Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. Ukraine Crisis: రష్యా ట్యాంకులకు ఆ నదే లక్ష్మణ రేఖా..?
రష్యా దళాల ప్లానింగ్ ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత దారుణంగా ఉంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మాస్కో వ్యూహకర్తల్లో చలనం రావడంలేదు. తాజాగా ఉక్రెయిన్ దళాలు ఒకే చోట 52 రష్యా సాయుధ వాహనాలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విటర్ హ్యాండిల్లో ఉంచింది. ‘‘ఉక్రెయిన్‌కు చెందిన 17 ట్యాంక్ బ్రిగేడ్‌లోని శతఘ్ని దళాలు సెలవులు ఇవ్వడం మొదలుపెట్టాయి. కొందరు సివెర్స్కి డొనెట్స్ నదిలో స్నానం చేస్తుండగా.. మరికొందరు మే నెల సూర్యుడి దెబ్బకు కాలిపోతున్నారు’’ అని వెటకారంగా ట్వీట్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Hyderabad News: మీర్పేట్ యువకుడి హత్యకేసులో కొత్తకోణం
మీర్పేట్ ఠాణా పరిధి ప్రశాంత్‌హిల్స్‌లో ఫేస్బుక్ మిత్రుడితో ప్రియుడిని హత్య చేయించిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వారి మొబైల్ఫోన్ల పరిశీలనలో కొత్త అంశాలు బయటపడినట్టు సమాచారం. ప్రశాంత్‌హిల్స్‌కు చెందిన శ్వేతారెడ్డి(32)కి 2015లో వివాహమైంది. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. బ్యూటీషియన్‌గా ఉన్న ఆమెకు బాగ్ అంబర్పేట్ ఫొటోగ్రాఫర్ యశ్మకుమార్(32)తో ఏర్పడిన ఫేస్బుక్ స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మీరు సినీ ప్రేమికులా?ఈ క్రెడిట్ కార్డులపై ఓ లుక్కేయండి!
కొవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ల పాటు అభిమానులు థియేటర్లకు దూరమయ్యారు. క్రమంగా మహమ్మారి ముప్పు తొలగిపోయి సినిమా హాళ్లు తెరుచుకుంటుండడంతో ఇప్పుడు జనం సినిమాలు చూడడానికి పోటేత్తుతున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2లకు దక్కిన భారీ విజయమే అందుకు నిదర్శనం. మరి మీరు కూడా సినీ ప్రేమికులా? తరచూ థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారా? అలాంటి వారి కోసం కొన్ని బ్యాంకులు ప్రత్యేకమైన క్రెడిట్ కార్డులు అందజేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అట్టిపెట్టుకున్న వాళ్లే ఆడలేకపోయారు.. చెన్నై వైఫల్యానికి కారణాలివే
ఈ సీజన్‌కు ముందు చెన్నై నలుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. వాళ్లే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కెప్టెన్ ధోనీ, విదేశీ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ. ఈ నలుగురూ చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు కావడంతో ఈసారి తమకు ఐదో కప్పును అందిస్తారని జట్టు యాజమాన్యం భావించింది. కానీ, ఈ నలుగురూ విఫలమై ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అలాగే జట్టు ఓటమికి ఇంకొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Dawood Gang: దావూద్ అనుచరుల అరెస్టు..!
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. తాజాగా ఆ గ్యాంగ్ నాయకుడు చోటా షకీల్ అనుచరులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని ఆరీఫ్ అబుబకర్ షేక్, షబ్బీర్ అబూ బకర్షేక్లుగా గుర్తించారు. వీరిద్దరూ పశ్చిమ ముంబయి శివార్లలో డీ-కంపెనీకి చెందిన అసాంఘిక కార్యకలాపాలు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయడం వంటి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సిండికేట్‌లో మొత్తం 21 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ట్విటర్లో కొత్త నియామకాల నిలిపివేత.. ఇద్దరు ఉన్నతాధికారులకు ఉద్వాసన
ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కంపెనీ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులను తొలగించారు. మరికొన్ని రోజుల్లో ట్విటర్.. ఎలాన్ మస్క్ వశం కానున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పరాగ్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వారిలో రీసెర్చి, డిజైన్, ఇంజినీరింగ్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా ఉన్న కీవాన్ బేక్పూర్, హెడ్ ఆఫ్ ప్రోడక్ట్స్ బ్రూస్ ఫాల్క్ ఉన్నారు. ఇరువురూ తమని కంపెనీ నుంచి తొలగించినట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం పితృత్వ సెలవుల్లో ఉన్న బేక్పూర్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు పోలీసుల పిటిషన్
మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈనెల 10న నారాయణను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను చిత్తూరు తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అదే రోజు బెయిల్ పిటిషన్‌ను నారాయణ తరఫు న్యాయవాదులు దాఖలు చేయగా.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. భాజపాపై కేసీఆర్, కేటీఆర్ విష ప్రచారం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
తెలంగాణలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదని కేంద్రమంత్రి, భాజపా నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం జరగనున్న ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. భారీ మార్పులకు సిద్ధమైన హస్తం పార్టీ.. ‘ఒకే కుటుంబం, ఒకే టికెట్’పై ఏకాభిప్రాయం..!
వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్.. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకోసం శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ‘నవ సంకల్ప్ చింతన్ శివిర్-2022’ పేరిట మేధోమథన సదస్సు నిర్వహిస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ దీనికి వేదికైంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో సహా పలు అంశాలపై ఈ సదస్సులో నేతలు చర్చించనున్నారు. అలాగే పార్టీలో భారీ మార్పులపై ప్రకటన చేసే అవకాశమూ ఉంది. ఈ సందర్భంగా సీనియర్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. RRR: స్పెషల్ షాట్స్‌తో ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ ట్రైలర్
రామ్‌చరణ్, తారక్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా మే 20 నుంచి దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త ట్రైలర్‌ని జీ5 షేర్ చేసింది. ఒరిజినల్ ట్రైలర్‌లోని పలు సన్నివేశాలతోపాటు మరికొన్ని స్పెషల్ షాట్స్‌తో ఈ ఓటీటీ ట్రైలర్ సిద్ధమైంది. అడవిలో ఓ చిన్న తండా, అందులో చిరునవ్వులు పూయించే ఓ చిన్నారిని చూపిస్తూ ప్రారంభించిన ఈ ట్రైలర్లో రామ్-భీమ్ కలుసుకోవడం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్