా’. రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. India Corona: రెండేళ్ల వ్యవధిలో నాలుగు కోట్ల కరోనా కేసులు..!

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించి రెండేళ్లు కావొస్తోంది. ఈ సమయంలో దశలవారీగా వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటి వరకూ నాలుగు కోట్ల కరోనా కేసులు వెలుగు చూశాయి. 4,91,127 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను వెల్లడించింది. మంగళవారం 17 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిచంగా.. 2,85,914 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 11.7 శాతం వృద్ధి నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆండ్రాయిడ్‌ రహస్యం

 ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఆశ్చర్యాల గని! దీనిలోని ట్రిక్స్‌ గురించి.. ముఖ్యంగా రహస్య సంకేతాల గురించి తెలిస్తే ‘ఔరా’ అనాల్సిందే. ‘ఇప్పటివరకూ ఈ విషయం నాకెందుకు తెలియలేదబ్బా’ అని ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఆండ్రాయిడ్‌ రహస్య సంకేతాల ద్వారా సెటింగ్స్‌లోతుల్లోకి వెళ్లకుండానే కొన్ని పనులు చేసుకోవచ్చు. సాధారణంగా ఇవి *, # గుర్తులతో మొదలవుతాయి. అయితే ఈ రహస్య సంకేతాలు అన్ని ఫోన్లలో ఒకేలా ఉండకపోవచ్చు. కంపెనీల హార్డ్‌వేర్‌ కన్ఫిగరేషన్ల బట్టి మారిపోతుండొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. UNSC: ఐరాస వేదికగా పాక్‌ దారుణ రికార్డును బయటపెట్టిన భారత్

2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడి నిందితులకు పాకిస్థాన్‌ మద్దతు ఇంకా అందుతూనే ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్ ఆగ్రహం వ్యక్తం వేసింది. అది చాలక ఆ దేశం భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ.. ఐరాస వేదికను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. సాయుధ పోరాటంలో పౌరుల రక్షణ అనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా ఐరాసలో దాయాది దేశంపై భారత్‌ విరుచుకుపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొవిడ్‌ను 20 నిమిషాల్లో పట్టేయవచ్చు..చౌకైన, స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత పరీక్ష సిద్ధం

కొవిడ్‌-19ను పసిగట్టే చౌకైన, స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులో యాంటిజెన్‌ పరీక్షల్లో ఉండే వేగం, పీసీఆర్‌ పరీక్షల్లో కనిపించే కచ్చితత్వం ఉంటాయి. ఈ సాధనానికి ‘ద హార్మనీ కొవిడ్‌-19’ పరీక్ష అని పేరు పెట్టారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. హార్మనీ కిట్‌ ద్వారా 20 నిమిషాల్లోపే కొవిడ్‌ పరీక్షను పూర్తి చేయవచ్చు. ‘‘తక్కువ ఖర్చుతో ఎక్కడైనా చేయగలిగేలా ఈ పరీక్షను రూపొందించాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Pushpa : బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పుష్ప స్టెప్పులు

క్రికెట్లో ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడో, సెంచరీ బాదినప్పుడో తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్‌ మారిపోయింది. ఎటు చూసినా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమా హవా నడుస్తోంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులను అనుకరిస్తూ క్రికెటర్లు విభిన్నంగా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో పుష్పా ట్రెండ్‌ మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని