Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 May 2022 13:11 IST

1. ట్విటర్‌ డీల్‌ నిలిపివేతపై పరాగ్‌ కీలక వ్యాఖ్యలు

ట్విటర్‌ను కొనుగోలు చేసే ప్రణాళికను ‘తాత్కాలికంగా నిలిపివేసిన’ట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటనపై సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ స్పందించారు. ఈ డీల్‌ కచ్చితంగా పూర్తవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ.. ఇతర ఊహించని పరిణామాలకూ తాము సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ డీల్‌ మధ్యలోనే ఆగిపోయినా తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాబోయే వందేళ్ల కోసం ‘సుంకిశాల’ ఇన్‌టేక్‌వెల్‌: కేటీఆర్‌

రాబోయే వందేళ్లను దృష్టిలో పెట్టుకొని నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్‌కు ప్రాజెక్టును చేపట్టినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇది సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి సుంకిశాల ఇన్‌టేక్‌వెల్‌ ప్రాజెక్టుకు కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గోధుమ ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం!

దేశవ్యాప్తంగా గోధుమలు, వాటి ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ‘లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ ఆధారంగా మే 13 నాటికి చేసుకున్న ఒప్పందాల మేరకు మాత్రం ఎగుమతులు కొనసాగుతాయని ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌’ స్పష్టం చేసింది. ఇతర దేశాల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఎగుమతులను అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మాజీ మంత్రి ప్రత్తిపాటిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. చిలకలూరిపేటలో ఎన్టీఆర్‌ సుజల తాగునీటి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా.. తనను నెట్టివేశారని మున్సిపల్‌ అధికారి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్తిపాటి సహా ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రత్తిపాటి పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యానారాయణ, ఏ4గా శ్రీనివాసరావును కేసులో చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెచ్చిపోయిన వేటగాళ్లు.. పోలీసులపై కాల్పులు.. ముగ్గురి మృతి

మధ్యప్రదేశ్‌ గుణ జిల్లాలో కృష్ణ జింకల వేటగాళ్లు రెచ్చిపోయారు. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించారు. పోలీసుల కథనం ప్రకారం...అరోన్‌ సమీప అటవీ ప్రాంతంలో కృష్ణ జింకలను వేటాడేందుకు కొందరు దుండగులు విడిది ఏర్పాటు చేసుకున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ జాతవ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సంత్‌ కుమార్‌ మినా, కానిస్టేబుల్‌ నీరజ్‌ భార్గవ్‌ల బృందం గుణ అడవుల్లోకి వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆరోజు తప్పకుండా నటనకు స్వస్తి పలుకుతా: సిద్ధార్థ్‌

నటనకు స్వప్తి పలకడంపై నటుడు సిద్ధార్థ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ వెబ్‌సిరీస్‌ ‘ఎస్కేప్ లైవ్’. సిద్ధార్థ్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ మే 20 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. చాలా ఏళ్ల తర్వాత హిందీలో నటించడంపై  తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్‌ స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అమెరికా టూర్‌.. విజయ్‌, నేనూ ఎంజాయ్‌ చేశాం: అనన్య

7. కిమ్‌ను భయపెడుతోన్న కరోనా.. 

గత రెండేళ్లుగా కరోనా ఊసే లేని ఉత్తర కొరియాలో ఇప్పుడు మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తున్నట్లే కన్పిస్తోంది. ఎన్నడూ లేనిది ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాస్క్‌లో కన్పించడం అక్కడి పరిస్థితులను ఉదహరిస్తోంది. రెండు రోజుల క్రితం ఆ దేశంలో తొలి కొవిడ్‌ కేసు నమోదవ్వగా.. మరణాల లెక్కలు నానాటికీ పెరుగుతున్నాయి. శుక్రవారం మరో 21 మంది తీవ్ర జ్వరంతో ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీంతో రెండు రోజుల్లోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నా గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారు: రఘురామ

నిల్చొనే పరిస్థితి కూడా లేకుండా ఆనాడు తనను కొట్టారని వైకాపా నర్సాపురం ఎంపీ రఘురామ అన్నారు. తన గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారని చెప్పారు. దిల్లీలో రఘురామ మీడియాతో మాట్లాడారు.  ‘‘నా సెల్‌ఫోన్‌ కోసం వెతికి మళ్లీ నన్ను కొట్టారు. మొత్తం ఐదుసార్లు నన్ను తీవ్రంగా కొట్టారు. సీఎం జగన్‌, సునీల్‌ ఇద్దరూ అద్భుత కళాకారులు. ఓ కానిస్టేబుల్‌ వచ్చి ఏం జరిగింది.. ఎవరు కొట్టారని అమాయకంగా అడిగారు. హెడ్‌ కానిస్టేబుల్‌ వచ్చి నన్ను మంచంపై పడుకోబెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అందరిలాగే కోహ్లీ కూడా విసుగు చెందాడు: మైక్‌ హెసన్

అందరిలాగే విరాట్‌ కోహ్లీ కూడా తన ఆట పట్ల విసుగుచెందాడని బెంగళూరు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌ హెసన్‌ అన్నాడు. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులే చేసి మరోసారి నిరాశపర్చిన కోహ్లీ.. పెవిలియన్‌కు చేరేటప్పుడు తీవ్ర అసహనంతో కనిపించాడు. 210 పరుగుల భారీ ఛేదనలో కెప్టెన్‌ డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన అతడు 3.2 ఓవర్‌కు రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, అంతలోపే 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాధించి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Fire Accident: నా కూతురెక్కడ..? ఏ ఆసుపత్రిలోనూ కనిపించట్లేదు..!

దేశ రాజధాని దిల్లీలోని ముంద్కా మెట్రోస్టేషన్ పరిధిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో దాదాపు 27 మంది సజీవ దహనం కాగా.. 12 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో కొన్ని దయనీయ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని